భజరంగి మామూతో మళ్లీ.. | Rejoice as Harshaali Malhotra and Salman Khan will reunite on-screen soon! | Sakshi
Sakshi News home page

భజరంగి మామూతో మళ్లీ..

Published Tue, Aug 23 2016 6:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

భజరంగి మామూతో మళ్లీ..

భజరంగి మామూతో మళ్లీ..

బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయ్ జాన్' సినిమా చూసినవారెవ్వరు చిన్నారి హర్షాలీ మల్హోత్రను అంత తేలికగా మర్చిపోరు. తన క్యూట్ లుక్స్తోనే కాదు హృదయాన్ని కదిలించే భావోద్వేగపూరిత నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ పాప. తాజాగా హర్షాలీ మరోసారి భజరంగి మామతో కలిసి స్క్రీన్ పంచుకోనుందట. అదే విషయాన్ని సంబరంగా చెబుతుంది.

ముందు నుంచే సల్మాన్ ఫ్యాన్ అయిన హర్షాలీకి.. అనుకోకుండా 'భజరంగీ భాయ్ జాన్' చిత్రంలో పూర్తిస్థాయి పాత్ర చేసే అవకాశం వచ్చింది. షూటింగ్ సమయంలో సల్మాన్కు మరింత దగ్గరైన హర్షాలీ ఆయనను ప్రేమగా 'మామూ' అని పిలుచుకుంటుంది. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో నటిస్తున్నారనేదేగా ఇప్పుడు క్వశ్చన్ మార్క్?  

సినిమా కాదు, ఓ కమర్షియల్ యాడ్లో కనిపించి అలరించనున్నారు.  దానికి సంబంధించిన షూటింగ్ సోమవారం జరిగినట్లు తెలుస్తుంది. సల్మాన్తో కలిసి మరోసారి స్క్రీన్ మీద కనిపించే అవకాశం వచ్చినందుకు హర్షాలీ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement