RTC bus stolen from Karnataka tracked in Telangana - Sakshi
Sakshi News home page

కర్ణాటకలో అదృశ్యమైన బస్‌.. తెలంగాణలో లభ్యం, మధ్యలో ఏం జరిగింది!

Published Thu, Feb 23 2023 10:04 AM | Last Updated on Thu, Feb 23 2023 11:32 AM

Rtc Bus Stolen From Karnataka Tracked In Telangana - Sakshi

రాయచూరు రూరల్‌: కర్ణాటకలో అదృశ్యమైన కేఎస్‌ ఆర్టీసీ బస్‌ తెలంగాణలో దొరికింది. కలబుర్గి డివిజన్‌లోని కలబుర్గి జిల్లా చించోళి బస్టాండ్‌లో నిలిపిన కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ బస్‌ను దొంగలు నకిలీ తాళాలతో స్టార్ట్‌ చేసుకుని ఉడాయించారు. బీదర్‌ రెండవ డిపోకు చెందిన కేఏ 38 ఎఫ్‌ 971 బస్సు ఇది. బీదర్‌ నుంచి చించోళికి వచ్చి తెల్లవారుజామున 3.30 గంటలకు బస్సు మాయమైంది.

మంగళవారం విధులకు వెళ్లాలని డ్రైవర్, కండక్టర్‌ వచ్చి చూడగా బస్సు లేకపోవడంతో కంగుతిన్నారు. పలుచోట్ల గాలించి చివరకు చించోళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు మార్గాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి బస్సు వెళ్లిన దిశను గుర్తించారు. బస్సు బుధవారం  తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు తాలూకా భూకైలాస తాండాలో లభించింది. దొంగల ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి   వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement