‘జాతీయ అవార్డు అవసరం లేదు’ | Salman Khan Says He Does Not Want A National Award | Sakshi
Sakshi News home page

‘జాతీయ అవార్డు అవసరం లేదు’

Published Wed, May 22 2019 6:11 PM | Last Updated on Wed, May 22 2019 6:15 PM

Salman Khan Says He Does Not Want A National Award - Sakshi

ముంబై : జాతీయ అవార్డులపై బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తి వారిని అలరించడమే తనకు ఇష్టమని అవార్డులపై ఆశ లేదని ప్రేక్షకుల రివార్డులే తనకు ముఖ్యమని సల్మాన్‌ స్పష్టం చేశారు. మీకు ఇంతవరకూ జాతీయ అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించగా, తాను కేవలం రివార్డులే కోరుకుంటానని, నా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్‌కు వెళితే తనకు నేషనల్‌ అవార్డు దక్కినట్టేనని చెప్పుకొచ్చారు.

దేశం మొత్తం తన సినిమాను చూడటమే తనకు అతిపెద్ద రివార్డ్‌ అన్నారు. ఆరు ఫైట్లు, నాలుగు పాటలతో సినిమాను రక్తికట్టించే తరహాలో రూపొందే సినిమాలతో సల్మాన్‌కు నేషనల్‌ అవార్డులు ఎలా వస్తాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే రుస్తుం మూవీతో అక్షయ్‌ కుమార్‌కు జాతీయ అవార్డు లభించడంతో సల్మాన్‌ అభిమానులు సైతం తమ హీరోకు రివార్డులతో పాటు అవార్డులూ దక్కాలని ఆశిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement