సాక్షి, జోగిపేట(అందోల్): ‘నీ ఫోన్ తీసుకెళ్లినందుకు క్షమించు.. నీ ఫోన్ నీకు ఇస్తున్నా’ అని ఫోన్‌ను ఎత్తుకెళ్లిన వ్యక్తి ‘నమ్మించి.. సెల్ ఫోన్‌తో పరారు’ అనే శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన వార్తను చదివి తిరిగి బాధితుడికి ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 27 గురువారం రోజున సంగుపేట గ్రామానికి చెందిన ఆదిత్య అనే యువకుడిని అపరిచిత వ్యక్తి(రమేశ్) మాయమాటల్లో దించి మళ్లీ వస్తానని చెప్పి ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. వారిద్దరు కలిసిన సమయంలో ఒకరికొకరు ఫోన్ నంబర్లను ఫీడ్ చేసుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆదిత్య తను ఫీడ్ చేసుకున్న ఫోన్ నంబరును గూగుల్ అకౌంట్ కాంటాక్ట్స్‌లో సెర్చ్ చేశాడు.
చదవండి: సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా?
అందులో లభించిన నంబర్ ఆధారంగా శుక్రవారం అతడికి ఫోన్ చేశాడు. ‘నాపై ఎందుకు ఫిర్యాదు చేశావ్.. పేపర్లో ఎందుకు వేయించావు.. నీ ఫోన్ తీసుకెళ్లినందుకు క్షమించు నీ ఫోన్ నీకు ఇస్తున్నా’ అని రమేశ్ ఫోన్ పెట్టేశాడు. అదే సాయంత్రం ఎత్తుకెళ్లిన ఫోన్ ను ఫసల్‌వాదీలోని ఒక దుకాణంలో ఇచ్చి వెళ్లిపోయాడు. దుకాణదారుడు అదే రాత్రి ఆదిత్యకు ఫోన్ అప్పగించాడు. దీంతో బాధితుడు తన ఫోన్ లభించడంతో ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపాడు.
చదవండి: మద్యం మత్తులో వికృత ప్రవర్తన.. శరీరంపై కాట్లు పెట్టి..
Comments
Please login to add a commentAdd a comment