Lady bouncer
-
లేడీ బౌన్సర్స్‌కు అడ్డే లేదు
స్త్రీలను కొన్ని ఉపాధుల్లోకి రానీకుండా అడ్డుకుంటారు. అడ్డుకునేవారిని అడ్డుకుంటాం అంటున్నారు ఈ లేడీ బౌన్సర్లు. కొచ్చి, పూణె, ఢిల్లీ, ముంబైలలో లేడీ బౌన్సర్లకు గిరాకీ పెరిగింది. సెలబ్రిటీలను గుంపు నుంచి అడ్డుకుని వీరు కాపాడుతారు. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్ తెలిసిన స్త్రీలు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. రోజుకు రెండు వేల వరకూ ఫీజు. వివాహితలూ ఉన్నారు. వివరాలు...ఎనిమిది గంటలు డ్యూటీ. తీసుకెళ్లడం తీసుకురావడం ఏజెన్సీ పని. భోజనం ఉంటుంది. బయట ఊర్లయితే రూము కూడా ఇస్తారు. రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదన. చేయాల్సిన పని?⇒ క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం⇒ ఈవెంట్ సెక్యూరిటీ⇒ సెలబ్రిటీల రక్షణ⇒ సెలబ్రిటీలను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం⇒ సంపన్నుల వేడుకల్లో హంగామా కోసం ⇒ ప్రయివేటు సమస్యల్లో రక్షణఇటీవల ఒక సినీ నటుడి ఇంటి గొడవల్లో బౌన్సర్లనే మాట ఎక్కువగా వినిపించింది. పోలీసుల రక్షణ వీలుగాని చోట ప్రముఖులు బౌన్సర్ల సాయం తీసుకోవడం సాధారణం అయ్యింది. ఒకప్పుడు పబ్‌లలో తాగి గొడవ చేసే వారి కోసం మాత్రమే బౌన్సర్లు ఉండేవారు. ఇప్పుడు అన్ని సేవలకు వారిని ఉపయోగిస్తున్నారు. సెక్యూరిటీకి మాత్రమే కాదు దర్పం చూపించడానికి కూడా శ్రీమంతులు బౌన్సర్లను వాడుతున్నారు. ఉదాహరణకు కలవారి పెళ్లిళ్లలో వరుడు/వధువు కల్యాణ వేదికకు వచ్చేప్పుడు వరుసదీరిన బౌన్సర్లు చెరో పక్క నడుస్తూ బిల్డప్ ఇస్తున్నారు. చూసేవారికి ఇది గొప్పగా ఉంటుంది. వేడుకలకు, బిజినెస్ మీటింగ్స్‌కు వచ్చే అతిథుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు బౌన్సర్లను పంపుతున్నారు. కాలేజీ వేడుకలు, ప్రారంభోత్సవాలు, ఔట్‌డోర్ షూటింగ్‌లు... వీటన్నింటికీ బౌన్సర్లు కావాలి. ఎంతమంది బౌన్సర్లుంటే అంత గొప్ప అనే స్థితికి సెలబ్రిటీలు వెళ్లారు. దాంతో వీరి సేవలను సమకూర్చే ఏజెన్సీలు నగరాల్లో పెరిగాయి. మహిళా బౌన్సర్లు కూడా పెరిగారు.ఇబ్బందిగా మొదలయ్యి...‘మొదట ప్యాంటూ షర్టు వేసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. ఇంట్లో వాళ్లు కొత్తగా చూశారు. ఇరుగుపొరుగు వారు వింతగా చూశారు. కాని తరువాత అలవాటైపోయింది’ అంది పూణెకు చెందిన ఒక మహిళా బౌన్సర్. 2016లో దేశంలోనే మొదటిసారిగా మహిళా బౌన్సర్ల ఏజెన్సీ ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు కేరళలో ఈ రంగంలోకి వస్తున్నవారు పెరిగారు. ‘మేము ఎవరినో రక్షించడానికి వెళుతుంటే మా రక్షణ కోసం కొత్తల్లో కుటుంబ సభ్యులు ఆందోళన పడేవారు. కాని స్త్రీలు ఈ రంగంలో సురక్షితంగా పని చేయొచ్చని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు’ అని మరో బౌన్సర్ అంది.రెండు విధాలా ఆదాయంకొచ్చిలో ‘షీల్డ్ బౌన్సర్స్ ఏజెన్సీ’కి చెందిన మహిళా బౌన్సర్లు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా మారారు. ఈవెంట్స్‌లో మహిళా అతిథులకు, స్టేజ్ రక్షణకు, అతిథుల హోటల్ నుంచి ఈవెంట్ వద్దకు తీసుకు రావడానికి వీరి సేవలు ఉపయోగిస్తున్నారు. ‘సాధారణంగా ఈవెంట్స్ సాయంత్రాలు ఉంటాయి. బౌన్సర్ల పని అప్పటి నుంచి మొదలయ్యి అర్ధరాత్రి వరకూ సాగుతుంది. కాబట్టి పగటి పూట చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లేదా ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ మధ్యాహ్నం తర్వాత ఈ పని చేస్తున్నవారూ ఉన్నారు. దాంతో రెండు విధాల ఆదాయం ఉంటోంది’ అని ఆ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు.స్పోర్ట్స్ తెలిసినవారుస్కూల్, కాలేజీల్లో స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉన్న మహిళలు, వ్యాయామం ద్వారా జిమ్ ద్వారా దేహాన్ని ఫిట్‌గా ఉంచుకున్నవారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు మహిళా బౌన్సర్లుగా రాణిస్తారు. వెంటనే వారికి పని దొరికే పరిస్థితి ఉంది. దేశంలోని నగరాల్లో వివాహితలు, పిల్లలున్న తల్లులు కూడా వృత్తిలో రాణిస్తున్నారు. ‘జనాన్ని అదుపు చేయడం, వారిని ఒప్పించి ఇప్పుడే దూరంగా జరపడం, ఆకతాయిలను కనిపెట్టడం, సెలబ్రిటీలతో వ్యహరించే పద్ధతి తెలియడం, చట్టపరిధిలో గొడవలను అదుపు చేయడం తెలిస్తే ఈ వృత్తి లాభదాయకం’ అంటున్నారు ఈ మహిళా బౌన్సర్లు. -
ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు వస్తుందనుకుంటున్నా : తమన్నా
తమిళసినిమా: గ్లామరస్ పాత్రలతో తన సినీ కెరీర్‌ను ప్రారంభింన తమన్నా భాటియా ఆ తర్వాత బాహుబలి వంటి పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఐటెం సాంగ్స్‌లోనూ తన ప్రతిభ చాటుకుంది. నటిగా రెండు దశబ్దాలు పూర్తి చేసుకోనున్న తమన్నా ఇప్పటికీ అవకాశాలను పొందడంలో తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే ఆదిలో ఈ అమ్మని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు మళ్లీ అక్కున చేర్చుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఇప్పుడు హిందీలో ఏకంగా మూడు చిత్రాలను పూర్తి చేసింది. అందులో ఒకటి బబ్లీ బౌన్సర్. ఈ చిత్రం ద్వారా తన కెరీర్లో తొలిసారి జాతీయ అవార్డు వస్తుందని గట్టిగా నమ్ముతోంది. దీని గురించి ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మదుర్ బండార్కర్ దర్శకత్వం వహింన ఈ చిత్రానికి కచ్చితంగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. తాను ఇందులో హర్యానాకు చెందిన యువతిగా నటించానని తెలిపింది. మొట్టమొదటిసారిగా లేడీ బౌన్సర్ ఇతివృత్తంతో రూపొందింన కథా చిత్రం ఇదని చెప్పింది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని పేర్కొంది. తన సినీ జీవితంలో ఉత్తమ చిత్రం అని చెప్పింది. ఇంతకు ముందు మదుర బండార్కర్ దర్శకత్వంలో నటింన హీరోయిన్లకు ఉత్తమ అవార్డులు లభించాయని, ఈ చిత్రంతో తనకు కూడా ఉత్తమ జాతీయ నటి అవార్డు లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఈ అవార్డు రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొంది. అయితే ఈ చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోండటం గమనార్హం. కాగా చిన్న గ్యాప్ తరువాత ఈమె కోలీవుడ్‌లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. -
నైట్ క్లబ్‌లలో విధులు! 2500 మందికి ఉపాధి! ఆమె విజయం అసామాన్యం
బౌన్సర్లంటే మగవాళ్లే గుర్తుకు వస్తారు. కండలు తిరిగిన ఒంటితో హడావిడి చేస్తారు. కాని 20 ఏళ్ల క్రితమే మెహరున్నిసా తొలి మహిళా బౌన్సర్ అయ్యింది. నైట్ క్లబ్‌లలో ధైర్యంగా విధులు నిర్వర్తించింది. ఆకతాయిల భరతం పట్టి స్త్రీలకు రక్షణ ఇచ్చింది. గత సంవత్సరం సొంత సెక్యూరిటీ సంస్థ స్థాపించి 2500 మంది యువతీ యువకులకు ఈ రంగంలో ఉపాధి చూపింది. ఆమె విజయం అసామాన్యం. గతంలో ‘ట్రాఫిక్ సిగ్నల్’, ‘పేజ్ 3’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు మధుర్ భండార్కర్ తాజాగా ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమాను తీశాడు. తమన్నా ముఖ్యపాత్ర. వచ్చే వారమే విడుదల. ఒక లేడీ బౌన్సర్ కథను సినిమాగా తీయడం వెనుక అతణ్ణి ఇన్‌స్పయిర్ చేసిన విషయం ఏమిటన్నది చెప్పలేదు కానీ కచ్చితంగా మెహరున్నీసా జీవిత కథ మాత్రం ఇందుకు ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే మెహరున్నీసా మన దేశంలో తొలి మహిళా బౌన్సర్. 2003లోనే ఆమె బౌన్సర్‌గా మారి సంచలనం సృష్టించింది. గత 20 ఏళ్లుగా అదే రంగంలో పని చేస్తూ తాజాగా సౌత్ ఢిల్లీలో ‘మర్దాని బౌన్సర్ అండ్ డాల్ఫిన్ సెక్యూరిటీ సర్వీస్’ అనే సంస్థ స్థాపించి యువతీ యువకులకు సెక్యూరిటీ పర్సనల్‌గా, బౌన్సర్లుగా ఉపాధి కల్పిస్తోంది. ఒక చిన్న ఊరి నుంచి బయలుదేరిన మెహరున్నీసా ఇంత దూరం ప్రయాణించడం సామాన్యమైన విషయం కాదు. మెహరున్నీసా (PC: Instagram) నేను సెక్యూరిటీ గార్డ్‌ను కాను ‘మాది ఉత్తరప్రదేశ్‌లోని సహరన్పూర్. ఢిల్లీలో ఒకసారి ఇండియన్ ఐడెల్ ఆడిషన్స్‌కు వెళ్లాను. అక్కడ చాలామంది బౌన్సర్లను చూశాను. అందరూ మగవాళ్లే. నాక్కూడా బౌన్సర్ కావాలనిపించింది. మేము నలుగురం అక్కచెల్లెళ్లం. మా నాన్నకు మమ్మల్ని చదివించాలంటే భయం. ఎందుకంటే చదువుకున్న ఆడపిల్లలు వాళ్ల ఇష్టానికి పెళ్లి చేసుకుని పోతారని అనుకునేవాడు. కాని మా అమ్మ చదివించింది. అయినా సరే నా 12వ ఏట పెళ్లి చేద్దామని మా నాన్న అనుకుంటే టైఫాయిడ్ వచ్చి మూలన పడ్డాను. అలా ఆ పెళ్లి తప్పింది. ఆ సమయంలో గట్టిగా అనుకున్నాను– శరీరాన్ని దృఢంగా చేసుకోవాలని. వెంటనే కరాటేలో చేరాను. జిమ్ మొదలెట్టాను. పోలీస్‌లో చేరదామనుకున్నా, కాని వీలు కాలేదు. ఇంటర్ అయ్యాక ఉద్యోగ ఆలోచనలు చేస్తుంటే ఢిల్లీలో బౌన్సర్ ఉద్యోగం ఉందని తెలిసింది. అప్పటి వరకూ ఆడపిల్లలు బౌన్సర్‌గా చేయడం లేదు. ధైర్యం చేసి చేరాను. కాని మహిళను కావడంతో అందరూ నన్ను సెక్యూరిటీ గార్డ్ అని పిలిచేవారు. నేను సెక్యూరిటీ గార్డ్‌ను కాను బౌన్సర్‌ని అని గట్టిగా వాదులాట చేయాల్సి వచ్చింది. బార్లో స్త్రీలను ఆకతాయిల నుంచి కాపాడటం, డ్రగ్స్ వంటి ధంధాలు నడవకుండా చూడటం, తాగేసి తగాదా పడే మగవాళ్లను సమర్థంగా విడదీసి ఇళ్లకు పంపడం ఇవన్నీ బాగా చేసేదాన్ని. దాంతో నన్ను బౌన్సర్ అని పిలవక తప్పలేదు’ అంటుంది మెహరున్నీసా. నేటికీ బౌన్సర్‌గా మెహరున్నీసా బౌన్సర్‌గా పని చేయడం తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేదు. బౌన్సర్ అంటే నైట్ డ్యూటీ. అందువల్ల బంధువులు ఏవో ఒక మాటలు అనేవారు. అయినా సరే మెహరున్నీసా తన డ్యూటీలో నిమగ్నమైంది. నేటికీ ఢిల్లీని హౌస్ఖాస్ ప్రాంతంలో ‘సోషల్’ అనే పబ్‌లో బౌన్సర్‌గా డ్యూటీ చేస్తుంది. మరోవైపు గత సంవత్సరం ఆమె సెక్యూరిటీ సంస్థ స్థాపించి బౌన్సర్లను, సెక్యూరిటీ గార్డ్లను ఆయా సంస్థలతో అనుసంధానం చేయడం మొదలెట్టింది. ఢిల్లీలో ఈవెంట్లు జరిగితే, సినిమా వాళ్లు వస్తే మెహరున్నీసా సంస్థ నుంచి బౌన్సర్లు వెళుతున్నారు. మెహరున్నీసాను చూసి ఆమె ఆఖరు చెల్లెలు కూడా బౌన్సర్ అయ్యింది. ‘మా నాన్న నాకొచ్చిన పేరు, గుర్తింపు గౌరవం చూసి ఇప్పుడు సంతోషపడుతున్నాడు. మా చిన్న చెల్లెలు బౌన్సర్ అయినా ఏమీ అనలేదు. ఆయన గతంలో ఆడపిల్లలు ఇంటి పనులు నేర్చుకుంటే చాలు అనుకున్నాడు. కాని ఇప్పుడు ఆడపిల్లలు చాలా సాధించగలరు అని తెలుసుకున్నాడు’ అంటుంది మెహరున్నీసా. ఇప్పుడు ఆమెకు 35 ఏళ్లు. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. కొత్తదారుల్లో మొదటగా నడిచేవారు విజేతలవుతారనడానికి మెహరున్నీసా ఒక ఉదాహరణ. మగవాళ్లు మాత్రమే అనుకునే రంగాల్లో స్త్రీలూ ప్రవేశించగలరు అనడానికి ఈమె ఒక స్ఫూర్తి. చదవండి: ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న మహిళా రైతు ఓబులమ్మ -
మహిళను చితక్కొట్టిన లేడీ బౌన్సర్
-
మహిళను చితక్కొట్టిన లేడీ బౌన్సర్
కొచ్చిలోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలిని లేడీ బౌన్సర్ చితక్కొట్టింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. కాగా వృత్తిపరమైన విబేధాల వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం ముదిరి బాహాబాహీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే నిమిషాల్లో ఆ వీడియో వైరల్ గా మారింది.