కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ 'అభి' సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. అలా 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో తను చెరగని ముద్ర వేశారు. తెలుగులో కూడా నందమూరి కళ్యాణ్‌రామ్ అభిమన్యు సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో రమ్య అభినయం అందరినీ ఆకట్టుకున్నారు.
(ఇదీ చదవండి: నాడు విజయ్ పేరుతో వైరల్.. నేడు మళ్లీ ఇలా ట్రెండింగ్‌లో)
కన్నడలో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమాలే కాకుండా.. ఆమె రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీగా మాండ్య ప్రజలకు సేవలందించించారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు. కాగా సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటోన్న రమ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తన పర్సనల్ విషయాలతో పాటు ఫొటోలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శాండల్‌వుడ్ క్వీన్ రమ్య మళ్లీ తెరపైకి వచ్చారు. దీంతోపాటు 'యాపిల్ బాక్స్ స్టూడియోస్' అనే నిర్మాణ సంస్థ ద్వారా కొత్త సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. చాలా ఏళ్లుగా తెరపై కనిపించకపోయినా ఆమెకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా రమ్య ఓ అభిమానితో ఫోటో దిగారు. అదే సమయంలో అభిమానితో రమ్య పలకరించిన తీరు అక్కడి వారందరిని మెప్పిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ)
తన అభిమానులతో ఇంత సాదాసీదాగా వ్యవహరించడమే కాకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఆమె అభిమానులకు సంతోషాన్నిచ్చింది. రమ్య సింప్లిసిటీని అభిమానులతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment