దీక్షా శిబిరంలో పార్టీ నేతలు బీవై రామయ్య, హఫీజ్‌ఖాన్, కంగాటిశ్రీదేవి తదితరులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతుంటే సహకరించాల్సిన టీడీపీ ప్రభుత్వం పూటకో నాటకం ఆడుతుందని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్ ధ్వజమెత్తారు. పార్టీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షలకు మద్దతుగా కర్నూలులో నాలుగో రోజు రిలే దీక్షలు కొనసాగాయి. వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు మంగమ్మ, శౌరీ విజయకుమారి ఆధ్వర్యంలో రాధిక, పద్మ, రామేశ్వరి, చెన్నమ్మ, పక్కీరమ్మ, మదాక్క, ఆష్రాఫ్‌బీ, ఫాతిమా, యంకమ్మ, పద్మావతి, విజయలక్ష్మి, మౌనిక, రంగమ్మ, జయలక్ష్మి, పార్వతీబాయి, లతాబాయి, అంజలిబాయి, ఎంకుబాయ్, భార్గవి, కావేరి, శేషమ్మ, బాలమ్మ, పద్మ, ప్రమీళ, గౌసియాబీ, యాస్మిన్, ముబీనా, సుల్తాన్‌బీ తదితరులు దీక్షలో కూర్చున్నారు. వీరికి వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కర్నూలు సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్, పత్తికొండ నియోజకవర్గ సమన్వయ కర్త శ్రీదేవి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ..ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు దొంగనాటకాలు విడిచిపెట్టి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతోపాటు రాజీనామా చేసి పోరాడాలని కోరారు. పత్తికొండ ఇన్‌చార్జ్ కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్యాకేజీకి ఒప్పుకుని రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీల నాటకాలను ప్రజలు నమ్మరన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. హోదా విషయంలో టీడీపీ రోజుకో టర్న్ తీసుకుంటోందని విమర్శించారు. కేంద్రం మెడలు వంచి హోదా తీసుకోరాగల శక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని చెప్పారు.
రిలే నిరాహార దీక్షలకు ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రఫీ, ఎస్‌డీపీఐ నాయకుడు జహంగీర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీహెచ్ మద్దయ్య, మైనార్టీ నాయకులు రహమాన్, జిల్లా నాయకులు ఆదిమోహన్‌రెడ్డి, సాంబాశివారెడ్డి, సంజు, బుజ్జీ, రాఘవేంద్రారెడ్డి, కరుణాకరరెడ్డి, జాన్, డీకే రాజశేఖర్, మల్లి, కొనేటి వెంకటేశ్వర్లు, రాజేష్, సఫీయా ఖాతూన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment