ముషీరాబాద్/కవాడిగూడ: నగరంలోని ఇందిరా పార్కులో గంధం చెట్ల స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అర్ధరాత్రిపూట కొంతమంది స్మగ్లర్లు గంధపు చెట్లను రంపంతో కోసుకుని లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ హారి్టకల్చర్ అధికారులు గాం«దీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజులుగా ఇందిరాపార్క్ సెక్యూరిటీ సిబ్బంది, సమీపంలో నివాసితులను విచారిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అధికారులు నిద్రమత్తును వీడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో ఇందిరాపార్క్ నుంచి సందర్శకులు వెళ్లిన అనంతరం రాత్రి 10 గంటలకు సిబ్బంది లైట్లను ఆర్పి వారు వెళ్లేపోయేవారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లను అలాగే ఉంచేవారు.
- ఇటీవల ఆటోమేటిక్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి, రాత్రి 10 గంటల తర్వాత పార్క్ మొత్తం లైట్లను ఆరి్పవేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వెలిగేలా సిస్టంను రూపొందించారు.
- దీనిని అలుసుగా తీసుకున్న కొందరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో లోయర్‌ట్యాంక్ కట్టమైసమ్మ ప్రాంతం నుంచి ఇందిరాపార్క్‌లోకి చొరబడుతున్నారు. గంధం చెట్లను పెద్ద పెద్ద రంపాలతో నరికి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
పదేళ్ల క్రితం ఇదే తరహాలో స్మగ్లింగ్
- పదేళ్ల క్రితం ఇదే పార్క్‌లో ఉన్న గంధం చెట్లను స్మగ్లర్లు నరుక్కుని అక్రమంగా తరలించారు. దీనిపై అప్పట్లో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత భద్రతను పెంచారు.
రెండ్రోజుల కిత్రం..
- గత ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు పార్క్‌లోకి చొరబడ్డారు. సుమారు 11 గంధపు చెట్లను రంపాలతో కోసి కొమ్మలను అక్కడే పడేసి దుంగలను మాత్రం లోయర్‌ట్యాంక్‌బండ్ వైపుగా తరలించారు.
- విషయం తెలుసుకున్న అధికారులు ఉదయం 4 గంటలకు ఇందిరాపార్క్‌కు వచ్చే వాకర్స్ కంటపడకుండా కొమ్మలను సైతం తీసివేసినట్లు తెలిసింది. అనంతరం గాం«దీనగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు.
- రంగంలోకి దిగిన పోలీసులు పార్క్ సెక్యూరిటీని, అధికారులతో పాటు సమీపంలో నివసించే వారిని సైతం గుట్టుచప్పుడు కాకుండా విచారిస్తున్నారు.
- దీనిపై చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌ను వివరణ కోరగా.. రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. విచారణ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ స్మగ్లింగ్‌కి పాల్పడింది బయట వ్యక్తులేనని, ఇందిరాపార్క్ సిబ్బంది సహకారం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment