Harshaali malhotra
-
హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో ట్రెండింగ్ క్వీన్‌గా గుర్తింపు (ఫోటోలు)
-
Harshaali Malhotra: బజరంగీ భాయిజాన్ మున్నీ పాప ఇప్పుడెలా ఉందంటే? (ఫొటోలు)
-
2015లో తన నటనతో కన్నీళ్లు తెప్పించిన ఈ చిన్నది గుర్తుందా..?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ అప్పట్లో పెద్ద సంచలనం. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం అందించారు. 2015లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులతో పాటు బాక్సాఫీసునూ కొల్లగొట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ మూగ, చెవిటి చిన్నారిని.. కన్నవారి వద్దకు చేర్చేందుకు ఓ భారతీయ యువకుడు (సల్మాన్ ఖాన్) ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది) ఇందులో మూగ,చెవిటి చిన్నారి పాత్రలో హర్షాలీ మల్హోత్రా (మున్నీ)గా మెప్పించింది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్లు మాత్రమే. కానీ అందులో సల్మాన్‌తో పోటీగా నటించి మెప్పించింది. తన అమాయకమైన ముఖంతో ప్రేక్షకులకు కన్నీరు తెప్పించిన ఆమెను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డుకు కూడా హర్షాలీ నామినేట్ అయింది. అప్పట్లో తనకు సుమారు రూ. 3 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. తాజాగా ఆమె ఇప్పుడెలా ఉందో తెలుపుతూ ఒక వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత తను ఎలాంటి సినిమాల్లో మళ్లీ నటించలేదు. ప్రస్తుతం చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటుంది. కానీ సల్మాన్‌తో మాత్రం ఇప్పటికీ టచ్‌లోనే ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. తను సంగీతం నేర్చుకునేందుకు వెళ్తుండగా కొందరు ఫోటో గ్రాఫర్లు హర్షాలీ మల్హోత్రాను కెమెరాలతో క్లిక్ మనిపించారు. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్ సపోర్ట్ ఎవరో తెలిస్తే) -
'భజరంగీ భాయిజాన్' మున్నీకి ప్రతిష్టాత్మక అవార్డు.. వారికి అంకితం
Harshaali Malhotra Receives Bharat Ratna Dr Ambedkar Award: ఆంజనేయ స్వామి భక్తుడిగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన మూవీ 'భజరంగీ భాయిజాన్'. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 2015లో విడుదలైన ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందించారు. స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటీనటుల యాక్టింగ్‌కు ఫిదా కావాల్సిందే. అందులో ముఖ్యంగా మున్నీగా అలరించిన హర్షాలీ మల్హోత్ర మైండ్‌లో నుంచి పోదు. అంతలా ఆకట్టుకుంది చిన్నారి హర్షాలీ. తాజాగా హర్షాలీకి అరుదైన గౌరవం దక్కింది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) 13 ఏళ్ల హర్షాలీని మహరాష్ట్ర ప్రభుత్వం 'భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్' అవార్డుతో సత్కరించింది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ నుంచి ఈ పురస్కారాన్ని అందుకుంది ఈ బాల నటి. ఈ విషయాన్ని సోషల్ మీడియా అయిన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఈ బహుమతిని సల్మాన్ ఖాన్, కబీర్ ఖఆన్, చిత్ర నిర్మాతలకు అంకితం ఇస్తున్నట్లుగా పోస్ట్ పెట్టింది హర్షాలీ. ఈ పోస్ట్‌కు అనేకమంది నెటిజన్స్ స్పందించారు. హర్షాలీని చూస్తుంటే గర్వంగా ఉందని, ఇలాంటి విజయాలు మరెన్నో దక్కాలని కోరారు. 'మున్ని ఈ అవార్డు నీది మాత్రమే. ఎందుకంటే నీ యాక్టింగ్‌తోనే ఈ అవార్డు గెలుచుకున్నావ్' అని ఒక యూజర్ అభిమానం చూపించారు. ఇదిలా ఉంటే 'భజరంగీ భాయిజాన్' సినిమా సమయంలో హర్షాలీకి ఎనిమిదేళ్లు. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు -
భజరంగి మామూతో మళ్లీ..
బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయ్ జాన్' సినిమా చూసినవారెవ్వరు చిన్నారి హర్షాలీ మల్హోత్రను అంత తేలికగా మర్చిపోరు. తన క్యూట్ లుక్స్‌తోనే కాదు హృదయాన్ని కదిలించే భావోద్వేగపూరిత నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ పాప. తాజాగా హర్షాలీ మరోసారి భజరంగి మామతో కలిసి స్క్రీన్ పంచుకోనుందట. అదే విషయాన్ని సంబరంగా చెబుతుంది. ముందు నుంచే సల్మాన్ ఫ్యాన్ అయిన హర్షాలీకి.. అనుకోకుండా 'భజరంగీ భాయ్ జాన్' చిత్రంలో పూర్తిస్థాయి పాత్ర చేసే అవకాశం వచ్చింది. షూటింగ్ సమయంలో సల్మాన్‌కు మరింత దగ్గరైన హర్షాలీ ఆయనను ప్రేమగా 'మామూ' అని పిలుచుకుంటుంది. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో నటిస్తున్నారనేదేగా ఇప్పుడు క్వశ్చన్ మార్క్? సినిమా కాదు, ఓ కమర్షియల్ యాడ్‌లో కనిపించి అలరించనున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ సోమవారం జరిగినట్లు తెలుస్తుంది. సల్మాన్‌తో కలిసి మరోసారి స్క్రీన్ మీద కనిపించే అవకాశం వచ్చినందుకు హర్షాలీ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. -
నేను ఆంటీని కాదు: కత్రినా కైఫ్
బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ కు ఊహించని షాక్ తగిలింది. బజరంగీ భాయ్ జాన్ సినిమాతో పరిచయమైన చిన్నారి నటి హర్షాలీ మల్హోత్రా కత్రినాని ఆంటీ అని సంభోదించడమే ఇందుకు కారణం. గత శనివారం కత్రినా తన 33వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సదర్భంగా హర్షాలీ ఫేస్ బుక్ లో కత్రినాతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసింది. హ్యాపీ బర్త్ డే... కత్రినా కైఫ్ ఆంటీ అని ట్యాగ్ లైన్ ని రాసి పోస్టు చేసింది. థ్యాంక్యూ లవ్ యూ అని రిప్లే ఇచ్చిన కత్రినా తనను ఆంటీ అని కాకుండా అక్క అని పిలవాలని రిప్లే ఇచ్చింది. -
అమ్మో.. ఆ పాప అల్లరి గడుగ్గాయి
ముంబయి: బజరంగి భాయీజాన్ చిత్రంలో నటించిన బాలనటి హర్షాలీ మల్హోత్రా అలాంటి ఇలాంటి పాప కాదంట. బాగా అల్లరి గడుగ్గాయట. ఒక్కచోట కూర్చునేది కాదని, నిశ్శబ్దంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని ఆమెకు దుస్తుల అలంకరణ చేసిన ముఖేశ్ చెప్పినట్లు హర్షాలీ తల్లి కాజల్ మల్హోత్రా తెలిపింది. ఎంత చెబుతున్నా.. వినకుండా తనకు నచ్చిన పనే చేస్తూ అల్లరితో ఆగమాగం చేసేదని ముఖేశ్ చెప్పేవాడని ఆమె వివరించింది. బజరంగీ భాయీజాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ పక్కన నటించిన ఈ పాప సినిమా చూసిన వారందరి హృదయాలను తన నటనతో కదిలించింది. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు కంటతడి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పాప గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ముఖేశ్ పంచుకున్నాడు. ఆ పాప ఎంత అల్లరి చేస్తున్నా చిరాకు అనిపించకుండా ముచ్చటేసేదట, తన ఎనర్జీ చూసి ఔరా అనిపించేదట. ప్రతిసారి అటూఇటూ గెంతులుపెడుతుంటే ఒక్క సల్మాన్ మాత్రమే ఆ పాపను ఆడించి మిగితావారి మాట కూడా వినాలని, కుదురుగా ఉండాలని చెప్పి బుజ్జగిస్తుండేవాడట.