
ముంబై: వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్న మెంట్‌లో పాల్గొనే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. వార్న్ సారథ్యంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు 2008లో ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.
2011 వరకు రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను ఆ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గత సీజన్‌లో రాయల్స్ జట్టుకు వార్న్ మెంటార్‌గా ఉన్నాడు. మరోవైపు ఈ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇన్నాళ్లు బ్లూ జెర్సీలతో ఆడిన రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో పింక్ జెర్సీలు ధరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment