గర్ల్ఫ్రెండ్ కోసం.. | Men who stole dogs from Dubai pet shop to gift girl friend | Sakshi
Sakshi News home page

గర్ల్ఫ్రెండ్ కోసం..

Published Mon, Feb 29 2016 3:35 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

గర్ల్ఫ్రెండ్ కోసం.. - Sakshi

గర్ల్ఫ్రెండ్ కోసం..

గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడానికి ఓ యువకుడు దొంగగా మారాడు.

దుబాయ్: గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడానికి ఓ యువకుడు దొంగగా మారాడు. అయితే అతను దొంగిలించింది  విలువైన వస్తువులనో లేక డబ్బునో కాదు. తన మిత్రురాలికి ఇష్టమైన కుక్క పిల్లలను. వినడానికి కొంత వింతగా ఉన్నా.. స్నేహితుడితో కలిసి కుక్కల దొంగతనానికి పాల్పడిన ఆ వ్యక్తి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఒమన్ నటి బీఏకు జర్మన్ షెపర్డ్ కుక్కలంటే విపరీతమైన ఇష్టం. ఎలాగైనా ఆమెను ఇంప్రెస్ చేయాలనుకున్న ఆమె మిత్రుడు ఎమిరాటి గత అక్టోబర్లో పెట్ షాప్ నుంచి కుక్కలను దొంగతనం చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం మిత్రుడితో కలిసి వెళ్లి పెట్ షాప్ అద్దాలను ధ్వసం చేసి లోపలికి ప్రవేశించిన అతడు మూడు జర్మన్ షెపర్డ్ కుక్కలను ఎత్తుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయాన్నే పెట్ షాప్ యజమాని కుక్కలు దొంగతనానికి గురైన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఎమిరాటి, అతని మిత్రుడు కేడీలను అరెస్ట్ చేశారు.

ఎమిరాటిని విచారించగా తన మిత్రురాలు, ఒమన్ నటి బీఏకు గిఫ్ట్గా ఇవ్వడానికే  కుక్కలను దొంగిలించినట్లు అంగీకరించాడు. ఆ మూడు కుక్కలను దొంగిలించిన మర్నాడే తనకు గిఫ్ట్గా ఇచ్చారని, అయితే వాటిని షాపు నుంచి దొంగిలించినట్లు తనకు తెలియదని నటి బీఏ విచారణ అధికారులకు చెప్పుకొచ్చింది. నేరాన్ని అంగీకరించిన ఇద్దరు మిత్రులకు దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement