
Harshaali Malhotra Receives Bharat Ratna Dr Ambedkar Award: ఆంజనేయ స్వామి భక్తుడిగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన మూవీ 'భజరంగీ భాయిజాన్'. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 2015లో విడుదలైన ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందించారు. స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటీనటుల యాక్టింగ్‌కు ఫిదా కావాల్సిందే. అందులో ముఖ్యంగా మున్నీగా అలరించిన హర్షాలీ మల్హోత్ర మైండ్‌లో నుంచి పోదు. అంతలా ఆకట్టుకుంది చిన్నారి హర్షాలీ. తాజాగా హర్షాలీకి అరుదైన గౌరవం దక్కింది.
13 ఏళ్ల హర్షాలీని మహరాష్ట్ర ప్రభుత్వం 'భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్' అవార్డుతో సత్కరించింది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ నుంచి ఈ పురస్కారాన్ని అందుకుంది ఈ బాల నటి. ఈ విషయాన్ని సోషల్ మీడియా అయిన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఈ బహుమతిని సల్మాన్ ఖాన్, కబీర్ ఖఆన్, చిత్ర నిర్మాతలకు అంకితం ఇస్తున్నట్లుగా పోస్ట్ పెట్టింది హర్షాలీ. ఈ పోస్ట్‌కు అనేకమంది నెటిజన్స్ స్పందించారు. హర్షాలీని చూస్తుంటే గర్వంగా ఉందని, ఇలాంటి విజయాలు మరెన్నో దక్కాలని కోరారు. 'మున్ని ఈ అవార్డు నీది మాత్రమే. ఎందుకంటే నీ యాక్టింగ్‌తోనే ఈ అవార్డు గెలుచుకున్నావ్' అని ఒక యూజర్ అభిమానం చూపించారు. ఇదిలా ఉంటే 'భజరంగీ భాయిజాన్' సినిమా సమయంలో హర్షాలీకి ఎనిమిదేళ్లు.
ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు