బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ అప్పట్లో పెద్ద సంచలనం. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం అందించారు. 2015లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులతో పాటు బాక్సాఫీసునూ కొల్లగొట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ మూగ, చెవిటి చిన్నారిని.. కన్నవారి వద్దకు చేర్చేందుకు ఓ భారతీయ యువకుడు (సల్మాన్ ఖాన్) ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ.
(ఇదీ చదవండి: 'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది)
ఇందులో మూగ,చెవిటి చిన్నారి పాత్రలో హర్షాలీ మల్హోత్రా (మున్నీ)గా మెప్పించింది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్లు మాత్రమే. కానీ అందులో సల్మాన్‌తో పోటీగా నటించి మెప్పించింది. తన అమాయకమైన ముఖంతో ప్రేక్షకులకు కన్నీరు తెప్పించిన ఆమెను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డుకు కూడా హర్షాలీ నామినేట్ అయింది. అప్పట్లో తనకు సుమారు రూ. 3 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. తాజాగా ఆమె ఇప్పుడెలా ఉందో తెలుపుతూ ఒక వీడియో వైరల్ అయింది.
ఆ తర్వాత తను ఎలాంటి సినిమాల్లో మళ్లీ నటించలేదు. ప్రస్తుతం చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటుంది. కానీ సల్మాన్‌తో మాత్రం ఇప్పటికీ టచ్‌లోనే ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. తను సంగీతం నేర్చుకునేందుకు వెళ్తుండగా కొందరు ఫోటో గ్రాఫర్లు హర్షాలీ మల్హోత్రాను కెమెరాలతో క్లిక్ మనిపించారు. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్ సపోర్ట్ ఎవరో తెలిస్తే)
Comments
Please login to add a commentAdd a comment