కేసీఆర్, హరీశ్లకు మతిభ్రమించింది | Bojjala Gopalakrishna Reddy takes on Telangana CM KCR and harish rao | Sakshi
Sakshi News home page

కేసీఆర్, హరీశ్లకు మతిభ్రమించింది

Published Thu, Nov 13 2014 3:54 PM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

కేసీఆర్, హరీశ్లకు మతిభ్రమించింది - Sakshi

కేసీఆర్, హరీశ్లకు మతిభ్రమించింది

చిత్తూరు: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు, మంత్రి హరీష్రావులపై ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం చిత్తూరులో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.... కేసీఆర్, హరీశ్రావులకు మతిభ్రమించిందని ఆయన ఆరోపించారు. అందుకే తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం, మంత్రులుగా పదవుల్లో ఉన్న వారిద్దరు పద్దతి లేకుండా మాట్లాడటం భావ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఏదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబే ప్రధాన కారకుడని సీఎం కేసీఆర్, హరీశ్రావులు అసెంబ్లీ సమావేశాలలో ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు చంద్రబాబే కారణమంటే ఏట్లా అని ఏపీ మంత్రులు ఇప్పటికే సీఎం కేసీఆర్,  ఆయన మంత్రి వర్గాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement