'నా వ్యాఖ్యలు వక్రీకరించారు' | Rs.100 crores allotment to AP forests, says bojjala gopalakrishna reddy | Sakshi
Sakshi News home page

'నా వ్యాఖ్యలు వక్రీకరించారు'

Published Sun, Apr 19 2015 2:26 PM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

'నా వ్యాఖ్యలు వక్రీకరించారు' - Sakshi

'నా వ్యాఖ్యలు వక్రీకరించారు'

తిరుపతి : శేషాచలం ఎన్కౌంటర్ నేపథ్యంలో అంతం కాదు ఇది అరంభం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. శేషాచలం ఎన్కౌంటర్లో మృతదేహల వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సదరు సెల్ ఫోన్ నెంబర్లు ఆధారంగా నిందితులను సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో అడవులను సంరక్షించేందుకు రూ. 100 కోట్లు కేటాయిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement