మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఇక చింతాల్సిన అవసరం లేదు. పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది.
పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం... ప్రభుత్వం ఈ వారంలో ట్రాకింగ్ సిస్టమ్‌ను విడుదల చేయనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) టెక్నాలజీ డెవలప్‌మెంట్ బాడీ సెంటర్ ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్‌లతో సహా కొన్ని టెలికాం సర్కిళ్లలో CEIR సిస్టమ్‌ను పైలట్‌గా నడుపుతోందని ఒక సీనియర్ అధికారి ద్వారా తెలిసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు పాన్-ఇండియా విస్తరణకు సిద్ధంగా ఉందని, మే 17న పాన్-ఇండియా లాంచ్‌కు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం.
దేశంలోని అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని తనిఖీ చేసే ఫీచర్లను సీడాట్ ఈ వ్యవస్థలో పొందుపరిచింది. దేశంలో మొబైల్ ఫోన్‌ల విక్రయానికి ముందు వాటి IMEI నంబర్‌ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. IMEI అనేది 15 అంకెల సంఖ్య. ఇది ప్రతి మొబైల్ ఫోన్‌కు ప్రత్యేకంగా ఉంటుంది.
ఆమోదించిన IMEI నంబర్‌లను యాక్సెస్ చేసే వీలు మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉంటుంది. అంటే తమ నెట్‌వర్క్‌లో ఏదైనా అనధికార మొబైల్ ఫోన్లు ప్రవేశిస్తే ఇవి పసిగట్టగలవు. టెలికాం ఆపరేటర్లు, CEIR వ్యవస్థ మొబైల్ ఫోన్ల IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్లను గుర్తించగలవు. ఈ సమాచారం ఆధారంగా పోగొట్టుకున్న లేదా చోరీ గురైన మొబైల్ ఫోన్‌లను సులువుగా ట్రాక్ చేయవచ్చు.
ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment