'అది అతని కెరీర్ లో నే బెస్ట్ ఫిల్మ్' | 'Bajrangi Bhaijaan' is Salman Khan's best film, Aamir Khan | Sakshi
Sakshi News home page

'అది అతని కెరీర్ లో నే బెస్ట్ ఫిల్మ్'

Published Mon, Jul 20 2015 12:00 PM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

'అది అతని కెరీర్ లో నే బెస్ట్ ఫిల్మ్'

'అది అతని కెరీర్ లో నే బెస్ట్ ఫిల్మ్'

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'బజరంగీ భాయ్ జాన్' పై సహచర నటుడు అమిర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే మంచి చిత్రంగా నిలిచిపోతుందన్నాడు.  బజరంగీ భాయ్ చిత్రంలో సల్మాన్ నటన అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఆ సినిమాలో ఎప్పుడూ చూడని కొత్త సల్మాన్ ను చూశామని అమిర్ పేర్కొన్నాడు.


'బజరంగీ భాయ్ జాన్' నిజంగా అద్భుతంగా ఉంది. ఈ రోజు వరకూ సల్మాన్ బెస్ట్ ఫిల్మ్ అదే. దర్శకుడు కబీర్ ఖాన్ గొప్ప సినిమాను అందించాడు. అతని సినీ జీవితంలో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది ' అని అమిర్  ట్విట్టర్ లో పేర్కొన్నాడు.  శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రెండో రోజుల్లోనే రూ.63.75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement