లక్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్లు సమంత, సిద్ధార్థ | Siddharth and Samantha: the new brand ambassadors for Lux | Sakshi
Sakshi News home page

లక్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్లు సమంత, సిద్ధార్థ

Published Fri, Nov 29 2013 12:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

లక్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్లు సమంత, సిద్ధార్థ - Sakshi

లక్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్లు సమంత, సిద్ధార్థ

హైదరాబాద్: సినీతారల సబ్బుగా ప్రసిద్ధి చెందిన లక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ప్రముఖ సినిమా నటీనటులు, సమంత రుత్ ప్రభు, సిద్ధార్థ సూర్యనారాయణ్ వ్యవహరించనున్నారు. వీరిద్దరిపై బ్యాంకాక్‌లో  చిత్రీకరించిన కొత్త టీవీ కమర్షియల్‌ను వచ్చే నెల 1 నుంచి ప్రసారం చేస్తామని లక్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ టీవీసీని ప్రముఖ స్విట్జర్లాండ్ దర్శకుడు ఐవో వెజ్‌గార్డ్ దర్శకత్వంలో రూపొందిం చామని పేర్కొంది. ఘర్షణ చిత్రంలోని నిన్నే నిన్నే పాటను ఈ టీవీసీలో రిమిక్స్ చేశామని తెలిపింది. లక్స్ స్టార్ కావాలని తాను ఎప్పుడూ కలలు కంటూ ఉండేదాన్నని ఈ సందర్భంగా సమంత పేర్కొన్నారు. లక్స్ పేరు వినగానే సౌందర్యం, విలాసం, విశ్వాసం మదిలో మెదులుతాయని వివరించారు. లక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement