నల్గొండ జిల్లాలోని తుర్కపల్లిలో ఇండిక్యాష్ ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. శనివారం అర్ధరాత్రి కొందరు దుండగులు ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లారు.
నల్గొండ:జిల్లాలోని తుర్కపల్లిలో ఇండిక్యాష్ ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. శనివారం అర్ధరాత్రి కొందరు దుండగులు ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లారు. అయితే ఆ మిషన్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో పూర్తిగా ధ్వంసం చేసి అక్కడే వదిలి వెళ్లిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిబ్బందిని కూడా విచారించే పనిలో పడ్డారు. నల్గొండలో అంతరాష్ట్ర ముఠా దొంగల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు.