మూడో డాన్‌లో ఆయనతో రెండో సారి? | kathrina kaif in don 3 | Sakshi
Sakshi News home page

మూడో డాన్‌లో ఆయనతో రెండో సారి?

Published Sun, Jan 10 2016 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

మూడో డాన్‌లో ఆయనతో రెండో సారి?

మూడో డాన్‌లో ఆయనతో రెండో సారి?

అమితాబ్‌బచ్చన్ నటించిన ‘డాన్’ చిత్రం రీమేక్‌లో నటించి, మళ్లీ కొత్త డాన్‌లా అవతరించారు బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్. ‘డాన్-2’లో కూడా నటించి, భేష్ అనిపించుకున్నారు. త్వరలో ‘డాన్ 3’ మొదలు కానుంది. తొలి, మలి భాగాల్లో నటించిన ప్రియాంకా చోప్రాకు మూడో భాగంలో చోటు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే, కత్రినా కైఫ్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట షారుక్. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కూడా అదే అభిప్రాయంతోనే ఉన్నారట. ఇటీవలఈ చిత్రం గురించి కత్రినా కైఫ్‌ని సంప్రతించారట కూడా. ‘జబ్ తక్ ఏ జాన్’ చిత్రంలో షారుక్ కు జోడీగా నటించారు కత్రిన. ఇప్పుడు ‘డాన్ 3’లో ఆయనతో జోడీ కడుతున్నారా? లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement