bhajarangi bhaijaan
-
2015లో తన నటనతో కన్నీళ్లు తెప్పించిన ఈ చిన్నది గుర్తుందా..?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ అప్పట్లో పెద్ద సంచలనం. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం అందించారు. 2015లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులతో పాటు బాక్సాఫీసునూ కొల్లగొట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ మూగ, చెవిటి చిన్నారిని.. కన్నవారి వద్దకు చేర్చేందుకు ఓ భారతీయ యువకుడు (సల్మాన్ ఖాన్) ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది) ఇందులో మూగ,చెవిటి చిన్నారి పాత్రలో హర్షాలీ మల్హోత్రా (మున్నీ)గా మెప్పించింది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్లు మాత్రమే. కానీ అందులో సల్మాన్‌తో పోటీగా నటించి మెప్పించింది. తన అమాయకమైన ముఖంతో ప్రేక్షకులకు కన్నీరు తెప్పించిన ఆమెను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డుకు కూడా హర్షాలీ నామినేట్ అయింది. అప్పట్లో తనకు సుమారు రూ. 3 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. తాజాగా ఆమె ఇప్పుడెలా ఉందో తెలుపుతూ ఒక వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత తను ఎలాంటి సినిమాల్లో మళ్లీ నటించలేదు. ప్రస్తుతం చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటుంది. కానీ సల్మాన్‌తో మాత్రం ఇప్పటికీ టచ్‌లోనే ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. తను సంగీతం నేర్చుకునేందుకు వెళ్తుండగా కొందరు ఫోటో గ్రాఫర్లు హర్షాలీ మల్హోత్రాను కెమెరాలతో క్లిక్ మనిపించారు. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్ సపోర్ట్ ఎవరో తెలిస్తే) -
న్యూ ఇయర్ లో భజరంగీ భాయ్ జాన్ సీక్వెల్ షూటింగ్
-
మరో బాలీవుడ్ చిత్రానికి బాహుబలి రచయిత స్క్రిప్ట్
‘భజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’ వంటి బాలీవుడ్ హిట్ చిత్రాలకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ మరోసారి బాలీవుడ్లో ఒక బహుభాషా చిత్రానికి స్క్రిప్ట్ సమకూర్చుతున్నారు. ‘సీత... ది ఇన్కార్నేషన్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహించనున్నారు. హ్యూమన్ బీయింగ్ స్డూడియోస్ సంస్థ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదలైన ‘సీత... ది ఇన్కార్నేషన్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీతాదేవి గురించి ఎవరికీ తెలియని విషయాల్ని ఈ సినిమాలో చూపించనున్నారు. మనోజ్ ముంతాషీర్ మాటలు రాస్తున్న ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి పెద్ద ఎత్తున వీఎఫ్ఎక్స్ చేయనున్నారట. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఇంకా ప్రకటించలేదు. అందుకే సీత పాత్రలో ఎవరు నటించనున్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే విజయేంద్రప్రసాద్ కథ అందించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ అక్టోబర్ 13న విడుదల కానుంది. -
‘బాహుబలి 2’ భారీ రిలీజ్
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది బాహుబలి 2. దాదాపు అన్ని భాషల్లో టాప్ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఓవర్సీస్ లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో రిలీజ్ అవుతోంది. చైనాలోని ఐమాక్స్ స్క్రీన్స్ మీద రిలీజ్ అవుతున్న తొలి భారతీయ సినిమాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్న బాహుబలి 2కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా చైనాలో 7000లకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. దంగల్ సినిమా 7000 వేల స్క్రీన్స్ మీదే రిలీజ్ కాగా బాహుబలి అంతకు మించి భారీ స్థాయిలో విడుదలవుతోంది. దంగల్ రికార్డ్‌ను చెరిపేసిన బాహుబలి 2.. 8000 స్క్రీన్లపై రిలీజ్ అయిన భజరంగీ బాయ్‌జాన్ రికార్డ్‌ను మాత్రం దాటలేకపోయింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి బాహుబలి 2 అయినా సత్తా చాటుతుందేమో చూడాలి. -
త్వరలో భారత్‌కు ‘గీత’
-
త్వరలో భారత్‌కు ‘గీత’
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అనుకోకుండా సరిహద్దు దాటి 15 ఏళ్ల నుంచి పాకిస్తాన్లో నివసిస్తున్న మూగ, చెవిటి యువతి గీత.. త్వరలోనే తన కుటుంబాన్ని కలుసుకోబోతోంది. తన కుటుంబ సభ్యుల ఫొటోను గీత గుర్తించడంతో ఆమెను భారత్ రప్పించేందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయినట్లయింది. ‘‘త్వరలోనే గీత భారత్‌కు వస్తుంది. ఆమె కుటుంబాన్ని గుర్తించాం. అయితే డీఎన్ఏ పరీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే ఆ కుటుంబానికి అప్పగిస్తాం’’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. గీతకు మూడు సెట్ల ఫొటోలు పంపించామని, దానిలో ఒక సెట్లో ఉన్న వ్యక్తులను గీత తన కుటుంబ సభ్యులుగా గుర్తించిందని తెలిపారు. డీఎన్ఏ పరీక్ష తర్వాతే కుటుంబీకులను గుర్తిస్తామన్నారు. గీత తల్లిదండ్రులు బిహార్‌కు చెందిన వారిగా సమాచారం. గీత జాతీయతను ఇప్పటికే గుర్తించామని, ఆమెను వెనక్కి తీసుకువస్తామని చెప్పారు. అయితే ఇది ఆమె తల్లిదండ్రులను గుర్తించామా, లేదా అనేదానికి సంబంధం లేకుండా జరుగుతుందన్నారు. గీత భారత పుత్రిక అని ఆయన అన్నారు. గీత గుర్తించిన వారు డీఎన్ఏ టెస్టులో ఆమె తల్లిదండ్రులే అని తెలిస్తే.. వారికే అప్పగిస్తామని వికాస్ చెప్పారు. లేదంటే గీత సంరక్షణార్థం ఢిల్లీలో, ఇండోర్‌లో ఒక్కో సంస్థను గుర్తించామని, ఆమెలాంటి వికలాంగులకు సేవ చేసే ఆ సంస్థల్లో ఒకదానికి అప్పగిస్తామన్నారు. వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియలన్నీ పూర్తయ్యాయని చెప్పిన ఆయన.. గీతకు భారత్‌లో పెద్ద ఎత్తున స్వాగతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. గీతతో పాటు ఈదీ ఫౌండేషన్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులు భారత్‌కు వస్తారని ఆయన వెల్లడించారు. కాగా, గీతను వెనక్కి పంపుతున్న విషయాన్ని పాక్‌లో గీతను సంరక్షిస్తున్న ఈదీ ఫౌండేషన్ ప్రతినిధి అన్వర్ కజ్మి కూడా ధ్రువీకరించారు. ఆమెను ఈ నెల 26న స్వదేశానికి పంపే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి భారత్‌కు సమాచారమిచ్చామని పాక్ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్ పంపిన ఫొటోలోని తన తండ్రిని, సవతితల్లిని, తోబుట్టువులను గీత గుర్తించిందని తెలిసింది. గీతకు ఏడెనిమిదిఏళ్ల వయసున్నపుడు సంఝౌ తా ఎక్స్‌ప్రెస్‌లో సరిహద్దు దాటి పాక్‌లోని లాహోర్ స్టేషన్‌కు చేరింది. రైల్లో ఒంటరిగా ఉన్న ఆ పాపను పాక్ రేంజర్లు గుర్తించి ఈదీ ఫౌండేషన్‌కు అప్పగించారు. అక్కడి నుంచి గీత కరాచీకి చేరింది. సుష్మ ఆదేశాలపై పాక్‌లోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్ ఆగస్టులో గీతను కలిశారు. అప్పటి నుంచి గీత పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. గీతను తిప్పి పంపడానికి పాక్ సహకరిస్తున్నదని విదేశాంగ శాఖ తెలిపింది. -
పాక్ నుంచి 'గీత' వచ్చేస్తోంది
-
పాక్ నుంచి 'గీత' వచ్చేస్తోంది
కరాచి: ఎట్టకేలకు గీత తిరిగి మాతృదేశం రాబోతుంది. పన్నేండేళ్ల తర్వాత తన తల్లిదండ్రుల ఒడిని చేరబోతుంది. పుట్టుకతోనే మూగ, చెవిటి లక్షణాలు ఉన్న గీత తన తల్లిదండ్రులను గుర్తించిందని, ఇక ఆమెను భారత్ రప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే డాక్యుమెంట్ల కార్యక్రమాలు పూర్తి చేసి వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని ఢిల్లీ అధికారులు తెలిపారు. ఆమె తల్లి దండ్రులు ప్రస్తుతం బీహార్‌లో ఉన్నారని చెప్పారు. 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు(2003లో) గీత పొరపాటున సరిహద్దులో తప్పిపోయి ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచీలో చిక్కిపోయింది. ఆమెకు కరాచీలోని ఈది ఫౌండేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్ధ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం ఆమెకు 20 ఏళ్లు దాటాయి. తిరిగి మాతృదేశం భారత్ కు రావాలనే ఆమె ఆకాంక్ష 'బజరంగీ భాయిజాన్' సినిమా విడుదలైన తర్వాత మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసిన సంగతి విదితమే. కాగా, ఈ కూతురు తమ కూతురంటే తమ కూతురని పంజాబ్‌కు చెందిన బధిర దంపతులు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మరో రెండు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. అయితే, అలా ఆశ్రయించిన వారి ఫొటోలను ఇటీవల పాక్ లోని భారత హై కమిషన్ ఆమెకు చూపించగా వారిని గుర్తుపట్టింది. ఆమె గుర్తుపట్టిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం బీహార్‌లో నివసిస్తున్నారు. దీంతో త్వరలోనే ఆమెను భారత్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. -
గీత మా కూతురు.. కాదు మా కూతురు!
పొరపాటున తప్పిపోయి ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచీలో నివసిస్తున్న భారత బాలిక గీత.. ఎవరి బిడ్డ అనే విషయంపై కొనసాగుతున్న సందిగ్ధత మరింత జటిలమైంది. 15 ఏళ్ల కిందట తప్పిపోయిన తమ కూతురు పూజ అలియాస్ గుడ్డుయే గీత అని పంజాబ్‌కు చెందిన బధిర దంపతులు పేర్కొనడం తెలిసిందే. కాగా, గీత తమ కూతురే అంటూ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మరో రెండు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. ఈ విషయం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి రావడంతో గీత తల్లిదండ్రులను గుర్తించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుష్మా సూచించారు. ఈ వివరాలను ఆమె శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాము మొత్తం ఏడుగురు సంతానమని, తాము ఒకసారి ఆలయానికి వెళ్లినట్లు తన సంజ్ఞల ద్వారా గీత చెప్పిందని ఆమె అన్నారు. తర్వాత 'వైష్ణోదేవి' అని కూడా రాసినట్లు చెప్పారు. ఈ వివరాలతో గీత ఎవరి కూతురనే విషయాన్ని తెలుసుకుంటామన్నారు. ఆమెను వీలైనంత త్వరగా భారత దేశానికి తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తామని సుష్మాస్వరాజ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా ధమోహన్ గ్రామానికి చెందిన రామ్రాజ్, అనార దేవి దంపతులు.. టీవీల్లో కనిపించిన గీత తమ బిడ్డేనని, వీలైనంత త్వరగా ఆమెను తమ వద్దకు చేర్చాలని శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. అటు జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోనూ ఓ కుటుంబం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి గీత తమ కూతురేనని చెప్పింది. 11 ఏళ్ల క్రితం బీహార్‌లోని చంపారా ఆశ్రమంలో కనిపించకుండా పోయిన తమ బిడ్డ సవితాయే.. గీత అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన దంపతులు చెబుతుండగా, దశాబ్దం కిందట పశువుల్ని మేపేందుకు వెళ్లి తప్పిపోయిన తమ కూతురు కోకియా కుమారినే గీత అని జార్ఖండ్‌కు చెందిన దంపతులు అంటున్నారు. 15 ఏళ్ల కిందట భారత్‌లో తప్పిపోయి పాకిస్థాన్ కు చేరుకున్న గీత.. కరాచీలోని ఓ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతోంది. తిరిగి మాతృదేశం భారత్ కు రావాలనే ఆమె ఆకాంక్ష 'బజరంగీ భాయిజాన్' సినిమా విడుదలైన తర్వాత మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసిన సంగతి విదితమే. Gita in Karachi - During last few days four families from Punjab, Bihar, Jharkhand and UP have claimed Gita as their daughter. — Sushma Swaraj (@SushmaSwaraj) August 8, 2015 I am requesting the Chief Ministers of these states to verify and report. — Sushma Swaraj (@SushmaSwaraj) August 8, 2015 Gita conveyed to Indian High Commissioner by gestures that they are seven brothers and sisters. — Sushma Swaraj (@SushmaSwaraj) August 8, 2015 She also conveyed that she had visited a temple with her father. Then she wrote down "Vaishno Devi". — Sushma Swaraj (@SushmaSwaraj) August 8, 2015 We are completing the necessary formalities to bring Gita back to India. — Sushma Swaraj (@SushmaSwaraj) August 8, 2015 With these details, please help locate Gita's family. — Sushma Swaraj (@SushmaSwaraj) August 8, 2015