తమిళసినిమా: గ్లామరస్ పాత్రలతో తన సినీ కెరీర్‌ను ప్రారంభింన తమన్నా భాటియా ఆ తర్వాత బాహుబలి వంటి పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఐటెం సాంగ్స్‌లోనూ తన ప్రతిభ చాటుకుంది. నటిగా రెండు దశబ్దాలు పూర్తి చేసుకోనున్న తమన్నా ఇప్పటికీ అవకాశాలను పొందడంలో తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే ఆదిలో ఈ అమ్మని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు మళ్లీ అక్కున చేర్చుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఇప్పుడు హిందీలో ఏకంగా మూడు చిత్రాలను పూర్తి చేసింది. అందులో ఒకటి బబ్లీ బౌన్సర్.
ఈ చిత్రం ద్వారా తన కెరీర్‌లో తొలిసారి జాతీయ అవార్డు వస్తుందని గట్టిగా నమ్ముతోంది. దీని గురించి ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మదుర్ బండార్కర్ దర్శకత్వం వహింన ఈ చిత్రానికి కచ్చితంగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. తాను ఇందులో హర్యానాకు చెందిన యువతిగా నటించానని తెలిపింది. మొట్టమొదటిసారిగా లేడీ బౌన్సర్ ఇతివృత్తంతో రూపొందింన కథా చిత్రం ఇదని చెప్పింది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని పేర్కొంది.
తన సినీ జీవితంలో ఉత్తమ చిత్రం అని చెప్పింది. ఇంతకు ముందు మదుర బండార్కర్ దర్శకత్వంలో నటింన హీరోయిన్లకు ఉత్తమ అవార్డులు లభించాయని, ఈ చిత్రంతో తనకు కూడా ఉత్తమ జాతీయ నటి అవార్డు లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఈ అవార్డు రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొంది. అయితే ఈ చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోండటం గమనార్హం. కాగా చిన్న గ్యాప్ తరువాత ఈమె కోలీవుడ్‌లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment