
నటుడు ధనుష్ తొలి నాళ్లలో మాస్ హీరోగా చూపించిన చిత్రాల్లో పొల్లాదవన్ ఒకటి. అంతకు ముందు ఇదే టైపులతో నటుడు రజనీకాంత్ నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ధనుష్ హీరోగా నటించిన పొల్లాదవన్ పేరుతో చిత్రం చేస్తున్నారనగానే చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇది దర్శకుడు వెట్రి మారన్ తొలి చిత్రం. ధనుష్ పుదుపేట చిత్ర సక్సెస్‌తో మంచి జోరులో ఉన్న ప్పుడు ఆ తరువాత ఆయన హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన చిత్రం పొల్లాదవన్.
చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్
గ్రూప్ కంపెనీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ధనుశ్‌కు జంటగా నటి దివ్య స్పందన నటించారు. కాగా ఈ చిత్రం 2007లో విడుదలైంది. దీంతో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందులో పని చేసిన నటీనటులు, సాంకేతిక వర్గం మంగళవారం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో పార్టీ జరుపుకున్నారు. ఇందులో ధనుష్ జంటగా నటించిన నటి దివ్య స్పందన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ధనుశ్‌తో సెల్ఫీ దిగిన ఫొటోను ఆమె తన ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment