చల్లచల్లని... హైదరాబాద్ | cool cool hyderabad | Sakshi
Sakshi News home page

చల్లచల్లని... హైదరాబాద్

Mar 2 2014 11:37 PM | Updated on Sep 4 2018 5:07 PM

చల్లచల్లని...  హైదరాబాద్ - Sakshi

చల్లచల్లని... హైదరాబాద్

మెల్ల మెల్లగా ఎండలు ముదురుతున్నాయి. దీనికి తోడు సెట్స్‌లో ఆర్క్ లైట్ల మధ్య డాన్సులు. నిజంగా చిరాకైన విషయమే కదా. కానీ హీరోహీరోయిన్లకు, యూనిట్ సభ్యులకు తప్పదు. పైగా హీరోయిన్లయితే... సుకుమారంగా ఉంటారు.

 మెల్ల మెల్లగా ఎండలు ముదురుతున్నాయి. దీనికి తోడు సెట్స్‌లో ఆర్క్ లైట్ల మధ్య డాన్సులు. నిజంగా చిరాకైన విషయమే కదా. కానీ హీరోహీరోయిన్లకు, యూనిట్ సభ్యులకు తప్పదు. పైగా హీరోయిన్లయితే... సుకుమారంగా ఉంటారు.

పక్కనున్న హీరో సరైన డాన్సరైతే... అతని స్పీడ్‌ని అందుకోవడానికి పాపం వాళ్లు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. నిన్న(ఆదివారం) సమంత పరిస్థితి అదే. బయట ఎండ భగభగ మండుతుంటే... లోపల ఎన్టీఆర్‌తో డాన్సులు. ఇక చెప్పేదేముంది? తారక్‌తో డాన్సంటే సాధారణమైన విషయమా!  క్లిష్టమైన స్టెప్పులు కావడంతో పాపం సమంత ఒళ్లు పులిసిపోయిందట.

పైగా చర్మంపై లైట్‌గా గాట్లు కూడా ఏర్పడ్డాయట. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలోని ఓ భారీ సెట్‌లో ‘రభస’(వర్కింగ్ టైటిల్)కు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించారు. ఈ షూటింగ్‌లో సమంతకు ఎదురైన అనుభవాలివి. అయితే.. ఈ కష్టాల మధ్య ఆమెకు కాస్త విరామం దొరికింది. ఇక సెట్‌లో ఉండలేక బయటకొచ్చారు. అంతే.. ఒక్కసారిగా వాతావరణాన్ని చూసి సమంత షాక్. కారణం... అప్పటిదాకా ఎండతో హీటెక్కిపోయిన భాగ్యనగరం... తొలకరి జల్లులతో పులకించిపోతూ కనిపించిందామెకు. అంతే... ఇదిగో ఇలా గొడుగు తీసుకొని ఆ వాతావారణాన్ని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు సమంత. ఆ సమయంలో ఓ ఫొటో దిగి, దాంతో పాటు తన ఆనందాన్ని ట్విట్టర్‌లో పొందుపరిచారామె. ‘‘పాట చిత్రీకరణ చివరి రోజు ఇది.

ఒళ్లు నెప్పులు చేసుకొచ్చాయి. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. కానీ.... నా కోరిక నెరవేరదు. వెంటనే మరో షూటింగ్‌లో పాల్గొనాలి. ఇప్పుడే స్టూడియో నుంచి బయటకొచ్చా. వాతావరణం అద్భుతంగా ఉంది. హైదరాబాద్ చాలా అందంగా కనిపిస్తుంది. చల్లచల్లగా ఆహ్లాదంగా’’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement