బాహుబలి బాటలో బజరంగి భాయ్జాన్ | Bajrangi Bhaijaan Nets Rs 500 Crore | Sakshi
Sakshi News home page

బాహుబలి బాటలో బజరంగి భాయ్జాన్

Published Fri, Aug 7 2015 6:23 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

బాహుబలి బాటలో బజరంగి భాయ్జాన్

బాహుబలి బాటలో బజరంగి భాయ్జాన్

ముంబై: బాలీవుడ్ చిత్రం బజరంగి భాయ్జాన్ బాక్సాఫీసు వద్ద బాహుబలి దారిలో పయనిస్తోంది. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నటించిన బజరంగి భాయ్జాన్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి ఇప్పటికే 500 కోట్ల మార్క్ దాటిన సంగతి తెలిసిందే.

గత నెల 17న విడుదలైన బజరంగి భాయ్జాన్ భారత్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు ఎరోస్ సంస్థ తెలిపింది. 2015లో బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఇదే. విదేశాల్లోనూ ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. యూఏఈ, ఇంగ్లండ్లలో రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. 90 కోట్ల రూపాయల వ్యయంతో బజరంగి భాయ్జాన్ను నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement