ఎయిర్‌ ఇండియా కీలక ఆస్తులు అమ్మకానికి | Air India Puts Key Properties Up For Sale, Aims To Net At Least Rs 500 Crore | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియా కీలక ఆస్తులు అమ్మకానికి

Published Fri, Aug 25 2017 7:05 PM | Last Updated on Sun, Sep 17 2017 5:58 PM

ఎయిర్‌ ఇండియా కీలక  ఆస్తులు  అమ్మకానికి

ఎయిర్‌ ఇండియా కీలక ఆస్తులు అమ్మకానికి

సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల  సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమాన యాన సంస్థ ఎయిర్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఆస్తి మోనటైజేషన్ పధకంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక గృహ మరియు వాణిజ్య భూములు సహా కార్యాలయ భవనాలను విక్రయించనుంది. వీటితోపాటు ముఖ‍్యంగా ముంబైలోని పాటు 27 ఫ్లాట్ల ను ఎయిర్ ఇండియా లిమిటెడ్ అమ్మకానికి  పెట్టింది. తద్వారా రూ.500 కోట్లను రాబట్టాలని యోచిస్తోంది. సెప్టెంబరు 6 న బిడ్ ముగింపు తేదీగా నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ వేలం సంస్థ ఎంఎస్‌టీసీ  ఈ ఆస్తుల ఇ-ఆక్షన్‌కు ఆదేశించింది.

ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, తిరువనంతపురం, అహ్మదాబాద్, పూణే, గోవా, లక్నో, గ్వాలియర్, గుర్గావ్, భుజ్‌లోని  భుజ్‌  స్థిరాస్తులను  అమ్మకం కోసం బిడ్లను కోరినట్టు సీనియర్ వైమానిక అధికారి ఒకరు  వెల్లడించారు. సెప్టెంబరులో ఈ సంస్థల అమ్మకం నుంచి కనీసం 500 కోట్ల రూపాయల నగదు కొనుగోలు చేయాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది.

2012 పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా 2021నాటికి ఎయిరిండియాకు రూ.30,231 కోట్ల నిధుల సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ఆస్తుల విక్రయం, అద్దెల ద్వారా రూ.5,000 కోట్ల వరకు ఎయిర్‌ ఇండియా సమీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో  ముంబయిలో నాలుగు ఫ్లాట్ల అమ్మకం ద్వారా ఇప్పటివరకు కేవలం రూ.90 కోట్లు మాత్రమే సమీకరించింది.

కాగా  మరోవైపు జాతీయ క్యారియర్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఎయిర్‌ఇండియాలో వాటాల ఉపసంహరణకు క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందం ఈమేరకు కసరత్తు చేస్తున్న సంగతి   తెలిసిందే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement