Madhur Bandarkar
-
ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు వస్తుందనుకుంటున్నా : తమన్నా
తమిళసినిమా: గ్లామరస్ పాత్రలతో తన సినీ కెరీర్‌ను ప్రారంభింన తమన్నా భాటియా ఆ తర్వాత బాహుబలి వంటి పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఐటెం సాంగ్స్‌లోనూ తన ప్రతిభ చాటుకుంది. నటిగా రెండు దశబ్దాలు పూర్తి చేసుకోనున్న తమన్నా ఇప్పటికీ అవకాశాలను పొందడంలో తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే ఆదిలో ఈ అమ్మని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు మళ్లీ అక్కున చేర్చుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఇప్పుడు హిందీలో ఏకంగా మూడు చిత్రాలను పూర్తి చేసింది. అందులో ఒకటి బబ్లీ బౌన్సర్. ఈ చిత్రం ద్వారా తన కెరీర్లో తొలిసారి జాతీయ అవార్డు వస్తుందని గట్టిగా నమ్ముతోంది. దీని గురించి ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మదుర్ బండార్కర్ దర్శకత్వం వహింన ఈ చిత్రానికి కచ్చితంగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. తాను ఇందులో హర్యానాకు చెందిన యువతిగా నటించానని తెలిపింది. మొట్టమొదటిసారిగా లేడీ బౌన్సర్ ఇతివృత్తంతో రూపొందింన కథా చిత్రం ఇదని చెప్పింది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని పేర్కొంది. తన సినీ జీవితంలో ఉత్తమ చిత్రం అని చెప్పింది. ఇంతకు ముందు మదుర బండార్కర్ దర్శకత్వంలో నటింన హీరోయిన్లకు ఉత్తమ అవార్డులు లభించాయని, ఈ చిత్రంతో తనకు కూడా ఉత్తమ జాతీయ నటి అవార్డు లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఈ అవార్డు రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొంది. అయితే ఈ చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోండటం గమనార్హం. కాగా చిన్న గ్యాప్ తరువాత ఈమె కోలీవుడ్‌లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. -
కాన్సెప్ట్ దొరికింది
పదేళ్ల క్రితం బాలీవుడ్లో వచ్చిన ‘ఫ్యాషన్’ చిత్రం మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మధూర్ బండార్కర్ దర్శకత్వంలో ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్, ముగ్ధా గాడ్సే, అర్జున్ బజ్వా కీలక పాత్రలు చేశారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు మధూర్ బండార్కర్ పేర్కొన్నారు. ‘‘సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగానే నా సినిమాలు ఉంటాయి. ఈ ఫోకస్‌ను ఇలానే కొనసాగిద్దామనుకుంటున్నాను. ‘ఫ్యాషన్’ చిత్రం వచ్చి పదేళ్లు పూర్తయ్యింది. ఈ సినిమా కోసం పని చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. ‘ఫ్యాషన్ 2’ చిత్రం కోసం ఓ కాన్సెప్ట్‌ను రెడీ చేశాను. కానీ ప్రస్తుతం నేను వర్క్ చేస్తోన్న ఇంకో సినిమా స్క్రిప్ట్ పని పూర్తవ్వగానే ‘ఫ్యాషన్ 2’ వర్క్‌ని స్టార్ట్ చేస్తా’’ అని పేర్కొన్నారు మధూర్ బండార్కర్. -
'ఇందు సర్కార్ రిలీజ్‌పై స్టే ఇవ్వండి'
బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌కు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన 21 నెలల ఎమర్జెన్సీ నేపథ్యంలో రూపొందిన 'ఇందు సర్కార్' చిత్రం విడుదలపై ప్రియా సింగ్ పాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ముంబై హైకోర్టు ప్రియా వాదనను తోసి పుచ్చటంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంజయ్‌గాంధీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిష్ఠను దిగజార్చేలా సినిమా ట్రయిలర్ ఉందని, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని, సినిమా విడుదలపై స్టే విధించాలని కోరింది. ఇటీవల.. ఇందిరాగాంధీ చిన్న కొడుకు, దివంగత కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ తన తండ్రి అని ప్రియాసింగ్ పాల్ అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 12 కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ముంబై హైకోర్టు సైతం స్టే ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ముందుగా అనుకున్న ప్రకారమే ఈనెల 28న 'ఇందు సర్కార్' ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు. కానీ మరోసారి ప్రియా సింగ్ పాల్ కోర్టును ఆశ్రయించటంతో ఇందు సర్కార్ రిలీజ్ పై చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు.