Bajrangi Bhaijaan movie
-
హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో ట్రెండింగ్ క్వీన్‌గా గుర్తింపు (ఫోటోలు)
-
'భజరంగీ భాయిజాన్' మున్నీకి ప్రతిష్టాత్మక అవార్డు.. వారికి అంకితం
Harshaali Malhotra Receives Bharat Ratna Dr Ambedkar Award: ఆంజనేయ స్వామి భక్తుడిగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన మూవీ 'భజరంగీ భాయిజాన్'. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 2015లో విడుదలైన ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందించారు. స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటీనటుల యాక్టింగ్‌కు ఫిదా కావాల్సిందే. అందులో ముఖ్యంగా మున్నీగా అలరించిన హర్షాలీ మల్హోత్ర మైండ్‌లో నుంచి పోదు. అంతలా ఆకట్టుకుంది చిన్నారి హర్షాలీ. తాజాగా హర్షాలీకి అరుదైన గౌరవం దక్కింది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) 13 ఏళ్ల హర్షాలీని మహరాష్ట్ర ప్రభుత్వం 'భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్' అవార్డుతో సత్కరించింది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ నుంచి ఈ పురస్కారాన్ని అందుకుంది ఈ బాల నటి. ఈ విషయాన్ని సోషల్ మీడియా అయిన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఈ బహుమతిని సల్మాన్ ఖాన్, కబీర్ ఖఆన్, చిత్ర నిర్మాతలకు అంకితం ఇస్తున్నట్లుగా పోస్ట్ పెట్టింది హర్షాలీ. ఈ పోస్ట్‌కు అనేకమంది నెటిజన్స్ స్పందించారు. హర్షాలీని చూస్తుంటే గర్వంగా ఉందని, ఇలాంటి విజయాలు మరెన్నో దక్కాలని కోరారు. 'మున్ని ఈ అవార్డు నీది మాత్రమే. ఎందుకంటే నీ యాక్టింగ్‌తోనే ఈ అవార్డు గెలుచుకున్నావ్' అని ఒక యూజర్ అభిమానం చూపించారు. ఇదిలా ఉంటే 'భజరంగీ భాయిజాన్' సినిమా సమయంలో హర్షాలీకి ఎనిమిదేళ్లు. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు -
సల్మాన్ ఖాన్ భుజాల మీద ఆడుకున్న చిన్నారి.. ఇప్పుడిలా!
2015లో వచ్చిన 'భజరంగీ భాయ్‌జాన్' సినిమాలో మున్నీ గుర్తుందా? సల్మాన్ ఖాన్ ఆమెను భుజాల మీద వేసుకుని ఆడిపించుకునేవాడు. ఎంతో క్యూట్‌గా, అమాయకంగా కనిపించే ఆ చిన్నారి ఇప్పుడు టీనేజర్. ఇంతకీ మున్నీ అసలు పేరు హర్షలి మల్హోత్రా. తాజాగా ఆమె 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'ఇట్స్ మై బర్త్‌డే.. ఇప్పుడు నేను టీనేజర్‌ను' అంటూ వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పింది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) బర్త్‌డే ఫొటోల్లో హర్షలిని చూసిన నెటిజన్లు ఆమె చాలా ఎదిగిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో, ఇప్పుడు కూడా అంతే క్యూట్‌గా ఉందంటున్నారు. కాగా హర్షలికి ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ రీల్స్ చేయడంతోపాటు ఎప్పటికప్పుడు ఫొటోలను సైతం షేర్ చేస్తుంది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) చదవండి: బైపోలార్ డిజార్డర్ ఉంది కానీ సైకోని కాదు : నటి చిరు పరిచయం, మోహన్‌బాబు డైలాగులతో రచ్చ! -
చైనాలో దుమ్మురేపిన భాయ్‌జాన్
బీజింగ్ : బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన భజ్రంగి భాయ్‌జాన్ చైనా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈనెల 2న చైనాలో విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకూ రూ 150 కోట్లు కలెక్ట్ చేసింది. అమీర్‌ఖాన్ సినిమాలకు మెరుగైన మార్కెట్ ఉన్న చైనాలో అక్కడ విడుదలైన సల్మాన్ తొలిమూవీ ఇదే కావడం గమనార్హం. చైనా మార్కెట్లో సినిమా మంచి వసూళ్లు రాబడుతోందని భజ్రంగి భాయ్‌జాన్ మేకర్లు పేర్కొన్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ భజ్రంగీ భాయ్‌జాన్ రెండో వారాంతంలో మెరుగైన కలెక్షన్లతో దూసుకుపోతూ ఇప్పటివరకూ రూ 150.70 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు ఓ ప్రకటనలో తెలిపారు. చైనాలో విడుదలైన తొలిరోజే ఈ సినిమా రూ 18 కోట్లు వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ సాధించింది. సల్మాన్‌తో పాటు మూవీలో కరీనా కపూర్, బాల నటి హర్షాలి మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చైనా బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం భజ్రంగి భాయ్‌జాన్ తొలి రోజు కలెక్షన్లు అమీర్‌ఖాన్ దంగల్ను అధిగమించాయి. అయితే అమీర్ ఖాన్ ఇటీవలి చిత్రం సీక్రెట్ సూపర్‌స్టార్ రికార్డును మాత్రం భజ్రంగి చెరిపివేయలేకపోయింది. సీక్రెట్ సూపర్‌స్టార్ చైనాలో తొలిరోజు రూ 40 కోట్లు కలెక్ట్ చేసింది. -
నిన్న అనామకుడు.. నేడు సెలబ్రిటీ!
లాహోర్: మొన్నటి వరకు అతనో సాధారణ జర్నలిస్టు. కరాచి ఇండస్ న్యూస్ చానెల్లో పనిచేసే చిరుద్యోగి. అప్పుడప్పుడు అసైన్మెంట్ ఫోన్లు తప్పించి పెద్దగా ఫోన్లు కూడా వచ్చేవి కావు. జర్నలిస్టు మిత్రులకు మాత్రం అతనో లాఫింగ్ స్టఫ్. ఇప్పుడతను ఓ పెద్ద సెలబ్రిటీ. క్షణం విరామం లేకుండా అతని ఫోను మోగుతూనే ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ టీవీలు, వార్తా పత్రికలు, రేడియో స్టేషన్లు ఆయన ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ టీవీ, గల్ఫ్ న్యూస్, డాన్, హిందుస్థాన్ పత్రికలు, ఇంటర్నేషనల్ న్యూస్ వైర్ సర్వీస్, రేడియో మిర్చి లాంటి ఎఫ్ఎమ్ రేడియోలు ఇంటర్వ్యూలు చేయగా, మరిన్ని అతని ఇంటర్వ్యూల కోసం క్యూలో ఉన్నాయి. బాలీవుడ్ సినిమాల్లో నటించాల్సిందిగా ఆఫర్లు కూడా వస్తున్నాయట. అతనే చాంద్ నవాబ్. పాకిస్తాన్ జర్నలిస్ట్. బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్లు వసూలు చేస్తూ ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘బజరంగీ బాయ్‌జాన్’లో పాకిస్తాన్ జర్నలిస్టు పాత్రకు స్ఫూర్తి చాంద్ నవాబ్. ఈ చిత్రంలో పాక్ జర్నలిస్టుగా నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్ర పేరు కూడా చాంద్ నవాబ్ కావడం గమనార్హం. ఈ చిత్రం పాకిస్తాన్లో కూడా సూపర్ హిట్టవడంతో చాంద్ నవాబ్ హఠాత్తుగా సెలబ్రిటీ అయ్యారు. మొన్నటి వరకు ఆయన కరాచీ ప్రెస్ క్లబ్‌కు రోజూ వెళ్లినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అక్కడికొచ్చే జర్నలిస్టులంతా అతనితోని ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడడమే కాకుండా కేవలం అతన్ని కలుసుకునేందుకే ప్రెస్‌క్లబ్‌కు ఎంతో మంది వస్తున్నారు. చాంద్ నవాబ్ సినిమాకు ఎలా స్ఫూర్తినిచ్చారంటే..... 2008లో చాంద్ నవాబ్ ఓ చిన్న టీవీ చానెల్ తరఫున కరాచి రైల్లే స్టేషన్లో నిలబడి వచ్చిపోయే రైళ్ల రాకపోకల గురించి ‘పీస్ టూ కెమేరా (పీ టు సీ) అనే కార్యక్రమం నిర్వహించేవాడు. ఆ సందర్భంగా తనకుగానీ, కెమేరాకుగానీ అడ్డొచ్చే ప్రయాణికులను తప్పుకోమని కోరేవాడు. కొన్ని సార్లు వారిని తోసేసేవాడు, తనదైన రీతిలో ప్రయాణికులను తిట్టేవాడు. ఇదంతా ఫన్నీగా ఫీలైన ఆయన మిత్రులు ఆ కార్యక్రమం ఎడిట్ చేయని వీడియో క్లిప్పింగ్‌ను 2008, డిసెంబర్ 8వ తేదీన ‘యూట్యూబ్’లో పోస్ట్ చేశారు. అది అప్పట్లో హల్చల్ చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్‌ను స్ఫూర్తిగా తీసుకొని బజరంగీ బాయ్‌జాన్ చిత్రంలో జర్నలిస్టు పాత్రను సృష్టించారు. తనను సెలబ్రిటీని చేసిన చిత్రం హీరో సల్మాన్ ఖాన్, తన పాత్రధారి సిద్దిఖీ, దర్శకుడు కబీర్ ఖాన్‌కు చాంద్ నవాబ్ కృతజ్ఞుతలు తెలియజేశారు. తనను స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా తన టీవీ కార్యక్రమంలో తాను ఉపయోగించిన భాషనే చిత్రంలో ఉపయోగించుకున్నందుకు తనకు కొంత సొమ్ము పరిహారంగా ముట్ట చెప్పాలని అతను కోరుతున్నారు. తానేమీ డిమాండ్ చేయడం లేదని, తానొక పేద జర్నలిస్టునని, గతేడాది తన భార్య కూడా చనిపోయిందని నవాబ్ చెబుతున్నారు. సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్లు తనను కలసుకునేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ ఇచ్చారని, ఆ సందర్భంగా తనకు కొంత సొమ్ము ఇవ్వాలని ఆశిస్తున్నానని, అలా ఇవ్వకపోయినా ఫర్వాలేదని అంటున్నారు. -
'బజ్రంగీ భాయ్ జాన్ బాగుంది'
ముంబై: సల్మాన్ ఖాన్ ' బజ్రంగీ భాయ్ జాన్' సినిమాపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే ఇది ఉత్తమ చిత్రమని కితాబిచ్చారు. సల్మాన్ గొప్పగా నటించాడని మెచ్చుకున్నారు. ఇండియా- పాకిస్థాన్ సంబంధాలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుందని, కబీర్ ఖాన్ డైరెక్షన్ అదిరిందని ప్రశంసించారు. ' బజ్రంగీ భాయ్ జాన్' సినిమా సూపర్ అంటూ అనిల్ కపూర్, శిల్పాశెట్టి, ప్రీతి జింతా, సొనాక్షి సిన్హా, జాక్వెలెస్ ఫెర్నాండెజ్, అనుపమ్ ఖేర్, కరణ్ జోహర్, ఫరా ఖాన్, సుభాష్ ఘాయ్, మికా సింగ్, రణదీప్ హుడా, అద్నాన్ సమీ, నిఖిల్ అద్వానీ, టిస్కా చోప్రా, మొహిత్ సూరి తదితరులు ట్వీట్ చేశారు.