Rs 500 Crore
-
ఎయిర్ ఇండియా కీలక ఆస్తులు అమ్మకానికి
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి మోనటైజేషన్ పధకంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక గృహ మరియు వాణిజ్య భూములు సహా కార్యాలయ భవనాలను విక్రయించనుంది. వీటితోపాటు ముఖ్యంగా ముంబైలోని పాటు 27 ఫ్లాట్ల ను ఎయిర్ ఇండియా లిమిటెడ్ అమ్మకానికి పెట్టింది. తద్వారా రూ.500 కోట్లను రాబట్టాలని యోచిస్తోంది. సెప్టెంబరు 6 న బిడ్ ముగింపు తేదీగా నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ వేలం సంస్థ ఎంఎస్టీసీ ఈ ఆస్తుల ఇ-ఆక్షన్‌కు ఆదేశించింది. ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, తిరువనంతపురం, అహ్మదాబాద్, పూణే, గోవా, లక్నో, గ్వాలియర్, గుర్గావ్, భుజ్‌లోని భుజ్ స్థిరాస్తులను అమ్మకం కోసం బిడ్లను కోరినట్టు సీనియర్ వైమానిక అధికారి ఒకరు వెల్లడించారు. సెప్టెంబరులో ఈ సంస్థల అమ్మకం నుంచి కనీసం 500 కోట్ల రూపాయల నగదు కొనుగోలు చేయాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. 2012 పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా 2021నాటికి ఎయిరిండియాకు రూ.30,231 కోట్ల నిధుల సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ఆస్తుల విక్రయం, అద్దెల ద్వారా రూ.5,000 కోట్ల వరకు ఎయిర్ ఇండియా సమీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముంబయిలో నాలుగు ఫ్లాట్ల అమ్మకం ద్వారా ఇప్పటివరకు కేవలం రూ.90 కోట్లు మాత్రమే సమీకరించింది. కాగా మరోవైపు జాతీయ క్యారియర్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఎయిర్ఇండియాలో వాటాల ఉపసంహరణకు క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందం ఈమేరకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఎయిరిండియా ఆస్తుల విక్రయం షురూ!
♦ వివిధ నగరాల్లోని ఫ్లాట్లు, స్థలాలు, భవంతులకు ఈ–వేలం ♦ బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ వచ్చేనెల 6 ♦ రూ.500 కోట్లు లభిస్తాయని అంచనా ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా... దేశవ్యాప్తంగా తనకున్న ఆస్తుల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఎయిరిండియాకు దేశమంతటా విపరీతమైన ఆస్తులున్న నేపథ్యంలో... వాటిని విక్రయించి సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఆ తరువాత ఆస్తులు మినహా ఎయిరిం డియా విమానాలను, బ్రాండ్‌ను, కార్యకలాపాలను ఏదో ఒక కంపెనీకి విక్రయించే అవకాశమున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగానే ఆస్తుల విక్రయం మొదలైనట్లు భావిస్తున్నారు. సంస్థకు పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, తిరువనంతపురం, గోవా, లక్నో, గ్వాలియర్, గుర్గావ్, భుజ్ ప్రాంతాల్లో ఉన్న 27 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్లాట్లు, స్థలాలు, ఆఫీసు భవంతులను తాజాగా అమ్మకానికి పెట్టారు. ఈ విక్రయం ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమకూరుతాయని సంస్థ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఈ ఆస్తులకు ఈ–వేలం నిర్వహించనుండగా... బిడ్ల దాఖలుకు చివరి తేదీని సెప్టెంబర్ 6గా నిర్ణయించారు. కంపెనీని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణ ప్రక్రియకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రస్తుతం ఆర్థిక మంత్రి జైట్లీ సారథ్యంలోని మంత్రుల బృందం కసరత్తు చేస్తోంది. 2017 మార్చి ఆఖరుకి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ.48,879 కోట్లు. గతేడాది కంపెనీ నికర నష్టం రూ. 3,643 కోట్లకు తగ్గగా.. నిర్వహణ లాభం రూ. 300 కోట్లుగా నమోదైంది. మరో కింగ్ఫిషర్లా కానివ్వం: మంత్రి అశోక్ ఎయిరిండియాను మరో కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్లా మారనివ్వబోమని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు స్పష్టం చేశారు. ఉద్యోగులను ఇంటికి పంపాలని తాము కోరుకోవడం లేదన్నారు. -
భారీ జరిమానాతో కుదేలైన షేర్లు
ముంబై: ఢిల్లీ సర్కార్ విధించిన భారీ జరిమానా నేపథ్యంలో ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అతి తక్కువ ధరలకే వైద్య సేవలు అందించడం లేదని ఆరోపిస్తూ ఫోర్టిస్ హెల్త్ కేర్ అనుబంధ సంస్థ పై 503 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించడంతో సోమవారం నాటి స్టాక్ మార్కెట్ లో నష్టాలను మూటగట్టుకుంది. ఈ మొత్తం సొమ్మును డిపాజిట్ చేయాలని హెల్త్ సర్వీసెస్ డైరెక్టరేట్ జనరల్ (డీహెచ్ ఎస్) ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు 5 శాతం నష్టాలను చవిచూసింది. భూ కేటాయింపుల సందర్భంగా చేసుకున్న లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఫోర్టిస్ ఆసుపత్రిపై ఆప్ సర్కార్ కన్నెర్ర చేసింది. 1984-07 సంవత్సరాలకు సంబంధించిన ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్సిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆర్జించిన అసహజ లాభాల్లో 503 కోట్ల రూపాయలను జమ చేయాలని డీహెచ్ఎస్ ఆదేశించింది. దీంతో బీఎస్ఈ ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు భారీగా నష్టపోయాయి. ముగింపులో కోలుకొని రూ 165 దగ్గర నిలదొక్కుకుంది. అయితే ఈ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు ఫోర్టిస్ ప్రతినిధులు తెలిపారు. కాగా ఆర్థికంగా బలహీనమైన సెక్షన్ల రోగులకు సబ్సీడిపై చికిత్సను అందించడంలో విఫలమైనందుకు పలు ప్రయివేటు ఆసుపత్రులపై ఢిల్లీ సర్కార్ కొరడా ఝళిపించింది. పేదలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించాలన్న నిబంధనకు అంగీకరించి, తక్కువ ధరలకు విలువైన స్థలాలను పొంది, అనంతరం ఆ నిబంధనను తుంగలో తొక్కిన నగరంలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్, మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకంద్ హాస్పిటల్, ధర్మషీలా క్యాన్సర్ హాస్పిటల్, పుష్పవతి సింఘానియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లపై రూ.600 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
బాహుబలి బాటలో బజరంగి భాయ్‌జాన్
ముంబై: బాలీవుడ్ చిత్రం బజరంగి భాయ్‌జాన్ బాక్సాఫీసు వద్ద బాహుబలి దారిలో పయనిస్తోంది. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నటించిన బజరంగి భాయ్‌జాన్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి ఇప్పటికే 500 కోట్ల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. గత నెల 17న విడుదలైన బజరంగి భాయ్‌జాన్ భారత్‌లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు ఎరోస్ సంస్థ తెలిపింది. 2015లో బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఇదే. విదేశాల్లోనూ ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. యూఏఈ, ఇంగ్లండ్‌లలో రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. 90 కోట్ల రూపాయల వ్యయంతో బజరంగి భాయ్‌జాన్‌ను నిర్మించారు.