రంజాన్ పండగకు హీరో సల్మాన్ ఖాన్ సినిమా రిలీజయ్యిందంటే హిట్ గ్యారంటీ. అందుకే ఈ కండలవీరుడు నటించే సినిమాలు ఈ పండుగకే విడుదల కావాలని అభిమానులు కోరుకుంటారు. సల్మాన్‌కి కూడా ఇలా ఈద్ సందర్భంగా సినిమా విడుదల చేయడం ఇష్టమే. మరి... ఈ పండుగకు విడుదలైన ప్రతి సినిమా హిట్టే కాబట్టి, ఆ మాత్రం ఇష్టం ఉండటం కరెక్టే. గతంలో ‘వాంటెడ్’, ‘దబంగ్’, ‘బాడీగార్డ్’, ‘ఏక్ థా టైగర్’, ‘బజరంగీ భాయిజాన్’ చిత్రాలు రంజాన్ కానుకలుగా విడుదలై, బంపర్ హిట్ సాధించాయి. ఈసారి ఈద్‌కి హిస్టరీ రిపీట్ చేసిన చిత్రం - ‘సుల్తాన్’.
Published Thu, Jul 14 2016 7:28 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement