చైనాలో దుమ్మురేపిన భాయ్‌జాన్‌ | Salman Khan's Bajrangi Bhaijaan Mints Over Rs 150 Crore In China | Sakshi
Sakshi News home page

చైనాలో దుమ్మురేపిన భాయ్‌జాన్‌

Published Sun, Mar 11 2018 7:12 PM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM

Salman Khan's Bajrangi Bhaijaan Mints Over Rs 150 Crore In China - Sakshi

బీజింగ్‌ : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన భజ్‌రంగి భాయ్‌జాన్‌ చైనా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. ఈనెల 2న చైనాలో విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకూ రూ 150 కోట్లు కలెక్ట్‌ చేసింది. అమీర్‌ఖాన్‌ సినిమాలకు మెరుగైన మార్కెట్‌ ఉన్న చైనాలో అక్కడ విడుదలైన సల్మాన్‌ తొలిమూవీ ఇదే కావడం గమనార్హం. చైనా మార్కెట్‌లో సినిమా మంచి వసూళ్లు రాబడుతోందని భజ్‌రంగి భాయ్‌జాన్‌ మేకర్లు పేర్కొన్నారు.ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ భజ్‌రంగీ భాయ్‌జాన్‌ రెండో వారాంతంలో మెరుగైన కలెక్షన్లతో దూసుకుపోతూ ఇప్పటివరకూ రూ 150.70 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు ఓ ప్రకటనలో తెలిపారు.

చైనాలో విడుదలైన తొలిరోజే ఈ సినిమా రూ 18 కోట్లు వసూలు చేసి మంచి ఓపెనింగ్స్‌ సాధించింది. సల్మాన్‌తో పాటు మూవీలో కరీనా కపూర్‌, బాల నటి హర్షాలి మల్హోత్రా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చైనా బాక్సాఫీస్‌ గణాంకాల ప్రకారం భజ్‌రంగి భాయ్‌జాన్‌ తొలి రోజు కలెక్షన్లు అమీర్‌ఖాన్‌ దంగల్‌ను అధిగమించాయి. అయితే అమీర్‌ ఖాన్‌ ఇటీవలి చిత్రం సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ రికార్డును మాత్రం భజ్‌రంగి చెరిపివేయలేకపోయింది. సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ చైనాలో తొలిరోజు రూ 40 కోట్లు కలెక్ట్‌ చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement