జూబ్లీహిల్స్: వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా యంత్రాలు అందించడం అభినందనీయమని సినీ నటి సమంత అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఫోనాక్–ఓం (హియరింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిలెడ్) సంయుక్త ఆధ్వర్యంలో వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు శుక్రవారం ఉచితంగా యంత్రాలు అందజేశారు. సమంత ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఓం సంస్థ ఎండీ ఎస్.రాజా, ఫోనాక్ సంస్థ ప్రతినిధి స్నేహా మాయేకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment