Sandile Wood
-
నాకు సోదరి కూడా ఉందంటూ ఫోటో షేర్ చేసిన దుల్కర్
సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్లో జెండా పాతిన హీరోల్లో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. సీతారామం, చుప్,కింగ్ ఆఫ్ కొత్త లాంటి సినిమాల ద్వారా ఇటు మలయాళ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో కూడా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటో తన అక్క సురుమి తీసినట్లు ఆయన తెలిపాడు. మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్.. తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. ఇండస్ట్రీలో సూపర్ హిట్లు కొడుతున్నాడు. కానీ ఆయన సోదరి సురుమి మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె చాలా పెయింటింగ్స్ వేయడం జరిగింది. దుల్కర్, సురుమి ఇద్దరూ కూడా మంచి స్నేహితుల్లా ఉంటారు. తన సోదరి సురుమి తీసిన ఫోటోను దుల్కర్ షేర్ చేశాడు. ఆ ఫోటోలో దుల్కర్‌తో ఉన్న వ్యక్తి సురుమి భర్త డా. ముహమ్మద్ రేహాన్ షాహిద్ అని అభిమానులు గుర్తించారు. ఆ ఫోటోకు క్యాండిడ్ క్యాప్చర్ అనే టైటిల్‌ను ఆయన చేర్చాడు. మై వన్ అండ్ ఓన్లీ, సిబ్లింగ్ క్లిక్, బెస్ట్, క్యాండిడ్ ఫోటోలు, స్పెషల్ సమ్మిట్, క్లీనింగ్ అప్, బిజినెస్మెన్ అనే ట్యాగ్‌లతో దుల్కర్ చిత్రాన్ని పంచుకున్నాడు. సోదరి తీసిన ఆ ఫోటో అభిమానుల దృష్టిని త్వరగా ఆకర్షించింది. బావ బావమరుదుల ముఖాలు కూడా స్పష్టంగా ఉండేలా ఫోటో షేర్ చేసి ఉంటే బాగుండని వ్యాఖ్యానిస్తున్నారు. దుల్కర్ తన బావతో కలిసి ఫార్మల్ డ్రెస్‌లో స్టైలిష్ స్మైల్‌తో ఫోటోలో కనిపించాడు. 'నాకు ఒక సోదరి ఉంది.. ఆమె నేరుగా నిలబడి ఫోటోకు ఎలా పోజులివ్వాలో కూడా ఆమెకు తెలియదు. దుల్కర్ తరచుగా తండ్రి, సోదరి మోడల్‌గా పోజులిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఒక సినిమాలో భాగంగా దుల్కర్‌తో మమ్ముట్టి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ సినిమాకు సురుమి మాత్రమే ఎందుకు రాలేదని నెటిజన్లు కామెంట్లు చేశారు. వాటికి స్వయంగా సురుమినే సమాధానమిచ్చింది. తనకు సినిమాలంటే ఇష్టమని, అయితే కెమెరా ముందుకు రాలేనని, తెరపై సోదరుడిలా కనిపించడం తనకు ఇష్టం లేదని సురుమి తెలిపింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సురుమి పెయింటింగ్ అక్కడి ఎగ్జిబిషన్లో పాపులర్ అయింది. తొమ్మిదో తరగతి నుంచి చిత్రలేఖనంపై ఆమెకు పట్టు ఉంది. సురుమికి ఇద్దరు కుమారులు. బెంగుళూరులో తన భర్త ముహమ్మద్ రేహాన్ షాహిద్‌తో సురుమి ఉంది. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
'కాంతారా' అభిమానులకు శుభవార్త ప్రకటించిన రిషబ్ శెట్టి
కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్‌ని అందించిన చిత్రం ‘కాంతారా’. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఇండియా అంతటా హిట్ అయ్యింది. విడుదలైన ఐదు భాషల్లో సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది.హోంబలే ఫిలింస్ నిర్మించిన 'కాంతారా' భారతదేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం కారణంగానే రిషబ్ శెట్టి కాంతారాను సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు. సినిమా ప్రకటన అయితే ఇచ్చారు కానీ గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సినీ వర్గాలకు ఓ శుభవార్తను అందించారు. 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. నవంబర్ 27న 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు రిషబ్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ ఏడాది పెద్దగా సినిమాలు లేని సినీ పరిశ్రమకు రిషబ్ శెట్టి శుభవార్త అందించాడు. రెండు రోజుల్లో ఫస్ట్ లుక్ రివీల్ కానుంది. ప్రత్యేకించి ఈసారి 5 భాషల్లో కాకుండా 7 భాషల్లో సినిమా విడుదల కానుంది. మొత్తం ఐదు భాషల్లో 'కాంతారా' విడుదల అయ్యి ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఆదరణ పొందింది. కాబట్టి కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
కారులో అనుమానాస్పదంగా ప్రముఖ నటుడి మృతదేహాం
మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు వినోద్ థామస్ (47) మరణించారు. ఆయన అనుమానాస్పదంగా మరణించినట్లు తెలుస్తోంది. మలయాళంలో పాపులర్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ఇదే సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేశాడు. గత రాత్రి (నవంబర్ 18) కేరళలోని కొట్టాయం జిల్లా బంబడి ప్రాంతంలోని ఓ హోటల్ పార్కింగ్ వద్ద చాలా సమయం నుంచి అనుమానాస్పదంగా ఒక కారు ఆగి ఉంది. దానిని గమనించిన హోటల్ సిబ్బంది. కారు వద్దకు వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అందులో మృత దేహం కనిపించింది. వెంటనే డోర్ క్లోజ్ చేసి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారు కారును పరిశీలించి ఆ మృతదేహాన్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతడు మలయాళ నటుడు వినోద్ థామస్ అని తేలింది. ‘అయ్యప్పనుమ్ కోషి’, ‘నాతోలి ఏరు ఒకిత మీనాళ్ల’ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించడం గమనార్హం. ఈ సంఘటనతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.వినోద్ థామస్‌ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అలాగే వినోద్ థామస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగించారు.ఈ కేసులో వినోద్ థామస్ మృతిపై పోలీసులు పలు కోణాల్లో ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. -
మమ్ముట్టికి మైల్స్టోన్ చిత్రంగా 'కన్నూర్ స్క్వాడ్'.. కథ ఏంటంటే?
శాండిల్‌వుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా విడుదల చేసిన 'కన్నూర్ స్క్వాడ్' 100 కోట్ల క్లబ్లో చేరింది. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మమ్ముట్టి నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా మమ్ముట్టి సంస్థ షేర్ చేసింది. 100 కోట్ల క్లబ్లో చేరిన మమ్ముట్టికి ‘కన్నూర్ స్క్వాడ్’ నాలుగో చిత్రం. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్) గతంలో 'భీష్మ పర్వం', 'మధురరాజా', 'మామాంగమ్' చిత్రాలు కూడా మమ్ముట్టి 100 కోట్ల క్లబ్లో చేరిన మలయాళ సినిమాలు. ‘కన్నూర్ స్క్వాడ్’ చిత్రం విడుదలైన రోజు నుంచి థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికీ కూడా వీకెండ్లో కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. 'కన్నూర్ స్క్వాడ్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరి మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. 'కన్నూర్ స్క్వాడ్' కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమా విజయాన్ని అభినందించారు. ‘కన్నూర్ స్క్వాడ్’ చూనిట్ సభ్యులందరికీ సోషల్ మీడియా ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. ఈ చిత్రంపై చూపిన అంతులేని ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. కథ ఏంటి..? కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్‌కు సవాల్‌గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఎలాంటి ఆదారాలు లేని ఈ క్రైమ్‌ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్‌పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకుతెస్తుంది. -
సైమా అవార్డ్స్: కాంతారా, కేజీఎఫ్ మధ్య పోటీ.. విజేతల జాబితా ఇదే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) సెప్టెంబర్ 15న అట్టహాసంగా ప్రారంభమైంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 11వ ఎడిషన్ సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే తెలుగు,కన్నడ సినీ రంగంలోని ప్రముఖులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నేడు తమిళ్,మలయాళం చిత్రాలకు అందించనున్నారు. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) కన్నడలో కాంతారా, చార్లీ 777, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి చిత్రాలకు భారీగా అవార్డులు వచ్చాయి. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’లో అద్భుత నటనకుగానూ యష్ 'ఉత్తమ నటుడు' అవార్డును, శ్రీనిధి శెట్టి 'ఉత్తమ నటి' అవార్డును గెలుచుకున్నారు. కాంతారా చిత్రంలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును గెలుచుకున్నాడు. రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అత్యధికంగా కాంతారా సినిమాకు 10 అవార్డులు వచ్చాయి. కన్నడ చిత్రసీమలో అవార్డు దక్కించుకున్న వారి జాబితా ఇదే. కన్నడ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (కన్నడ): ( 777 చార్లీ) * ఉత్తమ నటుడు (కన్నడ): యష్ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నటి (కన్నడ): శ్రీనిధి శెట్టి (KGF చాప్టర్ 2) * ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి -(కాంతారా) * ఉత్తమ సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోక్‌నాథ్ (కాంతారా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : రిషబ్ శెట్టి (కాంతారా) * ఉత్తమ నటి ( క్రిటిక్స్) : సప్తమి గౌడ (కాంతారా) * ఉత్తమ విలన్ : అచ్యుత్ కుమార్ (కాంతారా) * ఉత్తమ సహాయ నటుడు : దిగంత్ మంచలే (గాలిపాట 2) * ఉత్తమ సహాయ నటి : శుభ రక్ష (హోమ్ మినిస్టర్) * ఉత్తమ నటుడు: ప్రకాష్ తుమినాడ్ (కాంతారా) * ఉత్తమ గేయ రచయిత (కన్నడ) : ప్రమోద్ మరవంతే 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ) : విజయ్ ప్రకాష్, 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయని (కన్నడ): సునిధి చౌహాన్, 'విక్రాంత్ రోనా'లోని 'రా రా రక్కమ్మ' పాట కోసం * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : భువన్ గౌడ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నూతన దర్శకుడు: సాగర్ పురాణిక్ (డొల్లు) * ఉత్తమ నూతన నిర్మాత : అపేక్ష పురోహిత్,పవన్ కుమార్ వాడెయార్ (డొల్లు) * ఉత్తమ నూతన నటుడు: పృథ్వీ షామనూర్ (పదవి పూర్వ) * ఉత్తమ నూతన నటి: నీతా అశోక్ (విక్రాంత్ రోనా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : రిషబ్ శెట్టి (కాంతారా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : ముఖేష్ లక్ష్మణ్ (కాంతారా) * ప్రత్యేక ప్రశంస అవార్డు ఉత్తమ నటుడు (కన్నడ): రక్షిత్ శెట్టి (చార్లీ 777) -
పేరుకే నా తమ్ముడు.. తండ్రిలా నా కోసం ఏం చేశాడంటే: పునీత్ అన్నయ్య
మనిషికి కష్టాలు వచ్చినప్పుడే జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. తన వాళ్లు ఎవరో.. పరాయి వాళ్లు ఎవరో తెలుస్తుంది. జీవితంలో నిజమైన ఆప్తులు ఎవరో తెలియాలంటే బలమైన కష్టాలు రావాలి అనే మాట నూటికి నూరు శాతం నిజం. అలా ఎన్నో కష్టాలను ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎదుర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరిని చూస్తే మరొకరికి ప్రేమ... కన్నడ సినీ ఇండస్ట్రీలో పునీత్ రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్ (శివన్న),రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లు రక్తసంబంధానికి ఉన్న విలువలను అనేకమార్లు చాటిచెప్పారు. ఈ ముగ్గురిలో అందరి కంటే పెద్దవారు శివన్న.. చివరి వాడు పునీత్ రాజ్‌కుమారు అని తెలిసిందే. (ఇదీ చదవండి: అనారోగ్యంతో తండ్రి.. తన పంతాన్ని పక్కన పెట్టేసిన విజయ్) తాజాగా పునీత్ గురించి తన రెండో అన్న రాఘవేంద్ర పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. పునీత్ రాజ్‌కుమార్‌ను తామందరం ఇంట్లో 'అప్పు' అని ప్రేమగా పిలుచుకుంటామని ఆయన గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబంలోని అందరిపై అప్పు ప్రేమ ఒకేలా ఉంటుందని రాఘవేంద్ర ఇలా చెప్పాడు. 'నాకంటే అప్పు పదేళ్లు చిన్నవాడు.. అందుకే వాడిని నేను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూశాను. పునీత్ బతికి ఉన్నప్పుడు కూడా కొడుకులానే భావించేవాడిని... అప్పును చిన్నప్పటి నుంచి నేనే షూటింగ్‌కి తీసుకెళ్లేవాడిని.. వాడికి స్నానం కూడా చెయించేవాడిని అలా మా మధ్య తండ్రీకొడుకుల బంధం ఏర్పడింది. ఒక సినిమాలో కూడా ఇద్దరం కలిసి అలాంటి పాత్రలలోనే కనిపించాం.' అని రాఘవేంద్ర చెప్పాడు పునీత్ రాజ్‌కుమార్ రక్తసంబంధానికి మంచి మెసేజ్ ఇచ్చి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తన అన్నయ్య గుర్తుచేసుకున్నారు. శివన్న, పునీత్‌లకు ఇద్దరికీ చెరో ఇల్లు ఉండేది. కానీ తనకు మాత్రమే సొంత ఇల్లు లేదని రాఘవేంద్ర చెప్పాడు. అలాంటి సమయంలో అప్పునే తనకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు. వారిద్దరి ఇంటి కంటే ఎంతో గొప్పగా ఇంటిని నిర్మించి తనకు ఇచ్చాడని పేర్కొన్నాడు. పునీత్ లేకుంటే ఇప్పటికి కూడా తాను ఇంత ఖరీదైన ఇల్లు నిర్మించుకునే వాడిని కాదని ఆయన చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్) 'అప్పట్లో నేను సినిమాల్లో నటించడం మానేశాను.. దీంతో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అప్పట్లో నేను ఒంటరిగా ఆ కష్టాలను భరించేవాడిని ఎవరితోను చెప్పుకునే వాడిని కాదు. అలాంటి సమయంలో నా పరిస్థితిని గమనించి మా ఇంటి బాధ్యతను పునీత్ తీసుకున్నాడు. ఆర్థిక సాయంతో పాటు కొన్ని సినిమా అవకాశాలను కూడా అప్పూనే ఇప్పించాడు. ఏ సినిమా చేసినా నన్నూ వాడి వెంట ఎక్కడికైనా తీసుకెళ్లేవాడు. అతను నాకు అన్నయ్య స్థానం ఇచ్చాడు, కానీ.. తండ్రిగా నా జీవితాన్ని నిలబెట్టి ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.' అని పునీత్ రాజ్‌కుమార్‌ను ఆయన గుర్తుచేసుకున్నాడు. -
Aparna Nair: 50 పైగా సినిమాలతో మెప్పించిన ప్రముఖ నటి మృతి.. పలు అనుమానాలు
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మరణవార్త అక్కడ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేరళ పరిశ్రమలో సినీ నటి మరణవార్త కలిచి వేసింది. మలయాళంలో సుమారు 50 సినిమాలతో పాటు బుల్లితెరపై పలు సీరియల్స్‌తో చురుగ్గా ఉండే నటి అపర్ణా నాయర్ (33).. తెలుగులో కూడా 'చిన్ని చిన్ని ఆశ' అనే సినిమాలో హీరోయిన్గా నటించారు. ఆమె నిన్న (ఆగస్టు 31) రాత్రి 7 గంటలకు రాజధాని తిరువనంతపురంలోని కరమణ తలియాల్లోని తన ఇంట్లో మృతి చెందారు. కానీ ఆమె మరణానికి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర తెలిస్తే.. ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే) అపర్ణ మరణం పట్ల పలు అనుమానాలు ఉన్నాయని అక్కడి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ తగాదాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. అపర్ణా నాయర్ మలయాళం సినిమాలు, సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడ ఆమె తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనేది నిజం.. దీంతో ఆమె అభిమానులు తీవ్ర శోకంలో ఉన్నారు. అపర్ణ మృతదేహాన్ని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నటుడు సంజిత్ను ఆమె వివాహం చేసుకుంది. వారికి త్రయ, కృతిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. (ఇదీ చదవండి: 'ఖుషి' రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్) ఇప్పటికే ఆమె మృతిపై కరమన పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలో నటి మృతికి గల కారణాలు తెలుపాతమని చెప్పారు. అపర్ణా నాయర్ తిరువనంతపురంలో ఉండేవారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఆమె తల్లి, సోదరి ఉన్నట్లు సమాచారం. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న అపర్ణను చూసి వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. కూతురిని పోగొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అపర్ణ మృతికి అభిమానులు సంతాపం నటి అపర్ణ మృతి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను, సన్నిహితులను తీవ్ర వేదనకు గురిచేసింది. నటి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు చెందిన సహచరులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అపర్ణా నాయర్ 2005లో మయూఖం సినిమాతో అరంగేట్రం చేసి, ఆ తర్వాత రన్ బేబీ రన్, సెకండ్స్, అచ్చయాన్స్, మేఘతీర్థం, ముద్దుగౌ, కార్ట్ సమక్షమ బాలన్ వాకిల్, కల్కి వంటి అనేక చిత్రాలతో పాటు చందనమజ, ఆత్మసఖి సీరియల్స్‌లో నటించారు. -
సర్ప్రైజ్ న్యూస్.. మరో పాన్ ఇండియా సినిమాలో అనుష్క.. గ్లింప్స్ విడుదల
అరుంధతితో తిరుగులేని విజయాన్ని అందుకున్న అనుష్క… జేజెమ్మగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ సినిమా ఆమె సినీ జీవితానికే ఓ మలుపుగా చెప్పుకోవచ్చు.. ఆ తర్వాత బాహుబలి ఫ్రాంచైజ్‌తో ఆమెకు పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు దక్కింది. ఇలా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకుంది. కానీ సైజ్ జీరో సినిమా నుంచి చాలా గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) ఇదిలా ఉండగా అనుష్క శెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో జాయిన్ అయింది. మలయాళ చిత్ర సీమ నుంచి వస్తున్న ఫాంటసీ హారర్ డ్రామా 'కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్' సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో జాతీయ అవార్డు అందుకున్న మలయాళ టాప్ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు. (ఇదీ చదవండి: నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. కానీ ఆమె మరో హీరోతో .. : విజయ్ సేతుపతి) ఈ మూవీకి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మొత్తం 14 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం. వచ్చే ఏడాది (2024)లో పార్ట్-1 విడుదల కానుందని వెల్లడించారు. సుమారు రెండు నిమిషాల పాటు ఉన్న ఈ గ్లింప్స్ వెన్నులో వణుకు పుట్టించేలా విజువల్స్ ఉన్నాయి. -
హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు
మనీలాండరింగ్ కేసులో మలయాళ ప్రముఖ నటి నవ్య నాయర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్‌తో నవ్య నాయర్‌కు సన్నిహిత స్నేహం ఉందని ఈడీ గుర్తించింది. ఈ కేసులో నవ్య నాయర్‌ను ముంబయికి పిలిపించి ఈడీ ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ అవుతానని ఊహించలేదు..ఆ చిత్రం నాకు చాలా స్పెషల్: ఆనంది) సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సచిన్ సావంత్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆదారాలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా అతని మొబైల్ డేటాను అధికారులు పరిశీలించారు. అందులో వాట్సప్ ద్వారా ఆయన చేసిన చాటింగ్స్ స్టేట్మెంట్లను వారు సేకరించారు. దీనిలో భాగంగానే ఆయనతో నవ్య నాయర్‌కు మంచి పరిచియమే ఉందని ఈడీ గుర్తించింది. వాటి అధారంగా ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్, నవ్య నాయర్ చాలా సన్నిహితంగా మెలిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నటి నవ్య నాయర్‌ని కలిసేందుకు సచిన్ సావంత్ సుమారు 10 సార్లు పైగానే కొచ్చిన్‌కు కూడా వెళ్లినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఈడీ ప్రశ్నిస్తే... తనకు సచిన్ సావంత్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపింది. తామిద్దరం కేవలం స్నేహితులమనే తెలిపింది. కానీ నవ్య నాయర్‌కు సచిన్ సావంత్ నగలతోపాటు కొన్ని బహుమతులు ఇచ్చాడని పక్కా ఆధారాలతో విచారణలో తేలింది. దీనికి సమాధానంగా సచిన్ తమ స్నేహానికి గుర్తుగా కొన్ని నగలను బహుమతిగా ఇచ్చాడని నవ్య నాయర్ తెలిపింది. ఆమె వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఈడీ జత చేసింది. ఎవరీ సచిన్ సావంత్ సచిన్ సావంత్ గతంలో ముంబైలోని జోనల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా (ED) నియమించబడ్డారు . సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అతన్ని అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సచిన్ సావంత్ పేరును చేర్చింది. ప్రస్తుతం కస్టమ్స్, జీఎస్టీ అదనపు కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నాడు. అతను భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారలు లభించడంతో సీబీఐ ఎంట్రీ ఇచ్చి అతన్ని విచారిస్తుంది. ఈ విచారణలో కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులు, సన్నీహితుల పేర్లతో పెద్ద పెద్ద భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసు విచారణలో భాగంగానే మలయాళ నటి నవ్య నాయర్ పేరు తెరపైకి వచ్చింది. -
స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.!
బాలనటిగానే సినీ రంగప్రవేశం చేసిన నిత్యామీనన్ హీరోయిన్గా మాత్రం 2006లో కథానాయకిగా కన్నడ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా నిత్యామీనన్‌కు మంచి గుర్తింపు ఉంది. చిత్రపరిశ్రమలో హీరోయిన్గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. కానీ ఇప్పుడు ఆమెకు అంతగా సినిమా అవకాశాలు లేవనే చెప్పవచ్చు. దీంతో ఇక పెళ్లి చేసుకోమని తన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారట. (ఇదీ చదవండి; బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్) అంతేకాకుండా తనకు 35 ఏళ్లు వచ్చాయని ఇక పెళ్లి చేసుకోవడం మంచిదని వారు సలహా ఇచ్చారట. దీంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ మలయాళ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందని శాండిల్‌వుడ్‌లో ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా నిత్యామీనన్ పెళ్లి విషయంపై చాలా వార్తలే వచ్చాయి. కానీ వాటిని ఆమె వెంటనే కొట్టిపారేసేది కూడా. కానీ ఈసారి మలయాళీ ఇండస్ట్రీలో మాత్రం నిత్యామీనన్ పెళ్లి వార్త బాగానే వైరల్ అవుతుంది. అంతే కాకుండా అక్కడి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఇది నిజమేనని తెలుపుతున్నారట. (ఇదీ చదవండి: అనుష్కతో హగ్స్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్) ఆమె పెళ్లి మాత్రం ప్రముఖ హీరోతోనే జరుగుతుందంటూనే పేరు మాత్రం వారు రివీల్ చేయడం లేదట. గతంలో తన పెళ్లి విషయంపై ఎక్కడైనా చిన్న కామెంట్ వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యే నిత్యా ఈసారి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో తన పెళ్లి వార్త నిజమేనని, త్వరలో ఆమె అధికారికంగా ప్రకటిస్తారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నిత్యామీనన్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో మరోసారి భారీగా ట్రెండ్ అవుతుంది. -
పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం.. గుండెపోటుతో స్పందన మృతి
కన్నడ ప్రముఖ నటుడు,సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మరణించారు. కుటుంబంతో కలిసి బ్యాంకాక్‌కు విహారయాత్రకు వెళ్లిన స్పందన అక్కడ గుండెపోటుతో మరణించారు. ఆమె ఆకస్మిక మరణ వార్తతో కుటుంబ సభ్యులతో పాటు శాండల్‌వుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు. 2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచి స్పందన మరణించడం చాలా బాధాకరమైన సంఘటననే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) ఈ నెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. 2007లో విజయ్ రాఘవేంద్రను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. విజయ రాఘవేంద్ర, స్పందన జంటకు శాండల్‌వుడ్‌లో భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. తన భర్త సినిమాలకు స్పందననే నిర్మాతగా ఉండి పలు సినిమాలను కూడా నిర్మించింది. తుళు కుటుంబానికి చెందిన స్పందన మాజీ పోలీసు అధికారి శివరామ్ కుమార్తె. 2017లో విడుదలైన రవిచంద్రన్ చిత్రం అపూర్వలో కూడా ఆమె అతిధి పాత్ర పోషించింది. స్పందన భౌతికకాయం రేపటిలోగా బెంగళూరుకు తీసుకురానున్నట్లు సమాచారం. శాండల్‌వుడ్‌లో పాపులర్ యాక్టర్ అయిన స్పందన భర్త విజయ్ రాఘవేంద్ర నటించిన 'చిన్నారి ముఠా' సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. అక్కడి పరిశ్రమలో ఆయన సుమారు 50 సినిమాలకు పైగా నటించగా 20కు పైగా పాటలు పాడారు. ప్రస్తుతం పలు టీవీ షోలలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దిగ్భ్రాంతికి గురి చేసింది: కర్ణాటక ముఖ్యమంత్రి ప్రముఖ కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన అకాల మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. స్పందనను కోల్పోయిన విజయ రాఘవేంద్ర, బికె శివరామ్‌ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. -
నా భార్య నమిత డ్రగ్స్ విక్రేతతో వివాహేతర సంబంధం పెట్టుకుంది : సినీ నిర్మాత
తన భార్య మత్తు పదార్థాలకు బానిస కావడంతో పాటు డ్రగ్స్ విక్రేతతో అక్రమ సంబంధం పెట్టుకుందని కన్నడ నటుడు, నిర్మాత టి చంద్రశేఖర్ భార్య నమిత, ఆమె స్నేహితుడు లక్ష్మీశ్ ప్రభులపై బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రెండేళ్ల క్రితం చంద్రశేఖర్, నమితను పెళ్లాడారు. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) బనశంకరి సెకండ్ స్టేజీ లో నివాసం ఉంటున్నారు. నమిత మత్తు పదార్థాలకు అలవాటు పడింది, మానేయాలని బుద్ధిమాటలు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఆమెకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న లక్ష్మీశ్ ప్రభుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఇంటిలో ఇద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ప్రశ్నిస్తే నాపైనే దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: కళ్యాణ్ రామ్ హీరోయిన్ ఇలా కనిపించేసరికి ఆశ్చర్యపోయిన అభిమాని) తప్పుడు ఆరోపణలన్న భార్య కాగా, భర్త తనపై దాడి చేశాడని భార్య నమితా కూడా ఫిర్యాదు చేసింది. తనకు లక్ష్మీశ్ స్నేహితుడు మాత్రమేనని, భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు నమితా పేర్కొంది. అతని స్నేహితులు అరుణ్, హేమంత్లు తనపై చాకుతో దాడి చేసినట్లు, ఇంటిలో డ్రగ్స్ పెట్టి అరెస్ట్ చేయిస్తానంటూ బెదిరిస్తున్నట్లు నమిత ఫిర్యాదులో తెలిపింది. ఇరువైపుల ఫిర్యాదును తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..
కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ 'అభి' సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. అలా 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో తను చెరగని ముద్ర వేశారు. తెలుగులో కూడా నందమూరి కళ్యాణ్‌రామ్ అభిమన్యు సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో రమ్య అభినయం అందరినీ ఆకట్టుకున్నారు. (ఇదీ చదవండి: నాడు విజయ్ పేరుతో వైరల్.. నేడు మళ్లీ ఇలా ట్రెండింగ్‌లో) కన్నడలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమాలే కాకుండా.. ఆమె రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీగా మాండ్య ప్రజలకు సేవలందించించారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు. కాగా సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటోన్న రమ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తన పర్సనల్ విషయాలతో పాటు ఫొటోలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శాండల్‌వుడ్ క్వీన్ రమ్య మళ్లీ తెరపైకి వచ్చారు. దీంతోపాటు 'యాపిల్ బాక్స్ స్టూడియోస్' అనే నిర్మాణ సంస్థ ద్వారా కొత్త సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. చాలా ఏళ్లుగా తెరపై కనిపించకపోయినా ఆమెకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా రమ్య ఓ అభిమానితో ఫోటో దిగారు. అదే సమయంలో అభిమానితో రమ్య పలకరించిన తీరు అక్కడి వారందరిని మెప్పిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ) తన అభిమానులతో ఇంత సాదాసీదాగా వ్యవహరించడమే కాకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఆమె అభిమానులకు సంతోషాన్నిచ్చింది. రమ్య సింప్లిసిటీని అభిమానులతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Raone Pavan (@raone_pavan) -
ఇందిరా పార్కులో గంధం చెట్ల స్మగ్లింగ్
-
ఇందిరా పార్కులో ‘గంధం’ దొంగలు
ముషీరాబాద్/కవాడిగూడ: నగరంలోని ఇందిరా పార్కులో గంధం చెట్ల స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అర్ధరాత్రిపూట కొంతమంది స్మగ్లర్లు గంధపు చెట్లను రంపంతో కోసుకుని లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హారి్టకల్చర్ అధికారులు గాం«దీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజులుగా ఇందిరాపార్క్ సెక్యూరిటీ సిబ్బంది, సమీపంలో నివాసితులను విచారిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు నిద్రమత్తును వీడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో ఇందిరాపార్క్ నుంచి సందర్శకులు వెళ్లిన అనంతరం రాత్రి 10 గంటలకు సిబ్బంది లైట్లను ఆర్పి వారు వెళ్లేపోయేవారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లను అలాగే ఉంచేవారు. ఇటీవల ఆటోమేటిక్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి, రాత్రి 10 గంటల తర్వాత పార్క్ మొత్తం లైట్లను ఆరి్పవేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వెలిగేలా సిస్టంను రూపొందించారు. దీనిని అలుసుగా తీసుకున్న కొందరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో లోయర్‌ట్యాంక్ కట్టమైసమ్మ ప్రాంతం నుంచి ఇందిరాపార్క్‌లోకి చొరబడుతున్నారు. గంధం చెట్లను పెద్ద పెద్ద రంపాలతో నరికి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. పదేళ్ల క్రితం ఇదే తరహాలో స్మగ్లింగ్ పదేళ్ల క్రితం ఇదే పార్క్‌లో ఉన్న గంధం చెట్లను స్మగ్లర్లు నరుక్కుని అక్రమంగా తరలించారు. దీనిపై అప్పట్లో జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత భద్రతను పెంచారు. రెండ్రోజుల కిత్రం.. గత ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు పార్క్‌లోకి చొరబడ్డారు. సుమారు 11 గంధపు చెట్లను రంపాలతో కోసి కొమ్మలను అక్కడే పడేసి దుంగలను మాత్రం లోయర్‌ట్యాంక్‌బండ్ వైపుగా తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఉదయం 4 గంటలకు ఇందిరాపార్క్‌కు వచ్చే వాకర్స్ కంటపడకుండా కొమ్మలను సైతం తీసివేసినట్లు తెలిసింది. అనంతరం గాం«దీనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పార్క్ సెక్యూరిటీని, అధికారులతో పాటు సమీపంలో నివసించే వారిని సైతం గుట్టుచప్పుడు కాకుండా విచారిస్తున్నారు. దీనిపై చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌ను వివరణ కోరగా.. రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. విచారణ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ స్మగ్లింగ్‌కి పాల్పడింది బయట వ్యక్తులేనని, ఇందిరాపార్క్ సిబ్బంది సహకారం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు. -
సంపాదనలో 10 శాతం రైతుల సంక్షేమానికి...
మండ్య : తాను నటించిన సినిమాల ద్వారా అందుతున్న ఆదాయంలో పది శాతాన్ని రైతుల సంక్షేమానికి వెచ్చించనున్నట్లు శాండిల్‌వుడ్ నటుడు నీనాసం సతీష్ తెలిపారు. మంగళవారం మండ్యలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తాను నటించిన రాకెట్ సినిమాలో వచ్చే లాభంలో పది శాతాన్ని ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు అందించనున్నట్లు చెప్పారు. ఇకపై తన ఆదాయంలో పది శాతాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తానని పేర్కొన్నారు. మండ్య జిల్లాలో నెలకొన్న కరువు కారణంగా పంటలు సక్రమంగా పంటలు పండక, పండిన పంటలు చేతికి రాక, వచ్చినా పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధకరమని అన్నారు. ఒక రైతు బిడ్డగా. తాను ఇక్కడే పుట్టి పెరిగానని, రైతుల కుటుంబంలో ఎన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో తాను అనుభవించానని, అందు కోసమే తనకు వచ్చే లాభంలో 10 శాతాన్ని ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇస్తానని అన్నారు. పరభాషా చిత్రాలను కన్నడలోకి డబ్బింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. -
విక్రమ్ ప్రభుతో శాండిల్ ఉడ్ బ్యూటీ
సినిమా అనే మహా ప్రపంచంలో కొత్త నీరు రాక, పాత నీరు పోక సర్వసాధారణం. అయితే ఇక్కడ అరుదెంచిన అందరూ నిలదొక్కుకుంటారని చెప్పలేము. అందుకు అందం, అభినయం ఉన్నా సరిపోదు. అదృష్టం తోడవ్వాలి. అలా తన లక్కును పరీక్షించుకోవడానికి మరో శాండిల్ ఉడ్ బ్యూటీ కోలీవుడ్‌లో ప్రవేశించారన్నది తాజా సమాచారం. ఈ భామ పేరు రన్యారావు. యువ నటుడు విక్రమ్ ప్రభుతో రొమాన్స్‌తో ఇక్కడ తన కెరీర్‌ను ప్రారంభించింది. మలయాళకుట్టి కీర్తిసురేష్‌తో డ్యూయెట్లు పాడి ఇదు ఎన్న మాయం చిత్రాన్ని పూర్తి చేసిన విక్రమ్ ప్రభు వాగా చిత్రానికి సిద్ధమయ్యారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి జిఎన్ఆర్ కుమరవేలన్ దర్శకుడు. ఇప్పటికే పది రోజులు షూటింగ్‌తో తొలి షెడ్యూల్‌ను కుంభకోణంలో పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం కాశ్మీర్, ఊటికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచిన యూనిట్ వర్గాలు దక్షిణాదికి చెందిన ప్రెష్ నటిని పరిచయం చేయాలనుకుంటున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు. ఆ దక్షిణాది అమ్మాయి శాండిల్ఉడ్కు చెందిన రన్యారావు అన్నది తాజా సమాచారం. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ అమ్మడు ఒక కన్నడ చిత్రంలో సుదీప్ సరసన నటించారట. కాగా విక్రమ్ ప్రభు వాగాతో మరో హీరోయిన్ ఉంటుందట. ఆమె ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. -
ఆత్మ గౌరవం ముఖ్యం
అమ్మాయిలకు ఆత్మగౌరవం కంటే మించిన అందం లేదని నమ్ముతాను. దానినే ఆచరించాను. ఇకపై కూడా అదే దారిలో నడుస్తానని ప్రముఖ శాండిల్‌వుడ్ నటి ఐంద్రితారై అన్నారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్లు ఎదగడానికి అనుకూలమైన వాతావరణం కన్నడ చిత్రసీమలో లేదని ప్రముఖ శాండిల్‌వుడ్ నటి ఐంద్రిత రై అభిప్రాయపడ్డారు. దాదాపు ఆరేళ్ల నుంచి కన్నడ సినిమాలు చేస్తున్నా... కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్క సినిమాను కూడా అంగీకరించలేకపోయినట్లు తెలిపారు. బెంగళూరులో లాక్మే కంపెనీ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఐంద్రితా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. - సాక్షి, బెంగళూరు సాక్షి : రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఎలా సాగుతోంది? ఐంద్రిత: శాండిల్‌వుడ్‌లోకి వచ్చి ఆరేళ్లవుతుంది. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నా. ఇక్కడ హీరోయిన్లు ఎదగడానికి అనువైన స్నేహపూర్వక వాతావరణం లేదు. వ్యక్తి గత జీవితం మాత్రం చాలా ఆనందంగా ఉంది. కు టుంబ సభ్యులు, స్నేహితు లు నా అృవద్ధి కోసం చాలాృ కషి చేస్తున్నారు. ఇందుకు వా రికి ఎప్పటికీ రుణపడి ఉంటా. సాక్షి : అంటే శాండిల్‌వుడ్‌లో ఎదగకుండా మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఐంద్రిత: అలా అని కాదు. గత ఏడాది కన్నడలో భజరంగితో పాటు బెంగాల్లో బచ్చన్ అనే రెండు సూపర్ హిట్ సినిమాల్లో నటించా ను. అయినా కూడా నా రిల్ లైఫ్ వేగం అందుకోలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయనుకోండి. ఒక రకంగా వ్యక్తిగతంగా నేను కొన్ని విషయాలకు కట్టుబడి ఉండటం కూడా దీనికి కారణం కావచ్చు. సినిమాను అంగీకరించే ముందు కథతో పాటు అందు లో పనిచేసే యూనిట్ సభ్యులు, వారి నడవడిక కూడా పరిగణనలోకి తీసుకుంటా. సాక్షి : చిత్రరంగంలో ఇలాంటి నిర్ణయాలు ఎదుగుదలకు ప్రతిబంధకాలు అవుతాయనిపించడం లేదా? ఐంద్రిత: అది నిజమే కావచ్చు. ఫ్రెండ్లీ నేచర్ లేని యూనిట్లో పనిచేయడం నా వ్యక్తిత్వానికి పడదు. అందువల్లే ఇప్పటికే రెండు మూడు కథలు నచ్చినా వాటిని అంగీకరించలేకపోయా. అందులో ఒకటి లేడి ఓరియంటెడ్ సినిమా కూడా ఉంది. సాక్షి: తెలుగులో అవకాశాలు వస్తే... (ఇంకా ప్రశ్న పూర్తి కాకుండానే) ఐంద్రిత: అంత కంటేనా. టాలివుడ్‌కు మంచి మార్కెట్ ఉంది. అక్కడ పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకోవచ్చు. మంచి కథతోపాటు ముందే చెప్పినట్లు యూనిట్ సభ్యులు ఎవరనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తెలుగులో నటించడానికి నేను సిద్ధం. (కొద్ది సేపు ఆలోచించి) అన్ని విషయాలు నాకు నచ్చితే ఒక్క తెలుగులోనే కాదు ఏ భాషలోనైనా నటించడానికి నేను సిద్ధమే. సాక్షి: అందంగా ఉంటేనే సినీరంగంలో ఎదుగుతారు అని ఎక్కువ మంది అంటుంటారు. ఒక హీరోయిన్గా మీృదష్టిలో అందమంటే? ఐంద్రిత: అమ్మాయిలకు ఆత్మగౌరవం కంటే మించిన అందం లేదని నేను నమ్ముతాను. దానినే ఆచరించాను. ఇకపై కూడా ఇదే దారిలో నడుస్తా. సాక్షి: ఫ్యాషన్‌పై మీ అభిప్రాయం? ఐంద్రిత: ష్యాషన్‌గా ఉండటం తప్పు కాదు. చూసే వారు ఏదో అనుకుంటారని మనం ష్యాషన్‌ను ఫాలో కాకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతాం. ముఖ్యంగా, సినీ, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న మాలాంటి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. (తన లిప్‌స్టిక్‌ను చూపిస్తూ) ఇప్పటి వరకూ నేను డార్క్ కలర్ లిప్‌స్టిక్ వాడింది లేదు. అయితే డార్క్ కలర్ లిప్‌స్టిక్ ఇప్పుడు ష్యాషన్. అందుకే దాన్ని వాడుతున్నా. సాక్షి : ఈ సమ్మర్లో మీ అభిమానులకు మీరు ఇచ్చే ఫ్యాషన్ టిప్స్? ఐంద్రిత: లైట్ మేకప్‌ను వాడండి. తేలికైన కాటన్ దుస్తులు ధరించండి. ఎక్కువ నీళ్లు తాగండి. సీ విటమిన్ ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవాలి.