దివ్యస్పందన మృతి అంటూ వార్తలు.. మండిపడ్డ నటి | Kannada Actor Divya Spandana Death Rumours Are False | Sakshi
Sakshi News home page

Divya Spandana: గుండెపోటుతో నటి మృతి అంటూ ట్వీట్‌.. వెంటనే డిలీట్‌.. కానీ అప్పటికే..

Published Wed, Sep 6 2023 2:09 PM | Last Updated on Wed, Sep 6 2023 2:43 PM

Kannada Actor Divya Spandana Death Rumours Are False - Sakshi

తన ట్వీట్‌ డిలీట్‌ చేసినప్పటికీ అప్పటికే ఆమె మరణించారంటూ వార్తలు వైరలయ్యాయి. 

కన్నడ నటి రమ్య(దివ్య స్పందన) మృతి చెందారంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. నేడు ఉదయం రమ్య గుండెపోటుతో కన్నుమూశారంటూ ఓ ట్వీట్‌ ప్రత్యక్షం కావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే వెంటనే సదరు వ్యక్తి నాలుక్కరుచుకుని తన ట్వీట్‌ డిలీట్‌ చేసినప్పటికీ అప్పటికే ఆమె మరణించారంటూ వార్తలు వైరలయ్యాయి. 

అయితే రమ్య మరణించారంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. జెనీవాలో ప్రస్తుతం తన వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పలువరు సోషల్‌ మీడియా వేదికగా ధ్రువీకరిస్తున్నారు. 'జెనీవాలో ఆమె హాయిగా నిద్రిస్తున్నారు. ఇంతలో ఈ ఫేక్‌ న్యూస్‌ బయటకు రావడంతో ఆమె సన్నిహితులు తనకు వరుస పెట్టి ఫోన్లు చేస్తున్నారు. అసలు బతికున్న మనిషి చనిపోయిందంటూ ప్రకటించిన వ్యక్తికి, అది నిజమని ప్రచారం చేస్తున్నవారికి కాస్తైనా బుద్ధి లేదు' అని మండిపడుతున్నారు.

మొదట ఈ వార్త విని ఆందోళనకు లోనైన జర్నలిస్ట్‌ ధన్య రాజేంద్రన్‌ సైతం దివ్య స్పందనకు కాల్‌ చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌లో వెల్లడించింది. 'దివ్య స్పందనకు నేను ఫోన్‌ చేస్తూనే ఉన్నాను. మొదట తను కాల్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో కంగారుపడ్డాను. చివరగా నా ఫోన్‌ ఎత్తడంతో హమ్మయ్య, నీకేం కాలేదు.. నువ్వు బతికే ఉన్నావన్నాను. తనేమో కాస్త కోపంగా అసలు నేను చనిపోయానని ఎవరు చెప్పారు?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది అని రాసుకొచ్చింది.

'అభి' సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య. ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్‌లో ఎంట్రీ ఇచ్చారు. కేవలం తమిళ భాషలోనే కాకుండా కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. 2012లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె ప్రస్తుతం పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు.

చదవండి: అడల్ట్‌ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement