rs.100 crores
-
రూ.100 కోట్ల రుణాల లక్ష్యం
– రేపటి నుంచి అందుబాటులో బ్యాంకు సేవలు – విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు అనంతపురం అగ్రికల్చర్ : సామాన్య, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వచ్చే రెండేళ్లలో కనీసం రూ.100 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. ఆదివారం నుంచి జిల్లా ప్రజలకు ‘విశాఖ’ బ్యాంకు సేవలు అందజేస్తామన్నారు. స్థానిక రాజురోడ్డులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ బ్యాంకు 45వ శాఖను ‘అనంత’లో లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రిజర్వ్‌బ్యాంకు నియమ నిబంధనలకు లోబడి సహకార చట్టానికి అనుగుణంగా తమ బ్యాంకు సేవలందచేస్తుందన్నారు. దేశంలోనే మొదటి 20 అర్బన్ బ్యాంకుల జాబితాలో తమ బ్యాంకు స్థానం సంపాదించిందని గుర్తు చేశారు. అన్ని రకాల ఆధునాతన సేవలు, సులభమైన బ్యాంకింగ్ అందజేస్తామన్నారు. ఏ ప్రాంతంలో సేకరించిన డిపాజిట్లు ఆయా ప్రాంత ప్రజలు, ఖాతాదారుల అభ్యున్నతి కోసమే రుణం రూపంలో అందజేస్తామన్నారు. సెలవు రోజైనా ప్రతి ఆదివారం కూడా బ్యాంకు పనిచేస్తుందన్నారు. విశాఖ బ్యాంకు సీఈవో పీవీ నరసింహారావు, గుత్తి కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎస్కే అబ్దుల్ జిలానీ పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలతో రూ. వంద కోట్ల నష్టం
డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు బొల్లాపల్లి: నకిలీ విత్తనాలు అంటగట్టి అన్నదాతలను నట్టేట ముంచిన వారిపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. మండలంలోని పేరూరిపాడు, వెల్లటూరులో పర్యటించి నకిలీ విత్తనాలతో దెబ్బతిన్న రైతులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. గూడూరి ఆదినారాయణ, రామకృష్ణ, శేషగిరి తదితర రైతుల పొలాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిరప పంట కోసం ఆశీర్వాద్, బ్రహ్మాష్, జీవా, మలబార్ కంపెనీల విత్తనాలు కేజీ రూ. 30వేలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసి రైతులు నార్లు పోసుకున్నారని చెప్పారు. అవి నకిలీ విత్తనాలు కావటంతో ఈ ప్రాంతంలో సుమారు వంద కోట్ల రూపాయల మేరకు నష్టం ఏర్పడిందని తెలిపారు. విత్తన అమ్మకాలు, నాణ్యతపై వ్యవసాయాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నకిలీలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ మంత్రి స్పందించి నష్టపోయిన రైతన్నలకు విత్తన కంపెనీల నుంచి గానీ ప్రభుత్వ పరంగానైనా నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా వర్షాభావంతో ఈ ప్రాంతంలో పంటలు పండలేదని పేర్కొన్నారు. అప్పోసప్పో చేసి ఈ ఏడాది మిర్చి మొక్కలు నాటిన రైతులు కల్తీ విత్తనాలతో దారుణంగా మోసపోయారని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని, అన్ని పార్టీల మద్దతుతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని తెలిపారు. -
వంద కోట్ల పారితోషికమా!
భారీ చిత్రాలు కూడా ఈ రోజుల్లో 100 కోట్ల వసూళ్లు సాధించడం కష్టతరంగా మారింది. అలాంటిది ఒక దర్శకుడి పారితోషికం రూ.100 కోట్లు అంటే నమ్మశక్యంగా ఉందా? అయితే నమ్మాల్సిందేనంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అవును అంత పెద్ద మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్ చేసిన దర్శకుడు రాజమౌళి అన్న ప్రచారం ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తోంది. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి అన్న సంగతిని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని తలదన్నే రీతిలో బాహుబలి-2 చిత్రాన్ని తాజాగా చెక్కుతున్నారు జక్కన్న. వెండితెర అద్భుతంగా ఆవిష్కరిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. చిత్ర వ్యాపారం కూడా మొదలైంది. ప్రారంభం అవడమే కాదు ప్రకంపనలు పుట్టిస్తోంది. తమిళనాడు హక్కులు 45 కోట్లకు అమ్మడు పోయినట్లు సమాచారం. అదే విధంగా కేరళ వెర్షన్ హక్కులు 15 కోట్లకు విక్రయించినట్లు సినీ వర్గాల సమాచారం. ఇక ఉత్తరాది హక్కులకు 100 నుంచి 150 కోట్లు వ్యాపారం జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే దర్శకుడు రాజమౌళి తన పారితోషికంగా తమిళ్, మలయాళం, హిందీ భాషల వ్యాపారంలో 50 శాతం డిమాండ్ చేసినట్లు పరిశ్రమ వర్గాల బోగట్టా. దీన్ని బట్టి చూస్తే ఆయన పారితోషికం రూ.100 కోట్లకు చేరుతుందని టాక్. ఇదే కనుక నిజం అయితే వంద కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఏకైక భారతీయ సినీ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళీనే అవుతారు. -
భద్రాచలం అభివృద్ధికి రూ.100కోట్లు
భద్రాచలం(ఖమ్మం): భద్రాచలం పట్టణం, రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆయన శుక్రవారం ప్రభుత్వం తరఫున భద్రాచల రాముల వారి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణం అనంతరం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో రెండు సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో జిల్లాలోని ప్రతి అంగుళం భూమికి నీటి వసతి ఉండేలా చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
బాబు గెస్ట్‌హౌస్ ఖర్చు రూ.వంద కోట్లు
* పనులన్నీ నామినేషన్ విధానంలోనే.. సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసుకోనున్న అతిథిగృహ ఖర్చుకు రూ.వంద కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పా టు చేసుకున్న సీఎం... రాజధాని ప్రాంతంలోనూ ఓ అతిథిగృహం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు గాను సంబంధిత పనులన్నీ నామినేషన్ విధానంపై చేపట్టేందుకు నిర్ణయించడం ఆరోపణలకు తావిస్తోంది. లింగమనేని గెస్ట్‌హౌసే అతిథిగృహం కరకట్టను ఆనుకుని రివర్‌బెడ్‌లో ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను సీఎం అతిథిగృహంగా మార్చనున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మంగళవారం లింగమనేని గెస్ట్‌హౌస్‌ను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ గెస్ట్‌హౌస్‌కు వెళ్లేందుకు రోడ్లకే అధికారులు రూ.60 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. నాలుగు రోడ్లను జలవనరుల శాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలు చేపట్టనున్నాయి. గెస్ట్‌హౌస్ వద్ద విద్యుత్తు సబ్‌స్టేషన్‌కు రూ.5 కోట్లు, సెల్టవర్ల నిర్మాణానికి రూ.కోటిన్నర, సీఎం భద్రత కోసం కృష్ణానదిలో బోట్లలో భద్రత పర్యవేక్షణకు రూ.10 కోట్లు, పోలీస్ ఔట్‌పోస్టుల నిర్మాణానికి రూ.కోటి, విద్యుత్తు లైన్లకు రూ.5 కోట్లు, గెస్ట్‌హౌస్ ఆధునీకీకరణకు సుమారు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు రూపొందిం చారు. మొత్తం రూ.వంద కోట్లకు పైగానే గెస్ట్‌హౌస్ పనులు చేపట్టనున్నారు. నామినేషన్ విధానంలో కేటాయిస్తున్నారు. -
మొన్న బాహుబలి.. నేడు బజరంగి భాయ్‌జాన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం బజరంగి భాయ్‌జాన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత శుక్రవారం విడుదలయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. శుక్రవారం 27.25 కోట్లు, శనివారం 36.60 కోట్లు, ఆదివారం 38.75 కోట్లు రూపాయల కలెక్షన్లు వచ్చాయి. మూడు రోజుల్లో మొత్తం 102.60 కోట్ల రూపాయలు రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వంతో సల్మాన్, కరీనా కపూర్ తదితరులు నటించిన బజరంగి భాయ్‌జాన్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. మొన్న బాహుబలి.. నేడు బజరంగి భాయ్‌జాన్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయంటూ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. -
'నా వ్యాఖ్యలు వక్రీకరించారు'
తిరుపతి : శేషాచలం ఎన్కౌంటర్ నేపథ్యంలో అంతం కాదు ఇది అరంభం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. శేషాచలం ఎన్కౌంటర్లో మృతదేహల వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సదరు సెల్ ఫోన్ నెంబర్లు ఆధారంగా నిందితులను సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో అడవులను సంరక్షించేందుకు రూ. 100 కోట్లు కేటాయిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు. -
అంగన్వాడీ భవనాలకు రూ.100 కోట్లు
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: రీజియన్ పరిధిలో నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లు అందుబాటులో ఉన్నాయని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం ఆమె తాండూరు పట్టణంలోని ‘శిశుగృహ’ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీజినల్ పరిధిలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో 1,539 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4.5లక్షల చొప్పున రూ. 69.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ.రెండు లక్షల చొప్పున మొత్తం రూ.30.78 కోట్లను మంజూరు చేసిందన్నారు. రీజినల్ పరిధిలో 10 ఏళ్ల సర్వీసు, ఇతర అర్హతలు ఉన్న 161 మంది అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్లుగా పదోన్నతి కల్పించామన్నారు. అంగన్వాడీల వేతనాల పెంపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందన్నారు. ఇందిరమ్మ, అమృతహస్తం, బాలామృ తం పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఖాళీగా ఉన్న 400అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. తాండూరు పరిధిలో ఖాళీగా ఉన్న మూడు సూపర్వైజర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం శిశుగృహలోని చిన్నారుల వివ రాలను, వారి ఆరోగ్య పరిస్థితులను నిర్వాహకురాలు సునీతను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటలక్ష్మి ఉన్నారు.