మొన్న బాహుబలి.. నేడు బజరంగి భాయ్జాన్ | 'Bajrangi Bhaijaan' zooms past Rs.100 crore in opening weekend | Sakshi
Sakshi News home page

మొన్న బాహుబలి.. నేడు బజరంగి భాయ్జాన్

Published Mon, Jul 20 2015 3:30 PM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

మొన్న బాహుబలి.. నేడు బజరంగి భాయ్జాన్

మొన్న బాహుబలి.. నేడు బజరంగి భాయ్జాన్

న్యూఢిల్లీ: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం బజరంగి భాయ్జాన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత శుక్రవారం విడుదలయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

శుక్రవారం 27.25 కోట్లు, శనివారం 36.60 కోట్లు, ఆదివారం 38.75 కోట్లు రూపాయల కలెక్షన్లు వచ్చాయి. మూడు రోజుల్లో మొత్తం 102.60 కోట్ల రూపాయలు రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వంతో సల్మాన్, కరీనా కపూర్ తదితరులు నటించిన బజరంగి భాయ్జాన్ హిట్ టాక్తో ప్రదర్శితమవుతోంది. మొన్న బాహుబలి.. నేడు బజరంగి భాయ్జాన్ బ్లాక్బస్టర్స్గా నిలిచాయంటూ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement