![8 Days Old Babies Stolen By Monkey Group, Among Them One Child Found Dead In water - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/02/14/monkey_5.jpg.webp?itok=hK3I8yZQ)
చెన్నై: తమిళనాడులోని తంజాపూర్‌లో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కవల శిశువులను కోతులు ఎత్తుకెళ్లి, అందులో ఒక పసి పాపను నీళ్లలో పడేయడంతో ఆ చిన్నారి చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వరి అనే మహిళకు 8 రోజుల కిందట ఇద్దరు కవల పిల్లలు(అమ్మాయిలు) జన్మించారు. శనివారం ఇద్దరు శిశువులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ వానర గుంపు ఇంటిపైకి చేరి, పెంకులు తొలగించి మరీ పసి బిడ్డలను ఎత్తుకెళ్లింది. ఇది గమనించిన భువనేశ్వరి కేకలు వేయడంతో కోతుల గుంపు ఒక పాపను అక్కడే పడేసి వెళ్లి పోయింది. తల్లి ఆర్తనాదాలు విన్న ఇరుగు పొరుగు వారు స్పందించి, ఇంటి పైకప్పుపై ఉన్న పడివున్న చిన్నారిని రక్షించారు. మరో పాప కోసం గాలిస్తుండగా సమీపంలోని నీటిలో చిన్నారి శవమై కనిపించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment