మంద నుంచి 60 గొర్రెలు అపహరణ | 60 sheeps worth Rs.4 lakhs Stolen | Sakshi
Sakshi News home page

మంద నుంచి 60 గొర్రెలు అపహరణ

Published Tue, Jun 16 2015 5:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

60 sheeps worth Rs.4 lakhs Stolen

కీసర (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని ఓ కాపరికి చెందిన 60 గొర్రెలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రాంపల్లి గ్రామానికి చెందిన రేగు స్వామి గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. కాగా సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చిరు జల్లులు కురుస్తుండటంతో గొర్రెలను దొడ్డిలో ఉంచి ఇంట్లో నిద్రించాడు. అయితే మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో మంద వద్దకు వెళ్లి పరిశీలించగా 60 గొర్రెలు కనిపించలేదు. గుర్తుతెలియని దుండగులు గొర్రెలను తస్కరించుకెళ్లినట్లు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి విలువ రూ.4 లక్షలుంటుందని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement