Rajasthan RLP MLA Narayan Beniwal Vehicle Stolen From Jaipur - Sakshi
Sakshi News home page

ఆర్‌ఎల్‌పీ ఎమ్మెల్యే కారు చోరీ.. పోలీసుల తీరుపై ఆరోపణ! 

Published Sun, Jul 17 2022 2:51 PM | Last Updated on Sun, Jul 17 2022 3:31 PM

Rajasthan RLP MLA Narayan Beniwal Vehicle Stolen From Jaipur - Sakshi

జైపూర్‌: ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఆయన చుట్టూ పటిష్ఠ భద్రత ఉంటుంది. ఆయన ఇంటి ముందు పోలీసులు పహారా కాస్తుంటారు. 24 గంటలు సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. అయితే.. అవేమీ తమను అడ్డుకోవన్నట్లు అలాంటి ఇంటికే కన్నం వేశారు దొంగలు. ఎమ్మెల్యే కారునే మాయం చేశారు. రాజస్థాన్‌లోని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్‌పీ) ఎమ్మెల్యే నారయన్‌ బెనివాల్‌కు చెందిన ఎస్‌యూవీ కారు చోరీకి గురైంది.

జైపూర్‌లోని వివేక్‌ విహార్‌ ప్రాంతంలో ఆయన అపార్ట్‌మెంట్‌ ముందు నిలిపి ఉంచిన కారును శనివారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్‌మెంట్‌తో పాటు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఎస్‌హెచ్‌ఓ శ్రీమోహన్‌ మీనా. చోరీకి పాల్పడిన దొంగలను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.  

పోలీసులపై ఎమ్మెల్యే ఆరోపణలు.. 
'ఎప్పటిలాగే వివేక్‌ విహార్‌ ప్రాంతంలోని మా అపార్ట్‌మెంట్‌ ముందు వాహనాన్ని నిలిపాము. తెల్లవారి వచ్చి చూసే సరికి అక్కడ లేదు. దొంగలకు పోలీసులంటే భయం లేదు. ఒక ఎమ్మెల్యే వాహనం ఈవిధంగా చోరీకి గురవుతుందా? ఒక సాధారణ పౌరుడి పరిస్థితేంటి? సాధారణ ప్రజలను పోలీసులు తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ దొంగలు దర్జాగా తిరుగుతున్నారు. ' అని ఎమ్మెల్యే బెనివాల్‌ ఆరోపించారు.

ఇదీ చూడండి: Hyderabad: కొండాపూర్‌ పబ్‌లో రెచ్చిపోయిన బౌన్సర్లు.. కస్టమర్‌పై పిడిగుద్దులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement