Hearing problems
-
'శబ్దమే శాపం' ఆమెకు! అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి..
కొన్ని వ్యాధులు ఓ పట్టాన అర్థం కావు. ఎందుకొస్తాయో కూడా తెలియదు. అవి మొత్తం కుటుంబాన్నే అతలాకుతలం చేసేస్తాయి. ఆ వ్యాధులకు చికిత్స లేకపోవడంతో ఇంటిల్లపాది పడే యాతన అంతా ఇంతకాదు. ఇటు బాధితులకి, వారి కుటుంబానికి ఓ ప్రత్యక్ష నరకం లాంటిది ఆ సమస్య అని చెప్పొచ్చు. ఇక్కడొక మహిళ ఎంత దయనీయమైన వ్యాధితో బాధపడుతుందో వింటే కంగుతింటారు. ఇదేం వ్యాధిని రా బాబు! అని నోరెళ్లబెడతారు. ఏం జరిగిందంటే..బ్రిటన్‌కి చెందిన 49 ఏళ్ల కరెన్ కుక్ 'హైపరాక్యుసిస్' అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా చిన్న శబ్ధాన్ని కూడా భరించలేదు. ఎంతలా అంటే గాలి వీచినా..చెట్ల ఆకుల శబ్దం వరకు ఏ చిన్న శబ్దం విన్నా.. తట్టుకోలేక అల్లాడిపోతుంది. ఈ వ్యాధి కారణంగా భర్త, పిల్లలకు దూరంగా ఒంటరిగా బతుకుతోంది. చెప్పాలంటే తన ఇంట్లోనే ఆమె ఓ ఖైదీలా జైలు శిక్ష అనుభవించేలా చేసింది ఆ వ్యాధి. ఎందుకంటే? భర్త మాట్లాడినా.. ఆఖరికి తన పిల్లలు నవ్వినా తట్టుకోలేదు. కనీసం క్రిస్మస్ పండుగ రోజు కూడా ఆమె వేరే గది కిటికి నుంచి తన కుంటుంబం ఆనందంగా సెలబ్రేట్ చేసుకువడాన్ని చూడాల్సిందే తప్ప వారితో కలిసి ఎంజాయ చేయలేదు. ఆమెకు ఈ వ్యాధి 2022లో అకస్మాత్తుగా వచ్చింది. తర్వాత క్రమక్రమంగా పరిస్థితి దిగజారి తన ఇంట్లోనే తాను వేరుగా ఉండే స్థితికి వచ్చేసింది. ఇంతకీ హైపరాక్యుసిస్ అంటే ఏమిటంటే .. హైపరాక్యుసిస్ అంటే.. హైపరాక్యుసిస్ అనేది ఆ వ్యాధి తీవ్రత బట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధి బారినపడ్డ వారికి నిత్యం వినిపించే శబ్దాలే వాళ్లకి బిగ్గరగా వినిపిస్తున్నట్లు ఉంటుంది. ఇది చాలా బాధకరంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తలకు నాణేలు శబ్దం నుంచి.. కుక్క అరవడం, కారు ఇంజిన్ శబ్దం, ఎవరైనా చూయింగ్ గమ్ నమలడం, వాక్యూమ్ క్లీనర్ శబ్దం ఇలా దేన్ని భరించలేరు. ప్రతీ శబ్దం వారిపై ప్రభావం చూపిస్తుంటుంది. తల పగిలిపోయేంత నొప్పి.. ఇక కరెన్ ఈ వ్యాధి కారణంగా ఇయర్ ప్లగ్స్, ఇయర్ డిఫెండర్స్ వంటివి పెట్టుకుంటూ ఉంటుంది. కేవలం సైగలు, రాతలతోనే కుటుంబంతో సంభాషిస్తారామె. ఇది తనకు ఎగజిమ్ముతున్న లావా లాంటి పదార్థాన్ని చెవిలో పోసినట్లు అనిపిస్తుందని వేదనగా చెబుతోంది కరెన్. అంతేగాదు తల పగిలిపోయేలా, తలంతా నొప్పిగా అనిపిస్తుందట. ఒకరకమైన మైగ్రెన్ నొప్పిలా ఉంటుందని అంటోంది. ఒక్కోసారి ఇది భరించలేకు తలను రెండు ముక్కలు చేయాలనిపిస్తుందని ఆవేదనగా చెబుతోంది. ఈ వ్యాధి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యింది. తన ఏడేళ్ల, పదుకొండేళ్ల పిల్లలకు దూరమయ్యానని వేదనగా చెప్పుకొచ్చింది. చివరికి తన భర్తతో కలిసి ఆనందంగా బయటకు వెళ్లలేను, అస్సలు ఏం చేయలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒకరకంగా తన జీవితాన్ని మొత్తం కోల్పోయానని బాధగా చెప్పారామె. ఇక కరెన్ విమాన సిబ్బందిగా పనిచేసేది. దాన్నేమె ఉద్యోగం గాక గుర్తింపుగా భావించేదని కరెన్ భర్త నిక్ అన్నారు. తాము ఎప్పుడూ ఎలాంటి ప్లాన్లు లేకుండా హాయిగా ట్రిప్స్‌కి వెళ్లిపోయి ఎంజాయ్ చేసేవాళ్లం ఇప్పుడూ పరిస్థితి అర్థంకానీ విధంగా భారంగా మారిపోయిందన్నారు. అయితే ఈ వ్యాధికి చికిత్స మాత్రం లేదట. ఇలాంటి సమస్యతో బాధపడే కొందరు రోగులకు వైట్ నాయిస్ వంటి శబ్దాలను వినేలా చేసి ఆ శబ్దాలను భరించే స్థాయిలను అభివృద్ధి చేస్తున్నట్లు యూకే జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. ఇక్కడ వైట్ నాయిస్ అంటే నిరంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే చిన్న శబ్దాలు. అయితే ఈ వినసొంపైన చిన్న శబ్దాలు ప్రకృతికి సంబంధించివైనా ఉండొచ్చు. కానీ కరెన్ విషయంలో ఇది కూడా పనిచేయలేదు. ఆఖరికి పలురకాల థెరఫీలను ప్రయత్నించారు. అవి కూడా పనిచేయలేదు. తన పిల్లల గురించే తాను ఈ వ్యాధి చికిత్స కోసం 18 నెలలుగా అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కరెన్ ఏదో ఒక రోజు తన వ్యాధి నయమయ్యే చికిత్స లభిస్తుందని ఆశగా ఎదురచూస్తుంది. నిజంగా ఇది మాటల్లో చెప్పలేనంత దయనీయమైన స్థితి కదూ.! (చదవండి: రెడ్‌లైట్ థెరఫీతో షుగర్ వ్యాధిని తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
చెవిలో హోరుమని శబ్దమా? అయితే అనుమానించాల్సిందే!
జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, విరేచనాలూ, వాంతులూ... ఇలా మనలో నిత్యం కనిపించే సాధారణ లక్షణాలు ఏవి కనిపించినా అది కరోనాకు చెందిందే అని అనుమానించే పరిస్థితి. అలాంటిది... నిన్న మొన్నటివరకూ ఒక్క చెవి మాత్రమే కాస్త వెసులుబాటుగా ఉండేది. ఇప్పుడు చెవికి సంబంధించిన ఓ సమస్య సైతం కరోనాను అనుమానించే లక్షణంగా పేర్కొంటున్నారు నిపుణులు. సరికొత్త అధ్యయనాల ప్రకారం... చెవిలో రింగుమనే హోరు కరోనా లక్షణాలను సూచిస్తోందని చెబుతున్నారు. ఆ కొత్త లక్షణం గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ సంక్షిప్త కథనం. ఇటీవల కరోనా / కోవిడ్–19 సోకిన వారిలో చెవులో హోరున శబ్దం కూడా ఓ లక్షణంగా కనిపిస్తోందని సరికొత్త అధ్యయనాల్లో తేలింది. ఇప్పటివరకూ టినైటస్ అనే కండిషన్లో ఏదో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉన్నట్లుగా చెవిలో గుయ్ మంటూ లేదా రింగుమంటూ హోరు వినిపించేది. అచ్చం అలాంటి హోరే ఇప్పుడు కోవిడ్–19 అటాక్ అయినప్పుడు కొంతమందిలో కనిపించడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. దాంతో ఇప్పుడు చెవిలో టినైటస్ హోరు, వినికిడి లోపాలను సైతం కోవిడ్ లక్షణాల్లోని ఒకటిగా ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఈ తరహా సమస్యలు మొత్తం కోవిడ్ రోగుల్లోని 7 – 20 శాతం మందిలో కనిపిస్తున్నట్లు అధ్యయనవేత్తలు గుర్తించారు. గతంలోనూ శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కొన్ని రోజుల తర్వాత చెవిలో టినైటస్ లాంటి రింగింగ్ హోరుతో పాటు ఒకింత అరుదుగా కొందరిలో వినికిడి సమస్యలు రావడం, వర్టిగో వంటి లక్షణాలు కనిపించడం జరిగేది. ఇప్పుడు కరోనా కూడా అలాంటి వైరల్ ఇన్ఫెక్షనే కావడం వల్లనో ఏమోగానీ అచ్చం అదే తరహ లక్షణాలు / కోవిడ్–19 ఇన్ఫెక్షన్ తర్వాత కూడా కనిపిస్తున్నాయి. అయితే చిత్రం ఏమితంటే... చెవిలో హోరు, వర్టిగో, వినికిడి సమస్యలు అనేవి కొంతమంది లో తాత్కాలికంగా కొంతకాలంపాటే కనిపించి... ఆ తర్వాత పూర్తిగా నార్మల్ అయినప్పటికీ... మరికొంతమందిలో మాత్రం... పైన పేర్కొన్న చెవి సమస్యలు శాశ్వతంగా ఉండిపోతున్నాయి. మరికొందరిలో బినైన్ పెరాక్సిమల్ పొజిషన్ వర్టిగో (బీపీపీవీ) లక్షణాల్లాగా ఉండిపోతున్నాయి. అంటే హానికరం కాని వర్టిగో మాదిరిగా అన్నమాట. ఇక ఇలాంటి సమస్యలన్నీ మళ్లీ అందరిలోనూ ఒకేలా చోటు చేసుకోవడం లేదు. కొందరిలో ఒక చెవిలో మాత్రమే సమస్య కనిపించడం, మరికొందరిలో రెండు చెవుల్లోనూ ఉండటం జరుగుతోంది. అలాగే ఈ లక్షణాలూ, తీవ్రత ప్రభావాలు సైతం ఒక్కొక్కరిలో కొందరిలో 30 శాతం నుంచి మరికొందరిలో 90 శాతం వరకు ఉండటం మరో విశేషం. అలాగే పెద్దవయసు ఉన్నవారిలోనూ, వారిలో ఇతరత్రా ఏవైనా రోగ్య సమస్యలు ఉన్నప్పుడూ ఇలాంటి చెవి సమస్యల తీవ్రత ఎక్కువగా, ఉన్నట్లు పరిశీలనలో తేలింది. ఇలా ఎందుకు జరుగుతోందనే అంశంపై ఇప్పుడు మరింత విస్తృతమైన అధ్యయనాలు జరుగుతున్నాయి. చెవి దిబ్బడ.. వినికిడి లోపం.. ఏం చేయాలి..? ఇప్పుడు అకస్మాత్తుగా వినికిడి లోపంగానీ లేదా చెవిలో ఆగని హోరుగానీ కనిపించే వారు ఇప్పుడు దాన్ని కూడా కోవిడ్–19 లక్షణాల్లో ఒకటిగా పరిగణించి తక్షణం కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించి, వారి సూచనలతో వినికిడి పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలి. దీనివల్ల వినికిడి కోల్పోకుండా ఉండటానికి లేదా కోల్పోయిన వినికిడి శక్తిని దాదాపుగా చాలావరకు పునరుద్ధరించుకోడానికి వీలవుతుంది. ఇందుకోసం ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత మంచిది. అంటే ఇలాంటి లక్షణాలు కనిపించిన 24 గంటలలోపే చికిత్స మొదలుపెట్టడం మేలు. లేదంటే సమయం గడిచేకొద్దీ నార్మల్ అయ్యేందుకు గల అవకాశాలు క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉండవచ్చు. చికిత్స తొలిదశల్లో వినికిడి సమస్యలను మామూలు సమయంలో ఇచ్చే చికిత్సలతోనే వినికిడిని పునరుద్ధరించడానికి ప్రయత్నించవచ్చు. అయితే వినికిడి శక్తిని పూర్తిగా పొందలేని వారికి కాక్లియర్ ఇంప్లాంట్తోనూ చికిత్స చేసి వినికిడి లోపాన్ని సరిచేయవచ్చు. అలాగే ఇప్పుడు కోవిడ్ వల్ల కలిగిన లక్షణాలకూ గతంలో టినైటస్, బ్యాలన్సెంగ్ కోల్పోయినప్పుడు చేసే చికిత్సలనే చేసి ఫలితాలను రాబట్టవచ్చు. అయితే చెవిలో హోరు ఒక లక్షణంగా కనిపిస్తున్నవారూ... పోస్ట్ కోవిడ్ తర్వాత వినికిడి తగ్గినట్లుగా అనిపిస్తున్నవారు వీలైనంత త్వరగా ఈఎన్టీ నిపుణలను సంప్రదించడం మంచిది. డాక్టర్ ఈ.సీ. వినయకుమార్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ -
మిమ్మల్నే మీకు వినపడుతోందా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ జనాభాలో ప్రతీ నలుగురిలో ఒకరు 2050 నాటికి వినికిడి సమస్యతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. బుధవారం ‘వరల్డ్ హియరింగ్ డే’ను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా చెవుడుకు సంబంధించిన అంశాలపై ఒక నివేదిక విడుదల చేసింది. చెవుడుకు కారణాలు, దాని నియంత్రణకు సరైన కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఇక నుంచి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది. వినికిడి లోపాల నివారణకు జాతీయ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. వినికిడి లోపం వల్ల పరస్పర సంభాషణ జరగదు. పైగా విద్య, ఉపాధికి దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 18 మందిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 2050 నాటికి వినికిడి లోపం (ఏదో ఒక స్థాయిలో... అంటే ఓ మోస్తరు నుంచి తీవ్రమైన వినికిడి సమస్యలు) ఉన్నవారి సంఖ్య 250 కోట్లకు పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. అందులో 70 కోట్ల మందికి తప్పనిసరిగా ఏదో రకమైన పరికరం, లేదా వారికి అవసరమైన సాయం తప్పనిసరి. చెవుడును ప్రజారోగ్య సమస్యగా గుర్తించాలని స్పష్టం చేసింది. తక్కువ సౌండ్‌తో వినడం మంచిది చిన్నతనంలో వైరస్, బ్యాక్టీరియా వంటి వాటివల్ల చెవుడు వస్తుంది. బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో పూర్తిగా వినికిడి లోపం వస్తుంది. రూబెల్లా, మెదడు వాపునకు వ్యాక్సిన్ వేయడం ద్వారా చిన్నపిల్లల్లో వచ్చే వినికిడి సమస్యలను 60 శాతం తగ్గించొచ్చు. అలాగే చీముతో వచ్చే ఇన్ఫెక్షన్లను ఆరంభంలోనే గుర్తించి నియంత్రించాలి. మాతృత్వ సేవలు మెరుగుపరచడం వంటివి చేయాలి. పెద్దయ్యాక ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉంటాయి. కానీ వారిలో శబ్ద కాలుష్యం వల్ల చెవుడు వస్తుంది. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, టీవీల్లో, మ్యూజిక్ సిస్టమ్స్‌లలో (ఇయర్‌ఫోన్స్‌లో కూడా) వాల్యూమ్‌ను పరిమితికి లోబడి ఉండేలా చూసుకోవడం, చెవులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వినికిడి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. కొన్ని మందులు చెవి సామర్థ్యాన్ని తగ్గించేవి ఉంటాయి. ఉదాహరణకు ఎమెనో గ్లైకోజైడ్స్ వర్గానికి చెందిన యాంటీబయాటిక్ మందుల వాడకం కొందరిలో చెవుడుకు దారితీ స్తుంది. 50 శాతం వరకు వినికిడి సమస్య వచ్చాకే బయటపడుతుంది. అప్పటివరకు చాలామంది గుర్తించలేరు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానంతో ముందే గుర్తించవచ్చు. వినికిడి సమస్య ఉన్నవారు తరచుగా చెక్ చేసుకోవాలి. చిన్న లోపం ఉన్నా ప్రారంభంలోనే డాక్టర్ సలహా తీసుకోవాలి. 10 లక్షల జనాభాకు ఒకరే ఈఎన్టీ డాక్టర్ వినికిడి లోపం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. చెవుడు వల్ల వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంతేకాదు సమాజంలో వివక్షకు గురవుతారు. అలాంటి వారు వైద్యున్ని కూడా సంప్రదించకుండా మధనపడతారు. అల్పాదాయ దేశాల్లో ఈఎన్టీ డాక్టర్లు చాలా తక్కువగా ఉన్నారు. 78 శాతం పేదదేశాల్లో 10 లక్షల జనాభాకు ఒక్క ఈఎన్టీ డాక్టర్ కూడా లేడు. ఆడియాలజిస్ట్ (వినికిడి పరీక్షించేవారు), స్పీచ్ థెరపిస్ట్‌లు ఇంకా తక్కువ ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అందువల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ల్లో వినికిడి సమస్యలకు చికిత్స జరగాలి. జనాభాలో ఎంతమందికి వినికిడి సమస్య ఉందో లెక్క తేల్చాలి. సార్వజనీన ఆరోగ్య పథకంలో వినికిడి సంబంధిత వ్యాధులను చేర్చాలి. -
‘విన్నారా’ ప్రతీ నలుగురిలో ఒకరికి సమస్య : డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: వినికిడి సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సంచలన విషయాలను వెల్లడించింది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య ఉంటుందని తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిలో ఒకరికి ప్రస్తుతం వినికిడి సమస్యలున్నాయని తాజా నివేదికలో తెలిపింది. కానీ "రాబోయే మూడు దశాబ్దాలలో వీరి సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ కావచ్చని డబ్ల్యూహెచ్‌వో మంగళవారం హెచ్చరించింది. 2019లో వినికిడి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 160 కోట్లుగా ఉండగా, రానున్న మూడు దశాబ్దాల్లో ఈ సంఖ్య 250 కోట్లకు చేరనుందని హెచ్చరించింది. నివారణ, చికిత్సలో అదనపు పెట్టుబడులు పెట్టాలని ప్రపంచదేశాలకు పిలుపు నిచ్చింది. వినికిడి సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించడంలో ప్రపంచదేశాలు వైఫల్యం చెందుతుండటం వల్ల ప్రతి ఏడాది ట్రిలియన్ డాలర్లు కోల్పోతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ అంచనా వేశారు. వినికిడిపై మొట్టమొదటి ప్రపంచ నివేదిక ప్రకారం, అంటు వ్యాధులు, శబ్ద కాలుష్యం, మానవ జీవనశైలిలో వచ్చిన మార్పులే వినికిడి సమస్యలకు కారణమని తెలిపింది. అయితే అంటువ్యాధులు, జన్యుపాలు, భారీ శబ్దాలు లాంటి వాటిని నివారించవచ్చని తెలిపింది. దీని చికిత్స కోసం డబ్ల్యూహెచ్ఓ ప్యాకేజీని కూడా ప్రతిపాదించింది. ప్రతి సంవత్సరం కొన్ని ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నప్పటికి వినికిడి సమస్యను నివారించలేకపోయామని డబ్ల్యూహెచ్ఓ వివరించింది. తాము అంచనా వేసినట్టుగా 250 కోట్ల మందిలో 70 కోట్ల మందికి సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని, వారికి చికిత్స తప్పనిసరని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో భారీ శబ్దాలను నివారించడంతో పాటు, వినికిడి లోపం కలిగించే మెనింజైటిస్ వంటి వ్యాధులకు టీకాలు పెంచడం లాంటి ప్రజారోగ్య కార్యక్రమాలతో సహా, భారీ ప్యాకేజీని ప్రతిపాదించింది. అలాగే క్రమబద్ధమైన స్క్రీనింగ్‌ను కూడా సిఫారసు చేసింది. తద్వారా పిల్లల్లో, 60 శాతం కేసులలో వినికిడి లోపాన్ని నివారించవచ్చని నివేదించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి సంవత్సరానికి సగటున 1.33 డాలర్ల(రూ. 97.67) ఖర్చు అవుతుంది. -
గల్ఫ్‌దేశాలకు ఆదేశాలు ఎలా ఇస్తాం?
సాక్షి, న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో వేధింపులకు గురవుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని కార్మికుల దుస్థితిపై తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పట్కూరి బసంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించింది. గల్ఫ్ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోని వారికి సరైన జీతాలు చెల్లించకపోవడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నారని, నకిలీ ఏజెంట్లు గల్ఫ్ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ధర్మాసనానికి నివేదించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. దేశ ప్రగతికి దోహదం చేస్తున్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించాలని కోరారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ విదేశాల్లో ఉన్న భారతీయుల విషయంలో ఆదేశాలు ఇవ్వలేమని, భిన్నమైన దేశాల్లో భిన్నమైన చట్టాలు ఉండటం వల్ల ఆయా దేశాలకు ఆదేశాలివ్వడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. పిటిషనర్ లేవనెత్తిన సమస్యలను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వానికి సూచించగలమని చెప్పారు. దీనికి బదులిచ్చిన న్యాయవాది శ్రవణ్ కుమార్, తాను కేవలం గల్ఫ్ దేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే కాక వాటికి కారణమైన నకిలీ ఏజెంట్లపై సీబీఐ విచారణ జరపాలని కోరుతున్నానని వివరించారు. నకిలీ ఏజెంట్ల ముఠాలు కేవలం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలో, విదేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సీబీఐ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. -
వినికిడి యంత్రాలు అందించడం అభినందనీయం
జూబ్లీహిల్స్: వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా యంత్రాలు అందించడం అభినందనీయమని సినీ నటి సమంత అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఫోనాక్–ఓం (హియరింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిలెడ్) సంయుక్త ఆధ్వర్యంలో వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు శుక్రవారం ఉచితంగా యంత్రాలు అందజేశారు. సమంత ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఓం సంస్థ ఎండీ ఎస్.రాజా, ఫోనాక్ సంస్థ ప్రతినిధి స్నేహా మాయేకర్ తదితరులు పాల్గొన్నారు. -
వినపడట్లేదు! గుర్తించట్లేదు..!
నవజాత శిశువులకు వినికిడి సమస్యలు శాపంగా మారుతున్నాయి. దేశంలో ప్రతి 1,000 మందిలో 300 మందికి వినికిడి సంబంధిత సమస్యలున్నట్లు కాక్లియర్ ఇండియా సంస్థ తాజా సర్వేలో తేలింది. ఇటు ఆస్పత్రులు, అటు తల్లిదండ్రుల్లోనూ వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించాలన్న స్పృహ లేకపోవడంతో... చిన్నారుల బంగారుభవిష్యత్తుపై వినికిడి లోపాలు దుష్ప్రభావం చూపుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులు మినహా మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రసూతి కేంద్రాలు, ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లలో వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించే ల్యాబ్‌లు లేకపోవడం చిన్నారుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరీక్షల విషయంలో కేరళ ఆదర్శంగా నిలుస్తోందని సర్వే పేర్కొంది. ఈ రాష్ట్రంలో సామాజిక భద్రతా మిషన్‌లో భాగంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లలో నవజాత శిశువులకు వినికిడి సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాగా అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, యూకే దేశాల్లో నవజాత శిశువులకు వినికిడి సంబంధ పరీక్షలను సమగ్రంగా నిర్వహిస్తున్నారని వెల్లడించింది. ఈ నెల 3న ప్రపంచ వినికిడి దినోత్సవం (వరల్డ్ హియరింగ్ డే) సందర్భంగా ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది. ఇలా గుర్తించాలి.. శిశువు జన్మించిన 24 గంటల తరవాత తొలిసారిగా వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించాలి. ఆ తరువాత మరో ఆరు నెలలకు ఈ పరీక్షలను విధిగా నిర్వహించాలి. కానీ పలు నగరాల్లో ఈ పరిస్థితి లేదు. దీంతో చిన్నారులకు రెండేళ్లు వచ్చే వరకు దీనిపై నిర్లక్ష్యం చేయడంతో సమస్య జఠిలంగా మారుతోందని ఈ సర్వేలో తేలింది. చాలా మంది తల్లిదండ్రులకు ఈ విషయం తెలియకపోవడం శాపంగా మారుతోందని, నవజాత శిశువుల్లో వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రతి ఆస్పత్రి, ప్రసూతి కేంద్రాల్లో అటో అకౌస్టిక్ ఎమిషన్స్, ఆడిటర్ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ లాంటి పరికరాలతో ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకు కేవలం రూ.4 లక్షలు మాత్రమే వ్యయమవుతుందని ఆడియాలజీ నిపుణురాలు విష్ణుప్రియ ‘సాక్షి’కి తెలిపారు. 50 శాతం వినికిడి సమస్యలను నివారించేందుకు శిశువులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించడం, స్క్రీనింగ్ చేయించడం, అధిక ధ్వనులు చిన్నారులు వినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్వే సూచించింది. ప్రధాన కారణాలు.. ♦ జన్యుపరంగా పుట్టుకతో వచ్చే లోపాలు. ♦ మాతృత్వ సమయంలో తల్లులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం. ♦ చిన్నారులు గాయాలు, ప్రమాదాల బారినపడడం. ♦ గర్భిణులు, చిన్నారులు అధిక శబ్దాలు వినడం. ♦ గర్భిణులు విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్, ఆటోటాక్సిక్ డ్రగ్స్ వినియోగించడం. ♦ చిన్నారులు మీజిల్స్, మమ్స్ బారినపడడం. సర్వే ఫలితాలివీ... ♦ ప్రతి వెయ్యి మందిలో 5–6 మంది పుట్టుకతోనే వినికిడి సమస్యతో జన్మిస్తున్నారు. ♦ శిశువుకు రెండేళ్లు వచ్చే వరకు చాలామంది తల్లిదండ్రులు వినికిడి సమస్యను గుర్తించడం లేదు. ♦ 84 శాతం మంది తల్లులు తమ చిన్నారులకు వినికిడి పరీక్షలు నిర్వహించేందుకు సమ్మతించినా.. ఎక్కడా ఇందుకు సంబంధించిన పరికరాలు లేకపోవడం గమనార్హం. ♦ 75 శాతం మంది తల్లులు ఈ సమస్యను ఆదిలోనే గుర్తిస్తే సమస్య జఠిలం కాకుండా ఉంటుందని భావిస్తున్నారు. ♦ చెవిలో తలెత్తే ఇన్ఫెక్షన్లే వినికిడి సమస్యలకు ప్రధాన కారణమని తల్లులు భావిస్తున్నారు. ♦ ప్రతి 10 మంది తల్లుల్లో ముగ్గురు వినికిడి సమస్యలున్న తమ చిన్నారులు ఇతర చిన్నారుల్లా సాధారణ జీవితం గడపలేరని భయాందోళనలకు గురవుతున్నారు. ♦ చిన్నారులకు వినికిడి సమస్య ఉందని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తున్నారు. అదనపు సమాచారం కోసం ఆన్‌లైన్‌లోనూ శోధిస్తున్నారు. ♦ ప్రపంచ జనాభాలో సుమారు 5 శాతం మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు. ♦ ప్రపంచవ్యాప్తంగా 360 మిలియన్ల మంది బాధితులు ఉండగా.. ఇందులో 91 శాతం పెద్దలు, 9శాతం చిన్నారులు. ♦ 1.10 బిలియన్ల యువత తాము వినియోగించే హెడ్‌ఫోన్స్, మ్యూజిక్ ఉపకరణాలతోనే ఈ సమస్యలో చిక్కుకున్నట్లు తేలింది. వినికిడి సమస్యలు.. ♦ చిన్నారులు సరిగా మాట్లాడలేకపోవడం. ♦ మాతృభాష ఉచ్ఛారణ సరిగా లేకపోవడం. ♦ భవిష్యత్‌లో చదువులో చురుగ్గా రాణించలేకపోవడం. ఉపాధ్యాయులతో సరిగా మాట్లాడలేకపోవడం. ♦ ఇతర పిల్లలతో కలిసి ఉండకపోవడం. -
వినికిడి సమస్యలకు యువత అతిదగ్గర్లో ఉంది జాగ్రత్త!
కొత్త పరిశోధన ఇప్పటి ప్రపంచ యువతలో 1.1 బిలియన్ టీనేజ్ పిల్లలు వినికిడి సమస్యలకు అతి దగ్గర్లో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, ఐ-పాడ్స్ వంటి అత్యాధునిక ఉపకరణాలను యధేచ్ఛగా వాడుతున్న యువత ఎప్పుడూ ఇయర్ఫోన్లతో సంభాషణ చేస్తుండటం, సంగీతం వినడం కోసం నిత్యం ఇయర్ ఫోన్స్‌ను ఉపయోగిస్తూ ఉండటం వల్ల వారు వినికిడి సమస్యల బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అత్యధిక ఆదాయ దేశాల నుంచి ఒక మోస్తరు ఆదాయ దేశాల్లోని 12 నుంచి 35 ఏళ్ల వయసున్న యువత అవసరమైన మోతాదు కంటే ఎక్కువ శబ్దాలను వింటూ తమ చెవులకు శ్రమ కలిగిస్తున్నారని, వీరిలో 40 శాతం మంది యువత నైట్‌క్లబ్స్, పబ్స్ వంటి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వినికిడి సమస్యలకు తామే ఆహ్వానం పలుకుతున్నారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటోంది. పై వినోద ప్రదేశాలలో చాలా ఎక్కువ శబ్దం ఉంటోందనీ, కేవలం 85 డెసిబల్స్ నుంచి 100 డిసిబల్స్ శబ్దానికి 15 నిమిషాలపాటు ఎక్స్పోజ్ కావడమే చెవిలోని సెన్సరీ కణాలకు తీవ్రంగా నష్టం చేస్తుందనీ, ఇది మళ్లీ రిపేర్ చేసేందుకు కూడా వీలుకాని నష్టమని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్ఓ!