రొమాన్స్ కు వయసుతో పనిలేదు:విద్యాబాలన్ | Romance has no age bar, says Vidya Balan | Sakshi
Sakshi News home page

రొమాన్స్ కు వయసుతో పనిలేదు:విద్యాబాలన్

Published Fri, Jun 27 2014 3:01 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

రొమాన్స్ కు వయసుతో పనిలేదు:విద్యాబాలన్ - Sakshi

రొమాన్స్ కు వయసుతో పనిలేదు:విద్యాబాలన్

ముంబై: రొమాన్స్ ను పండించడానికి వయసుతో పనిలేదని అంటోంది బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యా బాలన్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'బాబీ జాసస్'చిత్రంలో యువ నటుడు ఆలీ ఫైజల్ తో జోడీ కడుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన విద్య.. సినిమాల్లో హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండించటానికి ఏ వయసైన ఫర్వాలేదని అభిప్రాయపడింది. సినిమాలో కథకు ప్రాముఖ్యత ఉన్నప్పుడు వయసులో వ్యత్యాసాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సమర్ షేక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విద్య, ఆలీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకు్న ఈ చిత్రం జూలై 4 వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది.బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహంలతో నటించిన విద్య.. బాలీవుడ్ అగ్రనటులు షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ లతో మాత్రం నటించలేదు.  తగిన స్ర్కిప్ట్ దొరికినప్పుడు వారితో తప్పక నటిస్తానంటోంది  ఈ 36 ఏళ్ల బాలీవుడ్ భామ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement