4 Girls Stolen Expensive Chocolate from Grocery Store In Gwalior, Know What Happened Next - Sakshi
Sakshi News home page

4 Girls Chocolate Heist: ఖరీదైన చాక్లెట్‌ చోరీ.. పరారైన అమ్మాయిల కోసం పోలీసుల గాలింపు!

Published Tue, Aug 22 2023 12:05 PM | Last Updated on Tue, Aug 22 2023 12:24 PM

Girls Stolen Expensive Chocolate from Grocery Store - Sakshi

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఒక దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు అమ్మాయిలు ఒక దుకాణంలో ఖరీదైన చాక్లెట్‌ చోరీ చేసి పరారయ్యారు. దుకాణదారు తెలిపిన వివరాల ప్రకారం ఆ చాక్లెట్‌ ఖరీదు రూ.500. ఈ ఘటన మొత్తం సీసీటీవీలొ రికార్డయ్యింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే ఈ చోరీ పట్టణంలోని డీడీ నగర్‌ గేట్‌ వద్దనున్న డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో జరిగింది. ఈ స్టోర్‌కు వచ్చిన నలుగురు అమ్మాయిలలో ఒక అమ్మాయి ఆ చాక్లెట్‌ను తన జీన్స్‌ ప్యాంటు జేబులో దాచుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమెతో పాటు మిగిలినవారు కూడా పరారయ్యారు. ఈ చాక్లెట్‌ చోరీ ఘటన స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దీనిలో ఆ ఆమ్మాయి చోరీ ఎలా చేసిందీ రికార్డయ్యింది. కౌంటర్‌లో డబ్బులు చెల్లించకుండా ఎలా తప్పించుకున్నదీ దానిలో రికార్డయ్యింది. వారు ఇక్కడికి సమీపంలోని ఏదో హాస్టల్‌కు చెందినవారిగా స్టోర్‌ యజమాని అనుమానిస్తున్నారు. 

దుకాణదారుని ఫిర్యాదు మేరకు మహరాజ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ చాక్లెట్‌ ఖరీదు రూ. 500 ఉంటుందని దుకాణదారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్టోర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయిల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. 
ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement