చిన్నారి డాన్‌ను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
కొండపి(సింగరాయకొండ): ‘డాన్ తప్పిపోవడమేంటని అనుకుంటున్నారా..?’ ఈ డాన్ మీరనుకుంటున్న డాన్ కాదు.. ఐదేళ్ల వయసున్న డాన్ అనే బాలుడు గురువారం సాయంత్రం కొండపి మండల కేంద్రంలో తప్పిపోయాడు. సెంటర్లో ఒంటరిగా దిక్కులు చూస్తున్న బాలుడిని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి చేరదీశారు. ఇల్లు, తలిదండ్రుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలుడు చెప్పిన విధంగా కొండపి ఊరంతా తిప్పారు. ఫలితం లేకపోవడంతో ఆ బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
మహిళా కానిస్టేబుల్ భూదేవి బాలుడికి సపర్యలు చేసింది. ఇదిలా ఉండగా బాలుడు పోలీస్ స్టేషన్‌లో క్షేమంగా ఉన్నాడని తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. బాలుడి తల్లిదండ్రులు మరియమ్మ, రవి శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కుమారుడిని అక్కున చేర్చుకున్నారు. తమది పొదిలి మండల బుచ్చన్నపాలెం గ్రామమని, కొండపిలో సరుకులు కొనే క్రమంలో డాన్ తప్పిపోయాడని పోలీసులకు రవి వివరించాడు. కుమారుడిని సురక్షితంగా అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment