
టీడీపీలో విస్తరణ చిచ్చు.. ఎమ్మెల్యే రాజీనామా
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి వర్గ విస్తరణ అధికార టీడీపీలో చిచ్చు రాజేసింది. మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు ఆయన రాజీనామా లేఖ పంపారు. బొజ్జల ప్రాపర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖ పంపారు.
మంత్రి పదవి నుంచి బొజ్జలను తొలగించడంతో ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. బొజ్జల నియోజకవర్గం శ్రీకాళహస్తిలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పార్టీని నమ్ముకుంటే బొజ్జలపై వేటు వేస్తారా అని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీటీసీ అనసూయమ్మ, ఎంపీపీ పోలమ్మ రాజీనామా చేశారు.
చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడంపై టీడీపీ నేతలు భగ్గముంటున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాని సీనియర్లు మండిపడుతున్నారు. గౌతు శివాజీకి మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన కూతురు శిరీష.. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.