'కాంతారా' అభిమానులకు శుభవార్త ప్రకటించిన రిషబ్ శెట్టి | Rishab Shetty's 'Kantara Chapter - 1' First Look Date Announced | Sakshi
Sakshi News home page

Kantara Chapter -1: 'కాంతారా' అభిమానులకు శుభవార్త ప్రకటించిన రిషబ్ శెట్టి

Published Sat, Nov 25 2023 10:53 AM | Last Updated on Sat, Nov 25 2023 11:04 AM

Rishab Shetty Kantara Chapter -1 First Look Announced - Sakshi

కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్‌ని అందించిన చిత్రం ‘కాంతారా’. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఇండియా అంతటా హిట్ అయ్యింది. విడుదలైన ఐదు భాషల్లో సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది.హోంబలే ఫిలింస్ నిర్మించిన 'కాంతారా' భారతదేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ విజయం కారణంగానే రిషబ్ శెట్టి కాంతారాను సీక్వెల్‌ చేయడానికి సిద్ధమయ్యాడు. సినిమా ప్రకటన అయితే ఇచ్చారు కానీ గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సినీ వర్గాలకు ఓ శుభవార్తను  అందించారు. 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

నవంబర్ 27న 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ ఏడాది పెద్దగా సినిమాలు లేని సినీ పరిశ్రమకు రిషబ్ శెట్టి శుభవార్త అందించాడు. రెండు రోజుల్లో ఫస్ట్ లుక్ రివీల్ కానుంది. ప్రత్యేకించి ఈసారి 5 భాషల్లో కాకుండా 7 భాషల్లో సినిమా విడుదల కానుంది. మొత్తం ఐదు భాషల్లో 'కాంతారా' విడుదల అయ్యి ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఆదరణ పొందింది. కాబట్టి కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement