speacial status
-
హోదాపై బాబు జిమ్మిక్లు చేస్తున్నారు: భూమన
సాక్షి, శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ధర్మపోరాట ధీక్ష పేరుతో కొంగ జపంచేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే ముద్దు అని అసెంబ్లీలో తీర్మానాలు చేసిన బాబు ఇప్పుడు మాత్రం దొంగ ధీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం రామానమజపం అయిందని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ కనిప్పించడం లేదని విమర్శించారు. టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. తన నాలుగున్నర లక్షల కోట్ల దోపిడిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్వేతపత్రం మరో అబద్దపు ప్రచార జిమ్మక్‌గా మార్చుకున్నారని భూమన వ్యాఖ్యానించారు. -
టీడీపీది పూటకో నాటకం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతుంటే సహకరించాల్సిన టీడీపీ ప్రభుత్వం పూటకో నాటకం ఆడుతుందని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్ ధ్వజమెత్తారు. పార్టీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షలకు మద్దతుగా కర్నూలులో నాలుగో రోజు రిలే దీక్షలు కొనసాగాయి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు మంగమ్మ, శౌరీ విజయకుమారి ఆధ్వర్యంలో రాధిక, పద్మ, రామేశ్వరి, చెన్నమ్మ, పక్కీరమ్మ, మదాక్క, ఆష్రాఫ్బీ, ఫాతిమా, యంకమ్మ, పద్మావతి, విజయలక్ష్మి, మౌనిక, రంగమ్మ, జయలక్ష్మి, పార్వతీబాయి, లతాబాయి, అంజలిబాయి, ఎంకుబాయ్, భార్గవి, కావేరి, శేషమ్మ, బాలమ్మ, పద్మ, ప్రమీళ, గౌసియాబీ, యాస్మిన్, ముబీనా, సుల్తాన్‌బీ తదితరులు దీక్షలో కూర్చున్నారు. వీరికి వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కర్నూలు సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్, పత్తికొండ నియోజకవర్గ సమన్వయ కర్త శ్రీదేవి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ..ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు దొంగనాటకాలు విడిచిపెట్టి వైఎస్ఆర్సీపీ ఎంపీలతోపాటు రాజీనామా చేసి పోరాడాలని కోరారు. పత్తికొండ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్యాకేజీకి ఒప్పుకుని రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీల నాటకాలను ప్రజలు నమ్మరన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. హోదా విషయంలో టీడీపీ రోజుకో టర్న్ తీసుకుంటోందని విమర్శించారు. కేంద్రం మెడలు వంచి హోదా తీసుకోరాగల శక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని చెప్పారు. రిలే నిరాహార దీక్షలకు ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రఫీ, ఎస్డీపీఐ నాయకుడు జహంగీర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీహెచ్ మద్దయ్య, మైనార్టీ నాయకులు రహమాన్, జిల్లా నాయకులు ఆదిమోహన్‌రెడ్డి, సాంబాశివారెడ్డి, సంజు, బుజ్జీ, రాఘవేంద్రారెడ్డి, కరుణాకరరెడ్డి, జాన్, డీకే రాజశేఖర్, మల్లి, కొనేటి వెంకటేశ్వర్లు, రాజేష్, సఫీయా ఖాతూన్ తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబుకు కమీషన్లు వస్తే చాలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్ సాధించుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల కాదని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదని,ఆ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైందని ఆయన అన్నారు. బుధవారమిక్కడ ఇందిరాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కావలసింది కమీషన్లని, అందుకోసమే ఆయన ప్రత్యేక హోదా అడగకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతున్నారని శైలజానాధ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర ప్రజల హక్కు. వారి ప్రాణం. నిరుద్యోగ సమస్య పరిష్కారనికి అదొక్కటే మార్గం. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం కమీషన్ల కక్కుర్తి కోసం చంద్రబాబు రాజీ పడ్డారని ఘాటుగా విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి నష్టం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ వైఖరులకు వ్యతిరేకిస్తూ గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేబడుతున్నట్టు ఆయన చెప్పారు. అన్ని జిల్లాల కేంద్రాల్లోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన మౌన దీక్షలను చేపడుతున్నట్టు ప్రకటించారు. -
‘ప్రత్యేక ప్యాకేజీతో ఏం ఒరగదు’
కావలి : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న ప్రత్యేక ప్యాకేజీ ఏం ఒరగదని, ఇది ప్రజలను మోసం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.చెంచలబాబు యాదవ్ అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాన్ వల్ల జరిగిన నష్టానికి రూ.1500 కోట్లు ఇస్తామన్న కేంద్రం రూ.650 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొందని గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రులను మోసం చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు దానిని స్వాగతించడం దారుణమన్నారు. హాదా వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయన్నారు. ఈ నెల 28వ తేదీన తిరుపతిలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు శివశేఖర్ రెడ్డి, అనుమాలశెట్టి వాసు, ఇంటూరి శ్రీహరి పాల్గొన్నారు.