బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలతో తనదైన నటనతో మెప్పించింది భామ. న్యూ ఇయర్ వేళ 44వ వసంతంలో అడుగుపెట్టింది సీనియర్ నటి. ఆమె బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె విషెష్ తెలియజేశారు. కెరీర్‌లో విద్యాబాలన్‌కు ఎదురైన అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకున్నారు. అప్పట్లో ప్రముఖ దర్శకుడు గుల్జార్ సినిమాలో నటించాలని తన కోరిక అని తెలిపింది. ఆయన సినిమాలో నటించేందుకు ఎలాంటి సిగ్గులేకుండా అడిగానని చెప్పుకొచ్చింది. 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని అడిగానని వెల్లడించింది.
(ఇది చదవండి: Chiranjeevi: ఆ విషయంలో చరణ్‌కు, నాకు పోలికే లేదు)
విద్యాబాలన్ మాట్లాడుతూ..' దేవుడి దయ వల్ల నా అవసరాలు తీరాయి. మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛ ఇచ్చారు. మా సోదరి యాడ్ ఏజెన్సీకి వైస్ ప్రెసిడెంట్. నేను సినిమాల్లోకి రావాలనుకున్నా. కానీ నేను ఎప్పుడూ దీర్ఘకాలికమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నేను భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. దానివల్ల నా జీవితం సంతోషంగా ఉంది. నేను గుల్జార్ సాబ్‌తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ అతను ఇకపై దర్శకత్వం వహించడని తెలిసింది. చాలాసార్లు గుల్జార్ సాబ్‌తో 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని సిగ్గులేకుండా అడిగా. నేను ఉడీ అలెన్‌తో కూడా పని చేయాలనుకుంటున్నా' అని అన్నారు.
2005లో సంజయ్ దత్ నటించిన పరిణీత చిత్రంతో విద్యాబాలన్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లగే రహో మున్నా భాయ్ (2006), భూల్ భూలయ్యా (2007), ది డర్టీ పిక్చర్ (2011), మిషన్ మంగళ్ (2019) లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. శకుంతలా దేవి (2020) మూవీలోనూ మెరిసింది విద్యా చివరిసారిగా సురేష్ త్రివేణి చిత్రం జల్సాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో షెఫాలీ షా, మానవ్ కౌల్ కూడా నటించారు. ఆమె తదుపరి చిత్రంలో నటుడు ప్రతీక్ గాంధీ సరసన నటిస్తోంది. ఇందులో ఇలియానా డిక్రూజ్, సెంధిల్ రామమూర్తి కూడా నటిస్తున్నారు. కాగా.. గుల్జార్ మౌసం (1975), అంగూర్ (1982), మాచిస్ (1996), హు టు టు (1999) సినిమాలకు దర్శకత్వం వహించారు.
(ఇది చదవండి: నిర్మాతతో డేటింగ్.. అఫీషియల్‌గా ప్రకటించిన నటి)
Comments
Please login to add a commentAdd a comment