మీరే బ్రాండ్ అంబాసిడర్లు.. | tennis star sania mirza is telangana ambassador | Sakshi
Sakshi News home page

మీరే బ్రాండ్ అంబాసిడర్లు..

Published Mon, Nov 3 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

మీరే బ్రాండ్ అంబాసిడర్లు..

మీరే బ్రాండ్ అంబాసిడర్లు..

టెన్నిస్ కోర్టులో రాకెట్‌తో అదరగొట్టే సానియా మీర్జా.. రెయిన్‌బో హోం చిన్నారులతో సందడి చేశారు. ‘మేక్ ఎ డిఫరెన్స్’ 8వ వార్షికోత్సవం సందర్భంగా ముషీరాబాద్‌లోని అమన్ రెయిన్‌బో హోంలో ఆదివారం పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. వారు అందించి బతుకమ్మను ఎత్తుకుని పిల్లల్లో ఒకరయ్యారు. అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. దేశానికి మీలాంటి పిల్లలే బ్రాండ్ అంబాసిడర్లని చిన్నారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా అన్నధార బ్రోచర్‌ను రెయిన్‌బో హోం సీఈవో అనూరాధలతో కలసి ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను సానియా ఆసక్తిగా తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement