మాటల్లో పెట్టి సినీ దర్శకుడి ఫోన్ కొట్టేసిన కి'లేడి'!
మాటల్లో పెట్టి సినీ దర్శకుడి ఫోన్ కొట్టేసిన కి'లేడి'!
Published Sun, Oct 26 2014 6:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
థానే: మాటల్లో పెట్టి అలనాటి బాలీవుడ్ దర్శకుడు లేఖ్ టాండన్ మొబైల్ ఫోన్ ను ఓ కిలేడి కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. త్వరలో తాను నిర్మించబోయే చిత్రానికి దర్శకత్వం వహించాలని కోరుతూ, మాట్లల్లో పెట్టి లేఖ్ టాండన్ అనే వ్యక్తి నుంచి ఓ మహిళ ఫోన్ ఎత్తుకెళ్లిందని ఫిర్యాదు తమకు అందిందని పోలీసులు తెలిపారు. పలు చిత్రాలకు, టెలివిజన్ సీరియల్స్ దర్శకత్వం వహించిన టాండన్ కు ఓ మహిళనుంచి ఫోన్ వచ్చిందని, త్వరలో తాను నిర్మించబోయే చిత్రం గురించి చర్చించాలని ఉందని చెప్పినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాటల్లో పెట్టి తన ఫోన్ బ్యాటరీ డిశ్చార్జి అయిందని, అర్జంటుగా ఫోన్ చేసుకోవాలి.. మీ ఫోన్ ఇవ్వండని ఐఫోన్ 5 తీసుకున్నట్టు టాండన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. ఐఫోన్ తీసుకుని మాట్లాడుతూ.. అక్కడి నుంచి పరారైందని, దాని విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని థానే నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో ఫ్రొఫెసర్, అమ్రాపాలి, దో రహేన్, ఉత్తరయాన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా స్వదేశ్, పహేలి, రంగ్ దే బసంతి, చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రాల్లో నటించారు.
Advertisement
Advertisement