Divya Spandana
-
'ఒకరిని కొట్టి చంపే హక్కు నీకెక్కడిది' దర్శన్‌పై నటి ఆగ్రహం
లక్షలాది మంచి అభిమానులను సంపాదించుకున్న హీరో దర్శన్ సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. సినిమాలో మంచి పాత్రలు చేసే ఆయన నిజ జీవితంలో విలన్‌గా మారాడు. తన ప్రేయసి పవిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని తన అభిమాని, ఫార్మా ఉద్యోగి రేణుకా స్వామిని దారుణంగా చంపాడు. చిత్రదుర్గ్ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర (రఘు)తో కలిసి బెల్ట్, కర్రలతో బాది, గోడకేసి కొట్టి చంపి, తర్వాత బాడీని మురికి కాలువలో పడేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.కొట్టి చంపే హక్కు నీకెక్కడిది?తాజాగా ఈ వ్యవహారంపై నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన(రమ్య) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు? ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బందిపెడితే వారి అకౌంట్ బ్లాక్ చేయాలి. అయినా అదేపనిగా ట్రోల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరికీ లేదు. ఈ కేసును డీల్ చేస్తున్న పోలీసులను తప్పకుండా ప్రశంసించాల్సిందే! తీర్పు వచ్చేవరకు ఆగండిమీరు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా విచారణ చేపడతారని ఆశిస్తున్నాను. ప్రజల్లో చట్టంపై నమ్మకాన్ని పెంపొందిస్తారని భావిస్తున్నాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. మరోవైపు హీరోయిన్ సంజన గల్రానీ.. దర్శన్‌ను వెనకేసుకొచ్చింది. సెలబ్రిటీలపై ఏవైనా ఆరోపణలు వచ్చాయంటే చాలు వెంటనే తప్పు చేశారని నమ్మేస్తారు. ఇంకా విచారణ జరుగుతోంది. అప్పుడే తుది నిర్ణయానికి వచ్చేయకండి అని పేర్కొంది.ఆ కారణం వల్లేకాగా దర్శన్‌కు విజయలక్ష్మి అనే భార్య ఉంది. ఇల్లాలిని పట్టించుకోకుండా నటి పవిత్రగౌడతో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. దాదాపు పదేళ్లుగా పవిత్రతో కలిసుంటున్నాడు. భార్యను వదిలేసి ప్రియురాలితో తిరగడం అతడి అభిమాని రేణుకాస్వామికి నచ్చలేదు. ఆ కోపంతోనే పవిత్రకు అసభ్యంగా మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ఇది తారా స్థాయికి చేరడంతో పవిత్ర.. దర్శన్‌కు ఫిర్యాదు చేసింది. అతడు మందలించాల్సింది పోయి ఏకంగా అభిమాని ప్రాణాలే తీయడం శోచనీయం.చదవండి: సుశాంత్.. నువ్వు బతికే ఉన్నావ్..! -
దివ్యస్పందన మృతి అంటూ వార్తలు.. మండిపడ్డ నటి
కన్నడ నటి రమ్య(దివ్య స్పందన) మృతి చెందారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. నేడు ఉదయం రమ్య గుండెపోటుతో కన్నుమూశారంటూ ఓ ట్వీట్ ప్రత్యక్షం కావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే వెంటనే సదరు వ్యక్తి నాలుక్కరుచుకుని తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఆమె మరణించారంటూ వార్తలు వైరలయ్యాయి. అయితే రమ్య మరణించారంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. జెనీవాలో ప్రస్తుతం తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పలువరు సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరిస్తున్నారు. 'జెనీవాలో ఆమె హాయిగా నిద్రిస్తున్నారు. ఇంతలో ఈ ఫేక్ న్యూస్ బయటకు రావడంతో ఆమె సన్నిహితులు తనకు వరుస పెట్టి ఫోన్లు చేస్తున్నారు. అసలు బతికున్న మనిషి చనిపోయిందంటూ ప్రకటించిన వ్యక్తికి, అది నిజమని ప్రచారం చేస్తున్నవారికి కాస్తైనా బుద్ధి లేదు' అని మండిపడుతున్నారు. మొదట ఈ వార్త విని ఆందోళనకు లోనైన జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ సైతం దివ్య స్పందనకు కాల్ చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్లో వెల్లడించింది. 'దివ్య స్పందనకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. మొదట తను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుపడ్డాను. చివరగా నా ఫోన్ ఎత్తడంతో హమ్మయ్య, నీకేం కాలేదు.. నువ్వు బతికే ఉన్నావన్నాను. తనేమో కాస్త కోపంగా అసలు నేను చనిపోయానని ఎవరు చెప్పారు?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది అని రాసుకొచ్చింది. 'అభి' సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య. ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. కేవలం తమిళ భాషలోనే కాకుండా కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. 2012లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె ప్రస్తుతం పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. It was really the strangest conversation, kept calling @divyaspandana and she didnt pick first few times and naturally I was panicking. Finally she did and I had to say-I am glad you are alive, She is like who the hell is saying I died! #DivyaSpandana — Dhanya Rajendran (@dhanyarajendran) September 6, 2023 చదవండి: అడల్ట్ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్ -
అమ్మానాన్న తర్వాత నాకు రాహుల్ గాంధీయే..: కన్నడ నటి
దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ అభి సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. 'నా తల్లిదండ్రులే నా ప్రాణం. నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంటులో అడుగుపెట్టాల్సి వచ్చింది. కానీ పార్లమెంటు కార్యకలాపాల గురించి నాకు ఏమీ తెలియదు. అయినా ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నా బాధను పనివైపు మళ్లించాను. అంతటి శక్తిని నాకు మాండ్యా ప్రజలే ఇచ్చారు. జీవితంలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీ ఉన్నారు. నాన్న మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయాను. అలాంటి కష్ట సమయంలో రాహుల్ గాంధీ నాకు అండగా నిలబడి సహాయం చేశారు. మానసికంగా ధైర్యాన్ని నూరిపోసి సపోర్ట్ చేశారు' అని చెప్పుకొచ్చారు. కాగా 2012లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె 2013లో మాండ్య లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవలే ఉత్తరకాండతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. -
ధనుశ్‌తో నటి దివ్య స్పందన, ఫొటో షేర్ చేసిన హీరోయిన్
నటుడు ధనుష్ తొలి నాళ్లలో మాస్ హీరోగా చూపించిన చిత్రాల్లో పొల్లాదవన్ ఒకటి. అంతకు ముందు ఇదే టైపులతో నటుడు రజనీకాంత్ నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ధనుష్ హీరోగా నటించిన పొల్లాదవన్ పేరుతో చిత్రం చేస్తున్నారనగానే చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇది దర్శకుడు వెట్రి మారన్ తొలి చిత్రం. ధనుష్ పుదుపేట చిత్ర సక్సెస్‌తో మంచి జోరులో ఉన్న ప్పుడు ఆ తరువాత ఆయన హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన చిత్రం పొల్లాదవన్. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ గ్రూప్ కంపెనీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ధనుశ్కు జంటగా నటి దివ్య స్పందన నటించారు. కాగా ఈ చిత్రం 2007లో విడుదలైంది. దీంతో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందులో పని చేసిన నటీనటులు, సాంకేతిక వర్గం మంగళవారం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో పార్టీ జరుపుకున్నారు. ఇందులో ధనుష్ జంటగా నటించిన నటి దివ్య స్పందన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ధనుశ్‌తో సెల్ఫీ దిగిన ఫొటోను ఆమె తన ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Ramya|Divya Spandana (@divyaspandana) -
చేతన రాజ్ మరణం.. అందం కోసం ఎంత మూల్యం చెల్లించాలి?
మనం నటులం. సోషల్ మీడియాల్లో చేస్తున్న పోస్టుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. నిజాయితీగా, వాస్తవికంగా ఆలోచిద్దాం. మనం సన్నగా, తెల్లగా ఉండాలన్న ప్రయత్నంలో ఉండొద్దు. ఈ విషయాలపై నిర్ద్వంద్వంగా మన మనసులోని భావాలను వ్యక్తం చేయాలి. మౌనంగా ఉండటం ఇంకో ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. నిజానికి ప్లాస్టిక్ సర్జరీ కారణంగా వినోద పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి చేతన రాజ్ కానేకాదు. కొన్నేళ్ల క్రితం కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటీమణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. లైపోసక్షన్ శస్త్ర చికిత్స కాస్తా వికటించడంతో ఆమె అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి దుర్విధిని ఎదుర్కొన్న చేతన రాజ్ ప్రస్తుత వినోద పరిశ్రమ వాస్తవాలను మరోసారి మన కళ్లముందు ఉంచుతోంది. ఈ వినోద ప్రపంచంలో ‘అందం’ అనేదానికి అసాధా రణమైన, వాస్తవ దూరమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇది మహిళల విషయంలో చాలా ఎక్కువ. అయితే ఇదేదో పరిశ్రమ నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమే అనుకునేందుకు వీల్లేదు. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లపై తల్లిదండ్రులు, సమాజం పెట్టే తీవ్రమైన ఒత్తిడి పరిణామం ఇది అని నేను నమ్ముతున్నాను. ఫ్యాషన్, రీటైల్ వస్త్ర వ్యాపారాన్నే ఉదాహరణలుగా తీసుకుందాం. అందంగా కనిపించడం మహిళల బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఉండటం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఎందరో నాకు తెలుసు. వీరిలో చాలామంది శరీరంపైని వెంట్రుకలను తొలగించుకునేందుకు లేజర్, రసాయన చికిత్సలు తీసుకున్నవారే. శరీరంపై వెంట్రుకలు ఉన్న మహిళలను ‘సెక్సీ’ అని పరిగణించరు మరి! ఈ సూత్రం మహిళలకు మాత్రమే. పురుషుల విషయానికి వస్తే అన్నీ నడిచిపోతాయి. లేజర్ ట్రీట్మెంట్లు, చర్మపు రంగును తేలిక చేసే ప్రయత్నాలు, రసాయ నాలతో చర్మాన్ని శుద్ధి చేయడం, పెదవులు బొద్దుగా కనిపించేందుకు కృత్రిమ రసాయనాలను నింపుకోవడం, బొటాక్స్, లైపోసక్షన్... ఇలాంటివన్నీ మహిళలు ఎందుకు చేయించుకుంటారంటే... అందం తాలూకూ ‘ప్రమాణాలు’ అందుకునే ప్రయత్నమే అని చెప్పాలి. కేన్సర్ కణితిని తొలగించిన తరువాత నాకూ బరువుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. సులువైన చిట్కాలూ బోలెడన్ని ఉన్నాయి. వాటి మాయలో పడటం పెద్ద కష్టం కాదు. కానీ తగిన ఆహారం తీసుకోవడం, నిర్దిష్టమైన అలవాట్లు పెంచుకోవడం, మార్చుకోవడం అవసరం. ఒకరకంగా చూస్తే సినిమాలు ఈ సమాజానికి దర్పణమని చెప్పాలి. దురదృష్టవశాత్తూ వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఏ సినిమా లోనైనా హీరోయిన్ మన పక్కింటి పిల్ల మాదిరిగానో లేదంటే రోడ్లో వెళు తూంటే తారసపడే అమ్మాయిలానో కనిపించిందా చెప్పండి? చాలా చాలా అరుదు. హీరోయిన్ల మాదిరిగా డ్రస్సులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. మేకప్పూ అలా చేసుకోరు. కానీ నెమ్మదిగా తెరపై హీరోయిన్లా కనిపించడం అనేది అందరి ఆశయమైపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ల మాదిరిగా అన్ని విషయాల్లోనూ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా మహిళల గురించే. పురుషుల విషయానికి వస్తే అంటే.. హీరో బానపొట్ట వేసుకుని 65 ఏళ్ల వయసున్నా చెల్లిపోతోంది. పొరబాటునగానీ ఓ మహిళా కళాకారిణి కొంచెం ఒళ్లు చేసిందంటే చాలు... నానారకాల ఏడుపులతో సోషల్ మీడియా నిండి పోతుంది. వినోద పరిశ్రమలో ఓ మహిళ వయసు 30లు దాటుతున్నాయంటే... అందరి దృష్టిలోంచి కూడా జారిపోతున్నట్లు లెక్క. మలయాళం పరిశ్రమ ఆదర్శం వినోద పరిశ్రమలో లింగ వివక్షను కొద్దోగొప్పో సరిచేసే ప్రయత్నం చేస్తున్నది మలయాళ సినిమా పరిశ్రమ అని చెప్పవచ్చు. మేకప్ లేకుండా, శరీరాకృతి కనిపించేలా కాకుండా నటులను సాధారణ దుస్తుల్లోనే చూపిస్తున్నారు. కేశా లంకరణ విషయంలోనూ అన్నీ సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృత్రిమ కనుబొమలు ధరించకుండా చూసుకుంటున్నారు. ఈ తేడాల ప్రభావం వారి నటనపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవికమైన, నిజాయితీతో కూడిన నటన ఆవిష్కృతమవుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో సాధారణంగా హీరోల పారితోషికం కోట్లల్లో ఉంటుంది. మహిళలకు వచ్చే సరికి ఇది లక్షల్లో మాత్రమే. కేవలం కొద్దిమంది మాత్రమే ఈ స్థితిని మార్చ గలిగారు. అటు మహిళలూ, ఇటు పురుషుల మధ్య ఈ అంశాలపై చర్చ జరగా ల్సిన అవసరం ఉంది. సినిమాలు తీసేవాళ్లు, నిర్మాతలు, వినోద పరిశ్రమలో మార్పు తేగల సామర్థ్యం ఉన్న వారందరూ ఇకనైనా సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నాలు మానాలి. నటులు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నామో ఆలోచించి పెట్టాలి. చేతన రాజ్ ఫొటోలు చూస్తూంటే... నాకు ఆమెలో ఎలాంటి లోపాలూ కనిపించలేదు. మీ మాదిరి, నా మాదిరి, అందరి మాదిరిగా తనూ సాధారణంగానే కనిపించింది. కానీ మదిలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది? కొన్ని సందర్భాల్లో ఇలాంటి యువతులపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సినిమా పరిశ్రమలో ‘ప్రవేశానికి’ నిర్దిష్టమైన రీతిలో కనిపించా లన్న తాపత్రయం చేతనను లైపోసక్షన్ శస్త్రచికిత్స వైపు నడిపించి ఉండవచ్చు. ఎందుకలా చేసిందో నిర్ణ యించే అధికారం మనలో ఎవరికీ లేదు. వ్యక్తులు ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం కలుక్కుమంటూనే ఉంది. చేతన నిజంగా అంత మూల్యం చెల్లించాలా?.. - దివ్య స్పందన (రమ్య) కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
నటి రమ్య వ్యాఖ్యలపై ఆగ్రహం
యశవంతపుర(బెంగళూరు): కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై నటి రమ్య చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. రమ్యా ఆరోపణలు చేయడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీకే శివకుమార్‌పై ఆరోపణలు చేసిన రమ్యా... కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో తనకు తెలియదని, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ నలపాడ్ తెలిపారు. ఆమెకు తమ పార్టీలో ఏ బాధ్యతలను అప్పగించలేదన్నారు. సమస్యలుంటే మాట్లాడాలి తప్ప ఆరోపణలు చేయటం తగదన్నారు. నలపాడ్ మాటలపై రమ్య స్పందించారు. బెయిల్‌పై ఉన్న వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ రమ్య శుక్రవారం ట్వీట్ చేశారు. చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్! -
ఎక్కడికీ పారిపోలేదు.. రాజీనామా చేశా
బెంగళూరు: తాను ఎక్కడికి పారిపోలేదని, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన(రమ్య) తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయమని కాంగ్రెస్ తన కార్యకర్తలను ఆయన ఆదేశించారని ట్విటర్లో పేర్కొన్నారు. మోసం చేయలేదు ‘నేను బయటికి వచ్చాక నా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, ప్రత్యేకించి కన్నడ వార్తా ఛానళ్లలో ‘ఆమె కాంగ్రెస్ పార్టీని ఎనిమిది కోట్లకు మోసం చేసి పారిపోయింది’ అనే కథనాన్ని నాటారు. నేను పారిపోలేదు. నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశాను. నేను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎనిమిది కోట్లకు మోసం చేయలేదు. నిశ్శబ్దంగా ఉండటమే నా తప్పయింద’ని దివ్య స్పందన ట్వీట్ చేశారు. అసలేంటి వివాదం? పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ స్కామ్‌పై డీకే శివకుమార్ చేసిన ప్రకటనతో వివాదం మొదలైంది. పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో బహిరంగ వేదికలపై తనను ప్రశ్నించకుండా రక్షణ కోరుతూ ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్‌నారాయణన్.. కాంగ్రెస్ నాయకుడు ఎంబీ పాటిల్‌ను కలిశారని శివకుమార్ వెల్లడించారు. దీనిపై రమ్య స్పందిస్తూ.. పార్టీలకు అతీతంగా నాయకులు కలుసుకోవడం తప్పేంటని ప్రశ్నించారు. నిబద్దత కలిగిన కాంగ్రెస్‌వాది అయిన ఎంబీ పాటిల్ గురించి శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు ఏమైపోయారు? ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా శివకుమార్ మద్దతుదారులు రమ్యను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇన్నాళ్లు ఏమైపోయారని, ఇప్పుడే మేల్కొన్నారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. శివకుమార్ ఆదేశాలకు అనుగుణంగానే ఇదంతా జరుగుతోందని రమ్య ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కోరారు. ముందే రాజీనామా నిర్ణయం నటి రమ్య 2012లో యూత్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2013లో ఆమె మాండ్య లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వేవ్‌లో ఆమె ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు రమ్య వెల్లడించారు. ఇటీవల తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పటికీ.. రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. (చదవండి: మత మార్పిడుల నియంత్రణకు ఆర్డినెన్స్)